H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture
AndhraPradesh #AreKatika Sangh State Secretary #Khatik ఆంధ్రప్రదేశ్ #ఆరెకటిక సంఘం రాష్ట్రకార్యదర్శి.

Aug 1, 2021, 11 tweets

తల్లి పాల దినోత్సవం ✨ #WorldBreastFeedingDay #BreastFeedingWeek
తల్లిపాలు - శ్రేష్టం మరియు ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం.తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది.ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతంది.
ముఖ్యమైన మరియు శ్రేష్టమైనది - మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి.

దీనివలన బిడ్డకు జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉండవు. జీర్ణకోశ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చాలా తేలికగా అరుగుదల అవుతంది. బిడ్డకు మలబద్దక సమస్య ఉండదు. తల్లిపాల వలన ఆస్తమా, చెవి సంబందించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

తల్లిపాలవలన-స్ధూలకాయం ఉండదు ఇది శాస్త్రవేత్తల పరిశోధన వలన తెలుస్తుంది. తల్లిపాలు-పిల్లల దశలో లుకేమియా వ్యాధి రాకుండాను అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి పెద్దవయస్సులో రాకుండా కాపాడుతుంది.

తల్లిపాలు- పిల్లల తెలివి తేటలను పెంచుతంది. తల్లి పాలలో చాలా ఫాటీ ఆసిడ్స్ ఉన్నందున, ఇవి పిల్లలలో మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతంది. తల్లి పాలు అనుకూలమైనవి. ఇందుకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అతి ముఖ్యమైన విషయం, తల్లి బిడ్డల మధ్య భాంధవ్యం పెరుగుతుంది.

తల్లి ఓడిలో బిడ్డ ఉన్నందున బిడ్డ చాలా అనుకూలమైన స్ధితిలో ఉంటుంది.
ఇక తల్లికి లాభాలు - తల్లిపాలు ఇచ్చినందు వలన తల్లికి ప్రసవానంతర సమయంలో బరువు తగ్గుటకు దోహదపడుతుంది. మానసిక వత్తిడిని తగ్గించి బాలింత దశలో రక్తస్రవాన్ని తగ్గిస్తుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్

లాంటివి రాకుండా స్త్రీని కాపాడుతుంది. ఎంత ఎక్కువ కాలం తల్లి బిడ్డకు పాలు ఇస్తే అంత మంచిది. వ్యాధులు నుండి అంతే ఎక్కువ కాపాడుతుంది. ఆవు లేక గేది పాలు తీసుకున్న పిల్లలు ఎక్కువ అలర్జీ సమస్యలకు గురి అవుతారు.

ఎప్పుటి నుండి తల్లి పాలు మొదలు పెట్టాలి - ప్రసవం అయిన వెంటనే ఎంత తొందరగా మొదలు పెడితే అంతమంచిది. ప్రసవం అయిన వెంటనే శిశువును శుభ్రపరిచిన వెంటనే తల్లి చర్మం తగులునట్లు, తల్లి రోమ్ములకు దగ్గరలో బిడ్డను ఉంచినచో బిడ్డ శరీర ఉష్ణోగ్రత పెంచుతుంది. తల్లి పాలు వచ్చుటకు ప్రేరేపణ జరుగుతంది

తల్లీ బిడ్డల మద్య ప్రేమ పెరుగుతుంది.
ఎందుకు వెంటనే తల్లి పాలు ఇవ్వాలి? దానికి గల కారణాలు?
కారణాలు 4 అవిశిశువు పుట్టిన మొదటి 30 నుండి 60 నిమిషాలు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సమయంలో పాలు చీకటానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది.వెంటనే తల్లి పాలు ఇవ్వటం వలన, అదికూడా కోలాస్ట్రం మెట్టమొదట

వచ్చే పాలలో ఉంటుది.ఇది త్రాగించటం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులనుండి దూరంగా ఉంచుతుంది. ఇది ఒక టానిక్ లా పనిచేస్తుంది.రొమ్ము వాపు నొప్పిని తగ్గించి బాలింత దశలో రక్తస్రవాన్ని తగ్గిస్తుంది.తల్లులు ఆపరేషన్ ద్వారా కానుపు అయినాకాని, తల్లిపాలు 4గంటల తరువాత ఇవ్వవచ్చు.

తల్లిని ఒక ప్రక్కకు త్రిప్పి పాలు పట్టించవచ్చు.ఎంతకాలం వరకు ఇవ్వవచ్చు?
మొదట 6నెలలు ప్రత్యేకం.ఆ తరువాత రెండు సంవత్సరాల వరకు ఆపైన కూడా ఇవ్వవచ్చు.రొమ్మునుండిపాలుకారుట - ఇది చాలా సామాన్యమైనది.

రొమ్ముల వెలుపలి ఖాళీని చేతులతో నోక్కిపట్టినచో కొంత తగ్గవచ్చు. అనారోగ్యంగా ఉన్న తల్లి కూడ పాలు ఇవ్వవచ్చును. టైఫాయిడ్, మలేరియా, టిబీ, లాంటి సమయంలో కూడా ఇవ్వవచ్చు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling