H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture
AndhraPradesh #AreKatika Sangh State Secretary #Khatik ఆంధ్రప్రదేశ్ #ఆరెకటిక సంఘం రాష్ట్రకార్యదర్శి.

Aug 1, 2021, 6 tweets

#sistersday #sisterlove #sisters 👧
ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలున్నప్పటికీ.. సోదర సోదరీల బంధం చాలా అందమైనది. ఒకే ఇంట్లో చిన్నప్పటి నుండి తిట్టుకుంటూ.. కొట్టుకుంటూ.. ఉండే సోదర సోదరీలు.. సోదరీమణులు పెద్దయ్యాక మాత్రం ఒక్కసారిగా మారిపోతారు. చాలా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచుకుంటారు.

అందుకే మదర్స్ డే, ఫాదర్స్ డే మాదిరిగా సిస్టర్స్ డే అనేది తోబుట్టువులకు అంకితం ఇవ్వబడింది.

మన దేశంలో ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటాం. అదే అమెరికాలో ప్రతి సంవత్సరం ఆగస్టు రెండో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటారు.

ఈరోజున సోదరీమణులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతారు. ఈరోజున తమ జీవితంలో సోదరీమణులు ఎంత ముఖ్యమో వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ చెప్పడానికి ఒక్కరోజు సరిపోకపోయినా.. ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడం ద్వారా వారిపై ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేస్తారు.

ఈ సిస్టర్స్ డే వేడుకను తొలిసారిగా అమెరికాలో డెబోరా టాన్నెన్ ప్రారంభించారు. అయితే మీకు తోబుట్టువులు లేకపోతే మీరు సోదరితోనే కాకుండా.. కజిన్స్ తో కూడా ఈ వేడుకలను జరుపుకోవచ్చు.

సిస్టర్స్ డే సందర్భంగా తోబుట్టువులందరితో పాటు ఇతర సోదరీమణులందరికీ తాము అండగా ఉంటామని

ఈరోజున ప్రత్యేకంగా గుర్తు చేస్తారు. అందుకే సోదరీమణులతో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన బంధాన్ని కలిగి ఉంటారు.

ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు సోదరీమణులు ఒకేలా ఉండరు. వారి ఇష్టయిష్టాలు, అభిరుచులు, అలవాట్లు, ప్రేమ ఇతర విషయాలన్నింటిలో వారి ఆసక్తులు వేర్వేరుగా ఉంటాయి.

అయినా కూడా ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడతారు. తొలిరోజుల్లో బాగా కొట్టుకున్నప్పటికీ.. తర్వాత కలిసిపోతారు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling