#CradleDay #Cradle
ఊయల లేదా ఉయ్యాల ఊగడం ఒక సరదాయైన పని. పిల్లలు ఎక్కువగా ఊయలలో కూర్చుని ఊగడానికి ఇష్టపడతారు. కొన్ని పెద్ద ఊయలలు పార్కులలో, ఇంటి పెరడు, మేడమీద కూర్చుని విశ్రాంతి తీసుకోడానికి ఉంచుతారు. ఒక్కసారి కదిలించి వదిలేస్తే కొంతకాలం ఒక లోలకం లాగా ఊగుతూ ఉంటుంది.
ఉద్యానవనాలలో వివిధ రకాల ఊయలలు ఒక ఆకర్షణ. ఉయ్యాల బల్ల సాధారణంగా కర్రతో చేసి, వాటిని తాళ్ళతో వేలాడదీస్తారు. ఇవి రకరకాల పరిమాణంలో ఒకరు లేదా ముగ్గురు వరకు కూర్చోడానికి అనువుగా తయారుచేస్తారు. బాగా చిన్నపిల్లల కోసం ఉయ్యాల బల్లకున్న కాళ్ళు పెట్టుకోడానికి అనువుగా రంధ్రాలుంటాయి.
కర్ర బల్లను బలమైన తాళ్ళతో పెద్ద చెట్టుకొమ్మకు కట్టి పెద్ద్ పిల్లలు, పెద్దవాళ్లు కూడ ఊగుతారు. మామూలు ఊయ్యాలలో 1-2 మీటర్లు ఎత్తుకు పోతే, ఈ రకమైన పెద్ద ఉయ్యాలలో 5-6 మీటర్ల ఎత్తుకు పోవచ్చు.
ఒక త్రాడుకు పాడైపోయిన రబ్బరు టైరుని చెట్టుకు కట్టి దాంట్లో కూర్చుని ఊగడం కూడా ఒకరకమైన ఊయల.
ప్రకృతిలో పొడుగ్గా బలమైన ప్రాకే మొక్కల కాండం క్రిందకి ఊగుతుంటే వాటిమీద కూర్చొని ఊగడం అడవులలోని చిన్నచిన్న గ్రామాలలో చూడవచ్చును.
సంస్కృతి
తెలుగువారు బిడ్డపుట్టిన తర్వాత జరిపే బాలసారె పండుగలో మొట్టమొదటగా పట్టుచీరతో కట్టిన ఉయ్యాలలో వేస్తారు.
అట్లతద్ది పండుగనాడు యువతులు, ముత్తైదువలు ఉయ్యాల లూగడం ఒక సంప్రదాయం.ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ, పాటలు పాడుతూ, నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటారు.
ఊరిలో వుంటే పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల కట్టి అమ్మాయిలంతా అక్కడచేరి ఆడిపాడతారు. ఈ సందట్లో మగవారికి ప్రవేశం లేదు. ఆడవారిదే రాజ్యం. తదియ రోజున ఊయల ఊగకపోతే ముసలి మొగుడొస్తాడని నమ్ముతారు.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.