H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture
AndhraPradesh #AreKatika Sangh State Secretary #Khatik ఆంధ్రప్రదేశ్ #ఆరెకటిక సంఘం రాష్ట్రకార్యదర్శి.

Oct 23, 2021, 9 tweets

#SnowLeopardDay ❄🐆 #Snow
మీరు చిరుత పులుల గురించి వినే ఉంటారు.కానీ మంచు చిరుతల గురించి ఎప్పుడైనా విన్నారా? భారత దేశంలో అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వీటి అరుదైన దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి. @LakshmiManchu @HeroManoj1 @iVishnuManchu

మంచు చిరుతలు

'ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటెన్‌ ఇదే'...
ఇండియాలో కనిపించిన మంచు చిరుత...

ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటెన్‌' సముద్ర మట్టానికి 9,800 నుంచి 17 వేల అడుగుల ఎత్తులో మంచు కొండలపై మాత్రమే కనిపించే అరుదైన చిరుతపులి.
మామూలు చిరుతకు పసుపు రంగు కళ్లుంటాయి.

కానీ వీటికి మాత్రం పచ్చగా, బూడిద రంగులో కళ్లు ఉంటాయి. వీటి తోకలు కూడా చాలా పొడవు. చలి నుంచి శరీరాన్ని తట్టుకునేలా ఐదు అంగుళాల మేరకు వెంట్రుకలను కలిగివుంటాయి. ఈ అందమైన మంచు చిరుత పులుల యొక్క దృశ్యాలను భారత విదేశాంగ సేవ అధికారి ఆకాశ్ కుమార్ వర్మ తన ట్విట్టర్ ఖాతాల్లో పంచుకున్నారు.

"నందా దేవి నేషనల్ పార్క్ లోని కెమెరాలు అరుదైన మంచు చిరుతలను బహిర్గతం చేశాయి... ఇలాంటి దృశ్యాలు ఆవిష్కృతమైనప్పుడు చిరునవ్వు అలంకరించుకుంటుంది... వన్యప్రాణులను ఇష్టపడే వారికి ఇది శుభవార్త అంటూ" ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కుమావున్ వెస్ట్రన్ సర్కిల్ చీఫ్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సిసిఎఫ్) దీనిపై మాట్లాడుతూ... ఈ అరుదైన దృశ్యాలు సముద్ర మట్టానికి 3100 మీటర్లు (10170 అడుగుల) ఎత్తులో నమోదు చేయబడ్డాయి అన్నారు. ఇందులో ఈ అంతుచిక్కని చిరుతపులి యొక్క భిన్నమైన ప్రవర్తనను గమనించవచ్చని అన్నారు.

ఈ చిరుత పులులు సాయం సంధ్య వేల ఎక్కువ చురుకుగా ఉంటాయి. ఇవి తెల్లవారు జాము, సాయంత్రం మరియు రాత్రి సమయంలో ఎక్కువగా బయటకు వస్తుంటాయి. ఈ సమయంలో అవి నీలి గొర్రెలను వేటాడతాయి. మంచు చిరుతలు వీటిని ఎక్కువగా ఇష్టపడతాయి.

భారత దేశంలో అంతరించిపోతున్న జంతు జాతుల్లో మంచు చిరుతలు ఒకటి. డెహ్రాడూన్ కు చెందిన వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ప్రకారం, భారత దేశంలో సుమారు 516 మంచు చిరుతలు ఉన్నాయి.

వాటిలో ఉత్తరాఖండ్ లో 86, హిమాచల్ ప్రదేశ్ లో 90, సిక్కింలో 30, అరుణాచల్ ప్రదేశ్ లో 42, జమ్మూ కాశ్మీర్ లో 285 ఉన్నాయి.

Did you know…?

Today is #SnowLeopardDay

On the 23rd of October in 2013, countries that are within the snow leopard range signed the Bishkek Declaration regarding the conservation of the snow leopard.

Do you know any #funfacts about snow leopards? ⬇

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling