#fountainpen #FountainPenDay
సిరా కలము దినోత్సవం ✍️🖋️✒️
ఫౌంటెన్ పెన్ అనేది ఒక పాళీ పెన్, ఇది మునుపటి డిప్ పెన్ లా కాకుండా ద్రవ సిరా యొక్క అంతర్గత రిజర్వాయర్ ను కలిగి ఉంటుంది. ఈ పెన్ను సిరాను ఒక ఫీడ్ ద్వారా రిజర్వాయర్ నుంచి కలం పాళీ గ్రహించేలా మరియు గురుత్వాకర్షణ మరియు
కేశనాళిక చర్య యొక్క కలయిక ద్వారా కాగితంపై నిక్షేపమయ్యేలా చేస్తుంది. ఈ పెన్నును లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్ కనిపెట్టాడు. ఫౌంటెన్ నుంచి నీరు పైకి చిమ్ముతున్నట్లుగా ఈ పెన్ నిబ్ యొక్క రంధ్రం నుంచి ఇంక్ వెలువడుతుంటుంది కనుక ఈ పెన్నును ఫౌంటెన్ పెన్ అంటారు.
ఫౌంటెన్ పెన్నుల యొక్క కొన్ని రిజర్వాయర్లలో ఇంక్ ను నేరుగా పోయవలసి ఉంటుంది, కొన్ని పెన్నులలో ఒత్తివదలడం పద్ధతి ద్వారా పీల్చుకునే రిజర్వాయర్ ఉంటుంది.
ఎడ్సన్ తన ఆశయాలను, పర్యాటక అనుభవాలను గ్రంథస్తం చేయాలనే ఆలోచనతో ఒక మంచి కలం తయారు చేయాలనుకున్నాడు. అప్పటి పెన్నులను మాటిమాటికి సిరాలో ముంచి వ్రాయవలసి వచ్చేది. మాటిమాటికి సిరాలో ముంచకుండా వ్రాయడమెలాగ అనే విధంగా ఆలోచించి ఫౌంటెన్ పెన్నును కనిపెట్టాడు.
దానిపై పేటెంట్ హక్కులు పొందాడు. పెన్నుల వ్యాపారం మొదలు పెట్టి తన పరిశోధనలతో నాణ్యమైన, సౌకర్యవంతమైన పెన్నులు తయారుచేశారు.
#FountainPenDay ఫాంటెన్ పెన్ డే ✒️
రత్నం పెన్ భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఫౌంటెన్ పెన్. 1930 లో రాజమహేంద్రవరం లో ఫౌంటెన్ పెన్‌లు తయారు చెయ్యడం ప్రారంభించిన రత్నం పెన్ వర్క్స్ నేటికీ కలాలు తయారు చేస్తోంది.భారత్ పర్యటనకు వచ్చిన జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెన్ను బహుమతిగా ఇచ్చారు.
అది ఏ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మాంట్ బ్లాంక్, పార్కర్ పెన్నో కాదు.. పూర్తి స్వదేశీది. పైగా.. అచ్చమైన తెలుగు నేలపై తయారైన ‘రత్నం’ పెన్ను అది. ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర.. మూడు తరాల వారసత్వం దీని ఘనత.
దేశ విదేశాలలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న 'రత్నం పెన్' ఆవిర్భావం వెనుక మహాత్మాగాంధీ ప్రేరణ ఉంది. 1921లో వార్ధాలో కె.వి.రత్నంగారు కలసికొని, హితి బ్లాక్ డైస్ (నగలకు సంబంధించి) తయారు చేసి గాంధిజీకి చూపించారు. త్వరలో విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వబోతున్నామని, అందుచేత సామాన్యులకు
ఉపయోగపడే వస్తువు తయారు చేయాలని గాంధీజీ చెప్పడంతో, అయితే ఏ వస్తువు తయారుచేయాలో చెప్పాలని రత్నంగారు అడగడం, పిన్ నుంచి పెన్ వరకు ఏదైనా తయారు చేయవచ్చని గాంధిజీ సూచించడంతో, పెన్ తయారీకే రత్నంగారు మొగ్గు చూపారు. ఏ విధంగా పెన్ తయారు చేయాలనే దానిఫై సర్వే చేసారు.
మచిలీపట్నం అయ్యగారి రామమూర్తి, మద్రాస్ కంపెనీ నుంచి సూచనలు తీసుకుని, 1930 లో పెన్నుల తయారీ ప్రారభించారు. 14 కేరట్ల బంగారు పాళీలు రూపొందించి, ఇంగ్లాండ్ నుంచి ఇరేడియం పాయింట్లు రప్పించి, పెన్నులు తయారు చేసారు. రత్నం పెన్ ని సబ్ జడ్జి కృష్ణమాచార్య తొలిసారిగా వాడారు.
1932లో హిందూ పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరైన న్యాపతి సుబ్బారావు పంతులుగారి షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా వచ్చిన ఆర్డర్ మేరకు వెండితో రెండు పెన్నులు తయారుచేసి, బంగారం పాళీలు అమర్చి అందించారు. అప్పట్లో ఈ విధంగా రూపొందించిన పెన్ను ఖరీదు కేవలం రెండు రూపాయల పావలా.
దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు రత్నం పెన్నులను వాడారు. మరెందరో రత్నం సంస్థను దర్శించారు. 1936లో తిరువనంత పురం మహారాజా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్, వివి గిరి, 1937లో పండిట్ నెహ్రూ, సి.ఆర్.రెడ్డి, మొసలికంటి తిరుమలరావు, ఆచార్య వినోబా భావే,
దుర్గాబాయి దేశముఖ్, కమలాదేవి ఛటోపాధ్యాయ, 1947 లో మద్రాస్ గవర్నర్ ఆర్చ్ బాల్డ్ నై, 1955 లో టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, 1958లో నీలం సంజీవరెడ్డి (మాజీ రాష్ట్రపతి), ఆనాటి గవర్నర్ భీమ సేన్ సచార్, తదితరులు రత్నం పెన్ వర్క్స్ సందర్శించి, పెన్నులు స్వీకరించారు.
రష్యా ప్రెసిడెంట్ బల్కానియాన్ క్రుచేవ్, అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్, జర్మనీ చాన్సలర్ అర్బన్ నాన్ తదితర ప్రముఖులకు రత్నం పెన్నులు పంపబడ్డాయి.
కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి, ప్రస్తుత పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, శృంగేరీ పీఠాధిపతి, పూరి శంకరాచార్య,
శివానంద ఆశ్రమ అధిపతి ఇలా ఎంతో మంది స్వామిజీలు రత్నం పెన్నులను స్వీకరించి, ఆశ్సీస్సులు అందించారు.రత్నం బాల్ పెన్ వర్క్స్ కి అనేక అవార్డులు లభించాయి. 2012 డిసెంబరులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైన రత్నం సన్ వర్క్స్,2014 మేలో ఎవరెస్ట్ వరల్డ్, సృజన పత్రికలలో చోటు దక్కించుకుంది.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.