నేడు కార్తీక మాసం ప్రారంభం మరియు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు కేదార్ నాథ్ నందు పునః నిర్మించిన జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల సమాధికి పూజాధికాలు నిర్వహించి, వారి విగ్రహాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భంగా
#Kedarnath #Pushpagiri #AdiShankaracharya
#KedarnathDham #Kadapa
కడప జిల్లా శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాధ స్వామి దేవస్థానం పుష్పగిరి గ్రామం వల్లూరు మండలం లో దేవస్థానం నందు నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నాను. 🙏
#AdiShankaracharya
#Kedarnath #Pushpagiri
*ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలోని ఏకైక శంకర ఆద్వైత పీఠం పుష్పగిరి పీఠం. ఇక్కడ అద్వైత పీఠాన్ని ఏర్పాటు చేసి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. చంద్రమౌళీశ్వర లింగాన్ని పీఠంలో ఉంచారు. పుష్పగిరి కడపజిల్లాలోని చెన్నూరుకు సమీపంలో పెన్నానది ఒడ్డున ఉన్న ప్రముఖ హరిహర క్షేత్రం
శంకర అద్వైత పీఠం స్థాపించక ముందు శాక్తేయ, పాశుపత, శైవ క్షేత్రంగా పుష్పగిరి విలసిల్లుతూ ఉండేది. ఆదిశంకరుడు భారతదేశంలోని నాలుగు దిశల్లో నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు. అవి తూర్పు (ఒడిషా) ప్రాంతంలో పూరీలో గోవర్ధన మఠం, దక్షిణాన (కర్ణాటక) శృంగేరీ మఠం, పశ్చిమాన (ద్వారక) కాళికా మఠం,
ఉత్తరాన (బద్రికాశ్రమం) జోతిర్ మఠం. ఆ తర్వాత శంకరాచార్య శిష్యులు దేశంలో వివిధ చోట్ల శంకరాచార్య పీఠాలను ఏర్పాటుచేశారని, వాటిల్లో శృంగేరి, కంచి, పుష్పగిరి పీఠాలు ఉన్నాయని చెబుతారు. సాక్షాత్తు జగద్గురు ఆది శంకరాచార్యుల వారే పుష్పగిరిలో అద్వైత పీఠాన్ని ఏర్పాటు చేశారని
కూడా ఒక భావన ఉంది. అప్పటి శృంగేరీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి పుష్పగిరిలో శంకారాచార్య పీఠాన్ని స్థాపించి , శ్రీచక్రాన్ని ప్రతిష్టించారని , అంతకుముందు శ్రీ శంకరాచార్య దేశాటనం లో భాగంగా పుష్పగిరి ఆలయాలను సందర్శించి ఉంటారని కొందరి అభిప్రాయంగా ఉంది.
ఏది ఏమైనా తెలుగునాట ఏకైక శంకర అద్వైత పీఠంగా ఉన్న పుష్పగిరి దేశంలోని మిగిలిన శంకర పీఠాల మాదిరిగా వెలుగొందాల్సిన అవసరం ఉంది. వేలాది ఎకరాల మాన్యాలున్న పుష్పగిరి పీఠంలో మిగిలిన పీఠాల తరహాలో ఆధ్యాత్మిక, సామాజిక సేవాకార్యక్రమాలు విస్తృతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పుష్పగిరి -హరిహరాదుల క్షేత్రం.
======================
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి -హరిహరాదుల క్షేత్రం.
@RayaIaseema
#Pushpagiri
ఆంధ్ర ప్రదేశ్ - రాయలసీమ - కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.
కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం.
వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.
హరిహరాదుల క్షేత్రం
*******************
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై
పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి.
ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి.
వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.
**************************************
1.కడప నుండి చెన్నూరు మార్గంలో ఉప్పరపల్లి మీదుగా కొండకు చేరుకొవచ్చు
2.ఖాజీపేట నుంచి వయా చింతలపత్తూరు మీదుగా భక్తులు వచ్చెందుకు వీలుగా వాహనాలు ఎక్కువగా తిరుగుతాయి.
3.జాతీయరహదారి పై తాడిపత్రి నుంచి వల్లూరు వయా ఆదినిమ్మాయపల్లె మీదుగా వెళ్లొచ్చు.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.