@Gajapati (ଗଜପତି) Profile picture
ଅନାଲୋଚିତ ଓଡିଶାର ପ୍ରଚାର ଓ ପ୍ରସାର #polyglot_Techie_Art_Architucture_litrature_culture_Resercher_Epigraphy_Odia. handle by: BM Adhikari

Dec 5, 2021, 15 tweets

కళింగాంధ్ర భాష :
విశాఖ , విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలలో ప్రజలు మాట్లాడే భాషను కళిగాంధ్ర భాష అంటారు . తెలుగులోనే ఒక ప్రత్యేకమైన యాస ఇక్కడ మీకు కనిపిస్తుంది . బ్రిటీషర్ల కాలంలో శ్రీకాకుళం చికాకోల్ పేరుతో చెలామణీ అయ్యింది .
1/n

నాగావళి , వంశధార , మహేంద్ర తనయ , చంపావతి , బహుదా , కుంభికోటగెడ్ మొదలైన ఈ ప్రాంతంలో ప్రవహించే ముఖ్య నదులు . ప్రత్యేకమైన యాస : కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం మాండలికంలోనే ఎన్నో రచనలు చేశారు . గణేశ్ పాత్రో లాంటి సినిమా రచయితలు ఈ యాసను చలనచిత్ర పరిశ్రమకు సైతం పరిచయం చేశారు .
2/n

బేపి ( కుక్క ) , పెనిమిటి ( భర్త ) , గీర లేదా గీర్మానం ( పొగరుబోతుతనం ) , వర్ర ( కారం ) , గుంట ( కాలువ ) , బుగత ( భూస్వామి ) , గుడ్డి ( పొలం ) లాంటి పదాలు , మాటలు ఎన్నో శ్రీకాకుళం యాసలో కనిపిస్తాయి . గురజాడ వారి కన్యాశుల్కంలో కూడా లెక్కలేనన్ని శ్రీకాకుళం యాస పదాలున్నాయి .
3/n

ఆ మధ్యకాలంలో విడుదలైన అల వైకుంఠాపురంలో చిత్రంలో " సిత్తరాల సిరపడు " పాట రాసిన కవి ఎవరో కాదు .. శ్రీకాకుళం వాసైన బల్లా విజయకుమార్ . ఈ పాటలో చాలా శ్రీకాకుళం పదాలు కనిపిస్తాయి . బుగతోడి ఆంబోతు , కొమ్ములతో కోలాటం , వరదలో గుంటగాళ్లు , గుక్కి గుండ చేసినోళ్లు ,
4/n

పనిమోల సొరసేప , సక్కనమ్మ కళ్లలో యేల యేల సుక్కలు .. ఇలా చాలా గమ్మత్తైన జానపద పదాలు ఈ పాటలో కనిపిస్తాయి

శ్రీకాకుళం జానపద పదాల సంపదను మనకు మన గుండెకు మరింత దగ్గర చేస్తాయి . వీరులు తిరుగాడిన నేల : శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తాండ్రపాపారాయుడి పేరు కచ్చితంగా నిలిచిపోతుంది . ఆయన కోట రాజాంలో ఉండేది . బొబ్బలి యుద్ధం తర్వాత విజయరామరాజును పాపారాయుడు మట్టుబెట్టాడన్న సంగతి తెలిసిందే .
6/n

తాండ్ర పాపారాయుడి రాజాం కోట ఎన్నో రహస్యాలకు కేంద్రమని పెద్దలు అనేవారట . ఆ కోటను దుర్గామాత ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుందని , కోట పైభాగాన భేతాళుడు నివసిస్తుంటాడని పలు కట్టుకథలు కూడా హల్చల్ చేశాయి . ఉద్యమాల నేల :
ప్రపంచ ఉద్యమాల చరిత్రలో శ్రీకాకుళ గిరిజనోద్యమానికి ఒక
7/n

ప్రత్యేక స్థానం ఉంది . ' ఎరుపంటే కొందరికి భయం , భయం , పసిపిల్లలు వారికంటే నయం నయం ' , ' కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం ' అంటూ సుబ్బరావు పాణిగ్రహి లాంటి విప్లవకారులు సోంపేట లాంటి ప్రాంతాలలో పోరాటాలకు బీజం వేశారు . ఈయన కంటే ముందే గరిమెళ్ల
8/n

సత్యనారాయణ లాంటి స్వాతంత్య్ర సమయోధులు శ్రీకాకుళం నేలపై సమర శంఖరావాన్ని మ్రోగించారు . మాకొద్దు తెల్లదొరతనమూ అంటూ బ్రిటీష్ వారి ఆగడాలను ప్రతిఘటించారు . ఇక శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేట గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం

అంతేకాకుండా మార్పు పద్మనాభం వీరగున్నమ్మ లాంటి విప్లవ వీరులను కన్న గడ్డ ఇది . ఎందరో గొప్ప రచయితలను కన్న కర్మభూమి :రావిశాస్త్రి , చాగంటి సోమయాజులు ,కవేరా , గెడ్డాపు సత్యం , తాపీ ధర్మారావు ,ఛాయారాజ్ , దూసి ధర్మారావు , బలివాడ కాంతారావు ,రోణంకి అప్పలస్వామి , మీగడ రామలింగస్వామి
8/n

వెలమల సిమ్మన్న , అట్టాడ అప్పల్నాయుడు , చింతా అప్పల్నాయుడు , బంకుపల్లె మల్లయ్యశాస్త్రి , దైతా గోపాలం , మల్లాది వెంకటక్రిష్ణ శాస్త్రి , రావి కొండలరావు లాంటి ఎందరో పేరొందిన రచయితలు శ్రీకాకుళం వాణిని జగద్విఖ్యాతం చేశారు . కళామతల్లి ముద్దు బిడ్డలు : మాడుగుల వేంకట
9/n

సూర్యప్రసాదరాయ కవి ( అష్టావధానం ) , పురుషోత్తమచౌదరి ( తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు ), స్వాతీసోమనాథ్ ( కూచిపూడి కళాకారిణి ) ,వడ్డాది పాపయ్య ( చిత్రకారులు ) ,దూసి బెనర్జీభాగవతార్ ( హరికథ ),యడ్ల గోపాలరావు ( నాటకకళాకారులు ) ,మిమిక్రీ శ్రీనివాస్ ( ధ్వన్యానుకరణ ) , లోకనాథం
10/n

నందికేశ్వరరావు ( ధ్వన్యానుకరణ ) , శ్రీపాద పినాకపాణి ( కర్ణాటక శాస్త్రీయ సంగీతం ) , తుమరాడ సంగమేశ్వరశాస్త్రి ( వీణా విద్వాంసులు ) , భాస్కరభట్ల రవికుమార్ ( గేయ రచయిత ) , ఆర్పీ పట్నాయక్ ( సంగీత దర్శకులు ) , జి.ఆనంద్ ( సినీ సంగీత దర్శకులు )
11/n

పింగళి నాగేంద్రరావు ( సంగీత దర్శకులు ) , కొండవలస లక్ష్మణరావు ( సినీ నటులు ) , జెవి సోమయాజులు ( సినీ నటులు ) , రమణమూర్తి ( సినీ నటులు ) , షకలక శంకర్ ( జబర్దస్త్ ఫేమ్ హాస్యనటుడు ) etc.

క్రీడలలో దేశానికి ఆదర్శం :
ప్రముఖ మల్లయోధుడు కోడి రామమూర్తి నాయుడు , ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్లో మన దేశానికి కాంస్య పతకాన్ని అందించిన కరణం మల్లీశ్వరి లాంటి గొప్ప క్రీడాకారులను అందించిన మహత్తరమైన నేల శ్రీకాకుళం
@kmmalleswari

End of the thread

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling