కళింగాంధ్ర భాష :
విశాఖ , విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలలో ప్రజలు మాట్లాడే భాషను కళిగాంధ్ర భాష అంటారు . తెలుగులోనే ఒక ప్రత్యేకమైన యాస ఇక్కడ మీకు కనిపిస్తుంది . బ్రిటీషర్ల కాలంలో శ్రీకాకుళం చికాకోల్ పేరుతో చెలామణీ అయ్యింది . 1/n
నాగావళి , వంశధార , మహేంద్ర తనయ , చంపావతి , బహుదా , కుంభికోటగెడ్ మొదలైన ఈ ప్రాంతంలో ప్రవహించే ముఖ్య నదులు . ప్రత్యేకమైన యాస : కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం మాండలికంలోనే ఎన్నో రచనలు చేశారు . గణేశ్ పాత్రో లాంటి సినిమా రచయితలు ఈ యాసను చలనచిత్ర పరిశ్రమకు సైతం పరిచయం చేశారు . 2/n
బేపి ( కుక్క ) , పెనిమిటి ( భర్త ) , గీర లేదా గీర్మానం ( పొగరుబోతుతనం ) , వర్ర ( కారం ) , గుంట ( కాలువ ) , బుగత ( భూస్వామి ) , గుడ్డి ( పొలం ) లాంటి పదాలు , మాటలు ఎన్నో శ్రీకాకుళం యాసలో కనిపిస్తాయి . గురజాడ వారి కన్యాశుల్కంలో కూడా లెక్కలేనన్ని శ్రీకాకుళం యాస పదాలున్నాయి . 3/n
ఆ మధ్యకాలంలో విడుదలైన అల వైకుంఠాపురంలో చిత్రంలో " సిత్తరాల సిరపడు " పాట రాసిన కవి ఎవరో కాదు .. శ్రీకాకుళం వాసైన బల్లా విజయకుమార్ . ఈ పాటలో చాలా శ్రీకాకుళం పదాలు కనిపిస్తాయి . బుగతోడి ఆంబోతు , కొమ్ములతో కోలాటం , వరదలో గుంటగాళ్లు , గుక్కి గుండ చేసినోళ్లు , 4/n
పనిమోల సొరసేప , సక్కనమ్మ కళ్లలో యేల యేల సుక్కలు .. ఇలా చాలా గమ్మత్తైన జానపద పదాలు ఈ పాటలో కనిపిస్తాయి
శ్రీకాకుళం జానపద పదాల సంపదను మనకు మన గుండెకు మరింత దగ్గర చేస్తాయి . వీరులు తిరుగాడిన నేల : శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తాండ్రపాపారాయుడి పేరు కచ్చితంగా నిలిచిపోతుంది . ఆయన కోట రాజాంలో ఉండేది . బొబ్బలి యుద్ధం తర్వాత విజయరామరాజును పాపారాయుడు మట్టుబెట్టాడన్న సంగతి తెలిసిందే . 6/n
తాండ్ర పాపారాయుడి రాజాం కోట ఎన్నో రహస్యాలకు కేంద్రమని పెద్దలు అనేవారట . ఆ కోటను దుర్గామాత ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుందని , కోట పైభాగాన భేతాళుడు నివసిస్తుంటాడని పలు కట్టుకథలు కూడా హల్చల్ చేశాయి . ఉద్యమాల నేల :
ప్రపంచ ఉద్యమాల చరిత్రలో శ్రీకాకుళ గిరిజనోద్యమానికి ఒక 7/n
ప్రత్యేక స్థానం ఉంది . ' ఎరుపంటే కొందరికి భయం , భయం , పసిపిల్లలు వారికంటే నయం నయం ' , ' కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం ' అంటూ సుబ్బరావు పాణిగ్రహి లాంటి విప్లవకారులు సోంపేట లాంటి ప్రాంతాలలో పోరాటాలకు బీజం వేశారు . ఈయన కంటే ముందే గరిమెళ్ల 8/n
సత్యనారాయణ లాంటి స్వాతంత్య్ర సమయోధులు శ్రీకాకుళం నేలపై సమర శంఖరావాన్ని మ్రోగించారు . మాకొద్దు తెల్లదొరతనమూ అంటూ బ్రిటీష్ వారి ఆగడాలను ప్రతిఘటించారు . ఇక శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేట గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం
అంతేకాకుండా మార్పు పద్మనాభం వీరగున్నమ్మ లాంటి విప్లవ వీరులను కన్న గడ్డ ఇది . ఎందరో గొప్ప రచయితలను కన్న కర్మభూమి :రావిశాస్త్రి , చాగంటి సోమయాజులు ,కవేరా , గెడ్డాపు సత్యం , తాపీ ధర్మారావు ,ఛాయారాజ్ , దూసి ధర్మారావు , బలివాడ కాంతారావు ,రోణంకి అప్పలస్వామి , మీగడ రామలింగస్వామి 8/n
వెలమల సిమ్మన్న , అట్టాడ అప్పల్నాయుడు , చింతా అప్పల్నాయుడు , బంకుపల్లె మల్లయ్యశాస్త్రి , దైతా గోపాలం , మల్లాది వెంకటక్రిష్ణ శాస్త్రి , రావి కొండలరావు లాంటి ఎందరో పేరొందిన రచయితలు శ్రీకాకుళం వాణిని జగద్విఖ్యాతం చేశారు . కళామతల్లి ముద్దు బిడ్డలు : మాడుగుల వేంకట 9/n
నందికేశ్వరరావు ( ధ్వన్యానుకరణ ) , శ్రీపాద పినాకపాణి ( కర్ణాటక శాస్త్రీయ సంగీతం ) , తుమరాడ సంగమేశ్వరశాస్త్రి ( వీణా విద్వాంసులు ) , భాస్కరభట్ల రవికుమార్ ( గేయ రచయిత ) , ఆర్పీ పట్నాయక్ ( సంగీత దర్శకులు ) , జి.ఆనంద్ ( సినీ సంగీత దర్శకులు )
11/n
పింగళి నాగేంద్రరావు ( సంగీత దర్శకులు ) , కొండవలస లక్ష్మణరావు ( సినీ నటులు ) , జెవి సోమయాజులు ( సినీ నటులు ) , రమణమూర్తి ( సినీ నటులు ) , షకలక శంకర్ ( జబర్దస్త్ ఫేమ్ హాస్యనటుడు ) etc.
క్రీడలలో దేశానికి ఆదర్శం :
ప్రముఖ మల్లయోధుడు కోడి రామమూర్తి నాయుడు , ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో మన దేశానికి కాంస్య పతకాన్ని అందించిన కరణం మల్లీశ్వరి లాంటి గొప్ప క్రీడాకారులను అందించిన మహత్తరమైన నేల శ్రీకాకుళం @kmmalleswari
End of the thread
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
లఖ్నాటి దండయాత్ర #778వ వార్షికోత్సవం - బెంగాల్ సుల్తానేట్ను ఒరిస్సా చక్రవర్తి ఓడించిన #778వ వార్షికోత్సవం
దక్షిణ భారతంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో హిందూ దేవాలయాలు, హిందూ ధర్మం ముస్లింల అరాచకాలకు గురి కాకుండా 14 శతాబ్ధం వరకు కాపాడిన వారు ఎవరో తెలుసా? #Lakhnauti 1/n
బెంగాల్ మీదుగా, ఆంధ్ర ప్రాంతంలో ప్రవేశించి ప్రబలమైన భుద్ధ ధర్మం లా ముస్లింలు ప్రవేశించలేక పోవడానికి కారణం సుమారు 1000 సంవత్సరాల పాటు ఒరిసాను పాలించి తూర్పు తీరాన్ని కాపు కాసి, హిందూ ధర్మాన్ని రక్షించిన తూర్పు గంగ చక్రవర్తుల గొప్పతనమే.
#VikramDebaJayanti
Thread #Jeypore#Visakhapatnam
Rare are the blessed souls that seek to walk in the light of altruism shedding luster around in selfless service and Rajarshi Vikram Deba Varma ( 1869-1951 ) of Jeypore belongs to such a rare tribe . 1/n
Philanthropy runs deep in his royal blood and what distinguishes him is the fact that is munificence found an indelible expression beyond te boundaries of his home land . This primarily bore fruit for Visakhapatnam in abundant measure turning a town in making 2/n
into citadel of learning and culture Prior to the Britih noticing Visakhapatnam's importance of geographical location , it was Odia Zamindars who spotted its scenic beauty and contributed a lot to its evolution into a broad - based town . 3/n
పుణ్యక్షేత్ర సింహాచలం
*************************
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము , సింహచలం అనే గ్రామంలో విశాఖపట్టణం నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలొని పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము . ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే 1/n
వరహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు . ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది . ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి . తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం ( 52 కోట్ల రూపాయలు ) కలిగిన దేవాలయము . సంవత్సరానికి 2/n
12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది ; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది . నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు . ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది . స్థలపురాణం : సింహాచలం చరిత్ర ఆధారాలతో 3/n
GANJAM In BENGALURU:~
Did you know the famous Ganjam jewellery of Karnataka has a historical linkage with odisha's Ganjam dist.
The story of this dates back to the little town of Ganjam in Odisha. In 1889,gold yielded its secrets to a young man called Nagapa and a legacy 1/4
was created. Born into a family with a tradition of gem trading and jewellery, he soon took the legacy across India conquering new markets as dynasties in the region flourished. Nagapa moved to Hampi, which was then, the capital of Vijayanagara Empire 2/4
Over an epoch of time, the business and family moved to Mysore when the city was proclaimed as capital of the Karnataka state, finally moved to Bangalore and started their business in the heart of the garden city 3/n