@Gajapati (ଗଜପତି) Profile picture
ଅନାଲୋଚିତ ଓଡିଶାର ପ୍ରଚାର ଓ ପ୍ରସାର #polyglot_Art_Architucture_litrature_culture_OdiaEpigraphy_Researcher

Dec 18, 2021, 18 tweets

కురుపాము సంస్థానచరిత్ర :
ఈ సంస్థానము విస్తీర్ణము సుమారు 700 వందల చదరపు మైళ్ళు ఇందులో 450 చ.మై ఏజెన్సీ ప్రాంతము . ఈ సంస్థానము నందు 274 గ్రామములలొ 200 ఏజెన్సీ గ్రామములు , 48 జిరాయితీ గ్రామములు , 10 అగ్రహారములు మిగిలినవి వ్యవసాయ గ్రామములు . గుమ్మహూండా భాగము తప్ప
1/n

మిగిలినవి జయపురము వారు ఏర్పరచినవి.పూర్వమిది నందాపురము అను పేరుతో జయపురము సంస్థానము నందు అంతర్భాగముగా ఉంది జయపురము ప్రభువైన విశ్వంభరదేవుగారి వలన కురుపాము సంస్థానము ఏర్పడినది అటులనే పర్లాకుముండి పాలకులు గోపీనాథదేవుగారి దయవలన గుమ్మహూండా విభాగము కురుపాము జమీందారీ యందు చేర్చబడింది
2/n

ఈ పాలకులు చంద్రవంశమునందు శిలా శాఖయట . వీరు ఓడ్రజాతీయులగు కొండరాజుల వంశము . వైరిచర్ల వీరి కులబిరుదు . వీరి మూలపురుషుడు అగ్నివీరుడు . వీరి కూటస్థుడు సన్యాసిదొర . వైరిచర్ల వారి దేవతాస్వరూపిణి పైడిమారమ్మ కురుపాము కోట శక్తి యట . < కురుపాము సంస్థాన విషయంలో ఇంకొక కధనం కూడా ఉంది .
3/n

జయపురము వారి ఆమోదమునకు పూర్వమే కురుపాము జమీందారులు పరిపాలన చేశారని 1435 లొ గజపతుల పతనముతొ వీరు స్వాతంత్రులయిరని తదుపరి జయపురము సంస్థానాధీశులు వీరిని గుర్తించి కురుపాము సంస్థానాదిపత్యము స్థిరపరచారని కధనము
4/n

మూలపురుషుడు వైరిచర్ల పెదసన్యాసిరాజుగారు అయిన అగ్నివీరునకు ఆరవ తరమువారు . ఇతని పుత్రుడు శివరామరాజు . కళింగ విజయనగరరాజులకు ఎదురు తిరిగిన పాలకులలో శివరామరాజు కూడా ముఖ్యులు . వాస్తవానికి శివరామరాజు విజయనగరపాలకులను ఎదిరించిన కుట్రదారులతొ చేరకపొయిననూ , విజయనగర సేనలు ,
5/n

కేప్టన్ మాథ్యూస్ దొరగారి కంపెనీ సేనలు విజయనగర దీవాను సీతారామరాజు ఆధిపత్యమున జయపురము ముట్టడించు ప్రయత్నంలో వారి సేనలకు వస్తుసామాగ్రి అందకుండా చేశారు . అందువలన సీతారామరాజు దొరగారి సేనలతొ కలిసి కురుపాము పొయి మొసముతొ శివరామరాజును సకుటుంబముతో భంధించి విజయనగర సంస్థానమునందలి
6/n

వివిధ కోటలలొ వేరువేరుగా ఖైదుచేశారు .. విజయనగర మహరాజు 1794 లొ మరణించువరకూ వీరందరూ ఖైదులోనే గడిపిరి కానీ రాజుగారు కల్పించుకుని శివరామరాజు గారిని అంతకుముందుగానే విడుదలచేసి పోషణకొరకు కొంత ఆర్థికంగా సహయము చేశారు . 1778 లొ శివరామరాజు కురుపాము నందలి సుబేదారులకు లంచమునిచ్చి
7/n

సంస్థానమును వశపరచుకున్నారు.1779 లొ విజయనగర మరియు కంపెనీ సేనలు కలిసి ఒక్కసారిగా ముట్టడించి కురుపాము కోటను తిరిగి వశపరచుకున్నారు. శివరామరాజు 1794 లొ మరణించారు. 1796 లొ ఉత్తర డివిజన్ కలెక్టర్ గారు ఈ సంస్థానము నకు చెందు ప్రాచీన కుటుంబ వారసులకు కురుపాము సంస్థానమును అప్పగించారు .
8/n

శివరామరాజు కుమారుడు చినసన్యాసిరాజుతొ 1803 లొ కంపెనీ వారు శాశ్వత పరిష్కారం చేసుకున్నారు . చినసన్యాసిరాజునకు సంతతి లేనందున తన బంధువులకు చెందు సీతారామరాజును తాను దత్తత తీసుకొందునని మరణకాలమున కలెక్టర్ గారికి తెలియచేసెను . చినసన్యాసిరాజు 1820 లొ మరణాంతర ము సీతారామరాజు నకు
9/n

సంస్థానమును సంక్రమించినది . ఈయన 1830 లొ మరణించగా ఆయన భార్యయగు సుభద్రమ్మ 1841 వరకూ పాలించి మరణించారు . ఈమె మరణమునకు ముందుగానే సూర్యనారాయణరాజును దత్తత తీసుకున్నారు కానీ ఈమె మరణ సమయంలో కేవలం 3 సంవత్సరాల పసివాడు కావున సంస్థానమును తిరిగి కంపెనీ వశమయినది . ఈయన కోర్టు
10/n

ఆదేశించిన ప్రకారము విశాఖలో ఆంధ్ర , ఆంగ్లేయ భాషలను అభ్యసించి మేజరు అయిన పిదప 1858 లొ జమీకీ తిరిగి వచ్చెను . కానీ చినసన్యాసిరాజు గారి సోదరులలొ ఒక సోదరుని యొక్క కుమారుడు వైరిచర్ల జగన్నాథరాజు సంస్థానమునకు తాను హక్కుదారునని 1858 లొ దావా వేసెను . గవర్నర్ ఏజెంట్
11/n

రాబర్టుసన్ దొరగారు న్యాయస్థానము నందలి నిపుణులతో చర్చలు జరిపిన వాది యొక్క వాదనలు ఆశ్రాస్త్రీయముగా తోచుటవలన సంస్థానముపై ఆయనకు ఎటువంటి హక్కు లేదని కేసును కొట్టివేశారు . ఈ తీర్పుపై మరియొక అప్పీలు చేర్చబడింది కానీ అది నిలువలేదు .
12/n

కురుపాము తదుపరి చరిత్ర :
******************************
1889 లొ సూర్యనారాయణరాజు చెముడు సంస్థానమును స్వాధీన పరచుకుని సంస్థానమును విస్తరించెను . ఈయన 1891 లొ మరణించెను . ఈయన కుమారుడు వీరభద్రరాజు తండ్రి మరణించు సమయంలో కేవలం 13 ఏండు పసివాడు కామన
13/n

సంస్థానము తిరిగి కంపెనీ వశమయినది . మేజరు అయిన పిదప 1898 లొ జమీ పాలన చేపట్టారు . ఈయన విశాఖ జిల్లా అనకాపల్లి జమీందారు మహరాజా గోడే నారాయణగజపతిరావుగారి రెండవ కుమార్తె శ్రీ రాజకుమారి లక్ష్మీనరసయ్యమ్మగారిని 1897 లొ వివాహం చేసుకున్నారు . ఈయన ఇంపీరియల్
14/n

లెజిల్లేటివ్ కౌన్సిల్ మరియు మద్రాసు లెజిల్లేటివ్ కౌన్సిల్ యందు సభ్యులుగా భాద్యతలు నిర్వహించారు.1901లొ ఈయన భార్య పురిటి సమయంలో మరణించారు.ఈయన విశాఖపట్టణము నందు ఎడ్వర్డ్ కారొనేషన్ మార్కెట్ ను ఇంచుమించు లక్షరూపాయలు వెచ్చించి నిర్మించారు దానినే కురుపాము మార్కెట్ గా పేరు గాంచినది
15/n

ఇప్పటికీ ఆ మార్కెట్ ఉన్ననూ దాని యొక్క గేటు భద్రతా కారణంగా తొలగించారు . జాలరులకు నివేశన స్థలాన్ని ఉచితంగా పంచిపెట్టారు . దానినే నేడు జాలారిపేటగా వ్యవహరిస్తున్నారు . అటులనే రాణీ లక్ష్మీనరసాయమ్మ ఆసుపత్రికి భూరి విరాళ మిచ్చారు . 1918 లొ వీరభద్రరాజు గారు మరణించారు .
16/n

విశాఖ తాజ్మహల్ గా సముద్రం తీరంలో ఉన్న కురుపాము టోంబు రాణీగారి జ్ఞాపకార్థం నిర్మించినదే . వీరి కుమారులు నరసింహ సూర్యనారాయణ మరియు నారాయణగజపతిరాజు అనువారలు . వీరికి కురుపాముతో పాటు పూర్వీకుల నుండి కుప్పిలి , గొట్టుపల్లి ఎస్టేటులు కూడా సంక్రమించినవి .
17/n

స్వాతంత్య్ర తదుపరి జమీందారీ రద్దుకాబడి ముందు శ్రీకాకుళం జిల్లాలోని అంతర్భాగమయింది . విజయనగరం జిల్లా అవతరణతో అందులో విలీనమయినది.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling