కురుపాము సంస్థానచరిత్ర :
ఈ సంస్థానము విస్తీర్ణము సుమారు 700 వందల చదరపు మైళ్ళు ఇందులో 450 చ.మై ఏజెన్సీ ప్రాంతము . ఈ సంస్థానము నందు 274 గ్రామములలొ 200 ఏజెన్సీ గ్రామములు , 48 జిరాయితీ గ్రామములు , 10 అగ్రహారములు మిగిలినవి వ్యవసాయ గ్రామములు . గుమ్మహూండా భాగము తప్ప 1/n
మిగిలినవి జయపురము వారు ఏర్పరచినవి.పూర్వమిది నందాపురము అను పేరుతో జయపురము సంస్థానము నందు అంతర్భాగముగా ఉంది జయపురము ప్రభువైన విశ్వంభరదేవుగారి వలన కురుపాము సంస్థానము ఏర్పడినది అటులనే పర్లాకుముండి పాలకులు గోపీనాథదేవుగారి దయవలన గుమ్మహూండా విభాగము కురుపాము జమీందారీ యందు చేర్చబడింది 2/n
ఈ పాలకులు చంద్రవంశమునందు శిలా శాఖయట . వీరు ఓడ్రజాతీయులగు కొండరాజుల వంశము . వైరిచర్ల వీరి కులబిరుదు . వీరి మూలపురుషుడు అగ్నివీరుడు . వీరి కూటస్థుడు సన్యాసిదొర . వైరిచర్ల వారి దేవతాస్వరూపిణి పైడిమారమ్మ కురుపాము కోట శక్తి యట . < కురుపాము సంస్థాన విషయంలో ఇంకొక కధనం కూడా ఉంది . 3/n
జయపురము వారి ఆమోదమునకు పూర్వమే కురుపాము జమీందారులు పరిపాలన చేశారని 1435 లొ గజపతుల పతనముతొ వీరు స్వాతంత్రులయిరని తదుపరి జయపురము సంస్థానాధీశులు వీరిని గుర్తించి కురుపాము సంస్థానాదిపత్యము స్థిరపరచారని కధనము
4/n
మూలపురుషుడు వైరిచర్ల పెదసన్యాసిరాజుగారు అయిన అగ్నివీరునకు ఆరవ తరమువారు . ఇతని పుత్రుడు శివరామరాజు . కళింగ విజయనగరరాజులకు ఎదురు తిరిగిన పాలకులలో శివరామరాజు కూడా ముఖ్యులు . వాస్తవానికి శివరామరాజు విజయనగరపాలకులను ఎదిరించిన కుట్రదారులతొ చేరకపొయిననూ , విజయనగర సేనలు , 5/n
కేప్టన్ మాథ్యూస్ దొరగారి కంపెనీ సేనలు విజయనగర దీవాను సీతారామరాజు ఆధిపత్యమున జయపురము ముట్టడించు ప్రయత్నంలో వారి సేనలకు వస్తుసామాగ్రి అందకుండా చేశారు . అందువలన సీతారామరాజు దొరగారి సేనలతొ కలిసి కురుపాము పొయి మొసముతొ శివరామరాజును సకుటుంబముతో భంధించి విజయనగర సంస్థానమునందలి 6/n
వివిధ కోటలలొ వేరువేరుగా ఖైదుచేశారు .. విజయనగర మహరాజు 1794 లొ మరణించువరకూ వీరందరూ ఖైదులోనే గడిపిరి కానీ రాజుగారు కల్పించుకుని శివరామరాజు గారిని అంతకుముందుగానే విడుదలచేసి పోషణకొరకు కొంత ఆర్థికంగా సహయము చేశారు . 1778 లొ శివరామరాజు కురుపాము నందలి సుబేదారులకు లంచమునిచ్చి
7/n
సంస్థానమును వశపరచుకున్నారు.1779 లొ విజయనగర మరియు కంపెనీ సేనలు కలిసి ఒక్కసారిగా ముట్టడించి కురుపాము కోటను తిరిగి వశపరచుకున్నారు. శివరామరాజు 1794 లొ మరణించారు. 1796 లొ ఉత్తర డివిజన్ కలెక్టర్ గారు ఈ సంస్థానము నకు చెందు ప్రాచీన కుటుంబ వారసులకు కురుపాము సంస్థానమును అప్పగించారు .
8/n
శివరామరాజు కుమారుడు చినసన్యాసిరాజుతొ 1803 లొ కంపెనీ వారు శాశ్వత పరిష్కారం చేసుకున్నారు . చినసన్యాసిరాజునకు సంతతి లేనందున తన బంధువులకు చెందు సీతారామరాజును తాను దత్తత తీసుకొందునని మరణకాలమున కలెక్టర్ గారికి తెలియచేసెను . చినసన్యాసిరాజు 1820 లొ మరణాంతర ము సీతారామరాజు నకు
9/n
సంస్థానమును సంక్రమించినది . ఈయన 1830 లొ మరణించగా ఆయన భార్యయగు సుభద్రమ్మ 1841 వరకూ పాలించి మరణించారు . ఈమె మరణమునకు ముందుగానే సూర్యనారాయణరాజును దత్తత తీసుకున్నారు కానీ ఈమె మరణ సమయంలో కేవలం 3 సంవత్సరాల పసివాడు కావున సంస్థానమును తిరిగి కంపెనీ వశమయినది . ఈయన కోర్టు
10/n
ఆదేశించిన ప్రకారము విశాఖలో ఆంధ్ర , ఆంగ్లేయ భాషలను అభ్యసించి మేజరు అయిన పిదప 1858 లొ జమీకీ తిరిగి వచ్చెను . కానీ చినసన్యాసిరాజు గారి సోదరులలొ ఒక సోదరుని యొక్క కుమారుడు వైరిచర్ల జగన్నాథరాజు సంస్థానమునకు తాను హక్కుదారునని 1858 లొ దావా వేసెను . గవర్నర్ ఏజెంట్
11/n
రాబర్టుసన్ దొరగారు న్యాయస్థానము నందలి నిపుణులతో చర్చలు జరిపిన వాది యొక్క వాదనలు ఆశ్రాస్త్రీయముగా తోచుటవలన సంస్థానముపై ఆయనకు ఎటువంటి హక్కు లేదని కేసును కొట్టివేశారు . ఈ తీర్పుపై మరియొక అప్పీలు చేర్చబడింది కానీ అది నిలువలేదు .
12/n
కురుపాము తదుపరి చరిత్ర :
******************************
1889 లొ సూర్యనారాయణరాజు చెముడు సంస్థానమును స్వాధీన పరచుకుని సంస్థానమును విస్తరించెను . ఈయన 1891 లొ మరణించెను . ఈయన కుమారుడు వీరభద్రరాజు తండ్రి మరణించు సమయంలో కేవలం 13 ఏండు పసివాడు కామన 13/n
సంస్థానము తిరిగి కంపెనీ వశమయినది . మేజరు అయిన పిదప 1898 లొ జమీ పాలన చేపట్టారు . ఈయన విశాఖ జిల్లా అనకాపల్లి జమీందారు మహరాజా గోడే నారాయణగజపతిరావుగారి రెండవ కుమార్తె శ్రీ రాజకుమారి లక్ష్మీనరసయ్యమ్మగారిని 1897 లొ వివాహం చేసుకున్నారు . ఈయన ఇంపీరియల్ 14/n
లెజిల్లేటివ్ కౌన్సిల్ మరియు మద్రాసు లెజిల్లేటివ్ కౌన్సిల్ యందు సభ్యులుగా భాద్యతలు నిర్వహించారు.1901లొ ఈయన భార్య పురిటి సమయంలో మరణించారు.ఈయన విశాఖపట్టణము నందు ఎడ్వర్డ్ కారొనేషన్ మార్కెట్ ను ఇంచుమించు లక్షరూపాయలు వెచ్చించి నిర్మించారు దానినే కురుపాము మార్కెట్ గా పేరు గాంచినది 15/n
ఇప్పటికీ ఆ మార్కెట్ ఉన్ననూ దాని యొక్క గేటు భద్రతా కారణంగా తొలగించారు . జాలరులకు నివేశన స్థలాన్ని ఉచితంగా పంచిపెట్టారు . దానినే నేడు జాలారిపేటగా వ్యవహరిస్తున్నారు . అటులనే రాణీ లక్ష్మీనరసాయమ్మ ఆసుపత్రికి భూరి విరాళ మిచ్చారు . 1918 లొ వీరభద్రరాజు గారు మరణించారు . 16/n
విశాఖ తాజ్మహల్ గా సముద్రం తీరంలో ఉన్న కురుపాము టోంబు రాణీగారి జ్ఞాపకార్థం నిర్మించినదే . వీరి కుమారులు నరసింహ సూర్యనారాయణ మరియు నారాయణగజపతిరాజు అనువారలు . వీరికి కురుపాముతో పాటు పూర్వీకుల నుండి కుప్పిలి , గొట్టుపల్లి ఎస్టేటులు కూడా సంక్రమించినవి . 17/n
స్వాతంత్య్ర తదుపరి జమీందారీ రద్దుకాబడి ముందు శ్రీకాకుళం జిల్లాలోని అంతర్భాగమయింది . విజయనగరం జిల్లా అవతరణతో అందులో విలీనమయినది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
లఖ్నాటి దండయాత్ర #778వ వార్షికోత్సవం - బెంగాల్ సుల్తానేట్ను ఒరిస్సా చక్రవర్తి ఓడించిన #778వ వార్షికోత్సవం
దక్షిణ భారతంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో హిందూ దేవాలయాలు, హిందూ ధర్మం ముస్లింల అరాచకాలకు గురి కాకుండా 14 శతాబ్ధం వరకు కాపాడిన వారు ఎవరో తెలుసా? #Lakhnauti 1/n
బెంగాల్ మీదుగా, ఆంధ్ర ప్రాంతంలో ప్రవేశించి ప్రబలమైన భుద్ధ ధర్మం లా ముస్లింలు ప్రవేశించలేక పోవడానికి కారణం సుమారు 1000 సంవత్సరాల పాటు ఒరిసాను పాలించి తూర్పు తీరాన్ని కాపు కాసి, హిందూ ధర్మాన్ని రక్షించిన తూర్పు గంగ చక్రవర్తుల గొప్పతనమే.
#VikramDebaJayanti
Thread #Jeypore#Visakhapatnam
Rare are the blessed souls that seek to walk in the light of altruism shedding luster around in selfless service and Rajarshi Vikram Deba Varma ( 1869-1951 ) of Jeypore belongs to such a rare tribe . 1/n
Philanthropy runs deep in his royal blood and what distinguishes him is the fact that is munificence found an indelible expression beyond te boundaries of his home land . This primarily bore fruit for Visakhapatnam in abundant measure turning a town in making 2/n
into citadel of learning and culture Prior to the Britih noticing Visakhapatnam's importance of geographical location , it was Odia Zamindars who spotted its scenic beauty and contributed a lot to its evolution into a broad - based town . 3/n
పుణ్యక్షేత్ర సింహాచలం
*************************
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము , సింహచలం అనే గ్రామంలో విశాఖపట్టణం నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలొని పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము . ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే 1/n
వరహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు . ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది . ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి . తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం ( 52 కోట్ల రూపాయలు ) కలిగిన దేవాలయము . సంవత్సరానికి 2/n
12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది ; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది . నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు . ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది . స్థలపురాణం : సింహాచలం చరిత్ర ఆధారాలతో 3/n
GANJAM In BENGALURU:~
Did you know the famous Ganjam jewellery of Karnataka has a historical linkage with odisha's Ganjam dist.
The story of this dates back to the little town of Ganjam in Odisha. In 1889,gold yielded its secrets to a young man called Nagapa and a legacy 1/4
was created. Born into a family with a tradition of gem trading and jewellery, he soon took the legacy across India conquering new markets as dynasties in the region flourished. Nagapa moved to Hampi, which was then, the capital of Vijayanagara Empire 2/4
Over an epoch of time, the business and family moved to Mysore when the city was proclaimed as capital of the Karnataka state, finally moved to Bangalore and started their business in the heart of the garden city 3/n