Balagopal Bot Profile picture
A tribute account to India's greatest public intellectual. Will function like a bot to tweet only his views on various issues.

Apr 25, 2022, 13 tweets

"ఆనాటి [దేశ విభజన] నుంచి ఈనాటి దాకా దేశంలో మత ఘర్షణలు ఎప్పుడూ జరగని అతికొద్ది ప్రాంతాలలో కశ్మీర్‌ ఒకటి. అయినా 'నాలుగు లక్షల మంది కశ్మీరీ పండిట్‌లు కశ్మీర్‌ లోయ వదిలిపెట్టి పోలేదా?' అని [...] అడుగుతున్నారు." (1/13)

#BalagopalOnKashmir #BalagopalOnKashmiriPandits
Year - 2008

"నాలుగు లక్షల మంది పోలేదు గానీ రెండు లక్షలపైగా పోయిన మాట వాస్తవం. దీనికి కారణం హిందువుల మీద దాడులు జరగడం అనుకుంటే పొరపాటు. 1989లో మొదలైన మిలిటెన్సీ తన రాజకీయ ప్రత్యర్థులను ఏరి ఏరి హతమార్చింది. అందులో కొందరు పండిట్‌లు ఉన్నారు." (2/13)

"అత్యధికం నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ తదితర పార్టీలకు చెందిన ముస్లింలున్నారు. కశ్మీరీ ముస్లింలు గుంపులుగా పండిట్‌లపైన దాడి చేసిన ఒక్క ఘటనా జరగలేదు." (3/13)

"ఆనాటి నుంచి ఈనాటి దాకా కశ్మీర్‌లో సైన్యం చేతిలోనూ,మిలిటెంట్ల చేతిలోనూ, ప్రభుత్వ అనుకూల సాయుధ బృందాల చేతిలోనూ చనిపోయిన వారి సంఖ్య వివిధ అంచనాల ప్రకారం 50 వేల నుంచి 80 వేల దాకా ఉంది. అందులో పండిట్‌ల సంఖ్య 300 మించి లేదు. మిగిలినవారంతా,ఎవరి చేతిలో చచ్చినా- కశ్మీరీ ముస్లింలే."(4/13)

"మిలిటెన్సీ కశ్మీరీ సంస్థల చేతినుంచి పాకిస్తాన్‌ కేంద్రంగా గల ఇస్లాంవాద సాయుధ సంస్థల చేతిలోకి పోయిన తరువాత మిలిటెంట్లు మూకుమ్మడిగా నిరాయుధులను చంపిన ఉదంతాలు జరిగాయి, జరుగుతున్నాయి గానీ అంతకు ముందు అది కూడ లేదు." (5/13)

"అయినప్పటికీ పండిట్‌లు పెద్ద సంఖ్యలో వలస పోవడానికి తమ భవితవ్యాన్ని గురించి వారిలో ఏర్పడిన అభద్రతా భావమే కారణం. [అప్పుడు] లక్షల మంది వీధులలోకి వచ్చి ఇండియా వ్యతిరేక నినాదాలిస్తున్నారు. కొందరు పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు ఇస్తున్నారు." (6/13)

"ప్రభుత్వ వ్యవస్థ కుప్ప కూలిపోయింది. పండిట్‌లు కళ్ళీర్‌ లోయ విడిచిపెట్టి పోవాలన్న పోస్టర్లు కొన్నిచోట్ల పడ్డాయి. దీనికి పండిట్‌లు భయపడటం సహజం." (7/13)

"పండిట్‌లను ప్రభుత్వం కాపాడజాలదనీ వారి భద్రత కోసం వారు లోయను విడిచిపెట్టి వెళ్లిపోవడం ఉత్తమమనీ రాష్ట్ర గవర్నర్‌ [జగ్‌మోహన్‌] స్వయంగా ప్రకటించడం పండిట్‌ల భయాన్ని మరింత పెంచి భారీ వలసకు దారితీసింది." (8/13)

"ఈ వలస కశ్మీరీలను కలవరపెట్టింది. హృదయనాథ్‌ జట్టో అనే కశ్మీరీ పండిట్‌, రిటైర్డ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఫ్తీ బహవుద్దీన్‌ ఫారూఖీలు కలిసి పండిట్‌లను వలస పోవద్దంటూ ఒక ప్రకటన జారీ చేశారు." (9/13)

"వారిద్దరి నేతృత్వంలో వలసలను అరికట్టే
లక్ష్యం గల ఒక కమిటీ ఏర్పడింది. కానీ దానిని గవర్నర్‌ జగ్‌మోహన్‌ సాగన్విలేదు.
జమ్మూకు చెందిన బలరాజ్‌ పురి అనే మానవ హక్కుల వాది గవర్నర్‌ చర్యకు ఆగ్రహించి ఆయనను కలిసి ఎందుకీ పని చేశావని అడగగా, జగ్‌మోహన్‌ చెప్పిన జవాబు ఏమిటంటే - (10/13)

'కశ్మీర్‌లో హిందువులూ ముస్లింలూ సఖ్యంగా బతికితే భారత సైన్యం మనోస్థయిర్యం దెబ్బ తింటుంది' అని" (11/13)

"వాస్తవాలు మనకు ఎంత అప్రియంగా ఉన్నా వాటిని గుర్తించడానికి నిరాకరించడం విజ్ఞత అనిపించుకోదు. వాస్తవాలు తెలుసుకోవడానికి ఓపిక లేక మన విశ్వాసాలనే సత్యాలుగా ప్రచారం చేసుకోవడం నాగరిక వైఖరి అనిపించుకోదు." (12/13)

- K Balagopal, 'కశ్మీర్ లో మన కర్తవ్యం' , ఆంధ్రజ్యోతి దినపత్రిక, 27th August 2008. (13/13)

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling