गरुडध्वज Profile picture
అన్నమయ్య, పోతన భక్తి సాహిత్యాభిమాని.

May 16, 2022, 10 tweets

అన్నమయ్య కీర్తనల పై ఒక ప్రత్యేకమైన తీగ (special thread). తప్పులుంటే క్షమించగలరు. 👇🙏

#అన్నమయ్యభావనిధానం

అన్నమయ్య జయంతి సందర్భంగా అందరికీ ఆయన దయ వల్ల వేంకటేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.

@Sarajags

అన్నమయ్య కీర్తనల విశిష్టత - పదకవిత్వం. పదకవిత్వం లో ఉదాహరణకు ఒక కీర్తన ఎన్నుకోవటం జరిగింది. అందరికీ సుపరిచితమైన కీర్తనే. దాని వివరణ తర్వాతి భాగంలో ఉంటుంది.

పదకవిత్వం ప్రత్యేకత వివరణ. అన్నమయ్య గొప్పతనం ఆయన పాటించిన ఒక సిద్ధాంతం ప్రకారం 32000 కీర్తనలు రచించటం.

అన్నమయ్య కీర్తనలు ఎందుకు అంత ప్రాచుర్యం పొందాయంటే అవి అతి సామాన్యులకు కూడా స్పష్టంగా అర్థమవుతాయి కాబట్టి.

అన్నమయ్య కీర్తనలు సామాన్యులకే కాదు, కొన్ని ప్రత్యేకమైన సంస్కృత ప్రయోగాలు కూడా చేసి గొప్ప గొప్ప పండితులని కూడా పులకరింపచేసినవి.

అన్నమయ్య కీర్తనల్లో మకుటం. ఎప్పుడైనా గమనించారా? ప్రతి అన్నమయ్య కీర్తనలో చివరి చరణంలో ఎక్కడైనా సరే "వేంకట" అనే పదం వస్తుంది. దాని ప్రత్యేకత ఏంటి?

అన్నమయ్య ఉపమానాలు అద్వితీయాలు. ఒక ఊహకు ఇలా స్ఫురించటం ఎలా సాధ్యం అని అనిపిస్తుంది.

అన్నమయ్య అంత్య ప్రాసతో, పాదం లో మూడు భాగాలతో యతిమైత్రి పాటిస్తూ అత్యద్భుతంగా రచించిన ఒక చక్కని కీర్తన.

అన్నమయ్య కవితాశక్తి ఎంత గొప్పదంటే ఎక్కడా కూడా దశావతారాల పేరు ఒక్కటి కూడా చెప్పకుండా, కీర్తనం మొత్తం దశావతారాల గురించే రచించారు. ఎక్కడా చూడలేము ఇంతటి విద్వత్తు.

అన్నమయ్య వైవిధ్యమైన ప్రయోగాలు అతనిలోని కవితాశక్తికి అద్దం పడతాయి. ఇదే చివరి భాగం. ఈ తీగలో ఉన్న భాగాలన్నీ ఒక యూట్యూబ్ వీడియోలో పెట్టటం జరిగింది. అక్కడ కూడా ఇది వీక్షించవచ్చు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling