అన్నమయ్య జయంతి సందర్భంగా అందరికీ ఆయన దయ వల్ల వేంకటేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.
@Sarajags
అన్నమయ్య కీర్తనల విశిష్టత - పదకవిత్వం. పదకవిత్వం లో ఉదాహరణకు ఒక కీర్తన ఎన్నుకోవటం జరిగింది. అందరికీ సుపరిచితమైన కీర్తనే. దాని వివరణ తర్వాతి భాగంలో ఉంటుంది.
వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే ఎన్నో చక్కటి విషయాలను సులభంగా అర్ధమయ్యే తెలుగులో చెప్పగలిగినందుకు అన్నమయ్యను 'ఆచార్య' అన్నారు. ప్రతి చరణంలో మంచికి, చెడుకి ఉదాహరణలిస్తూ ఏది ఎందుకు హానికరమో వివరిస్తున్నాడు ఈ కీర్తనలో @Sai_swaroopa@ivak99@Vishnudasa_@stellensatz
పల్లవి:
ఎంత విభవము గలిగె నంతయును నాపదని
చింతించినది గదా చెడనిజీవనము
ఆహా అద్భుతం! ఎంత సుందరమైన వర్ణన! పరమాద్భుతం! రాజు నరసింగరాయలు ఈ కీర్తన విని తనపై అటువంటి పాటే వ్రాయమని అడిగి blasphemy కి పాలుపడ్డాడు.
అమ్మవారికి అయ్యవారికి మధ్య జరిగిన అత్యంత పరమపవిత్రమైన సరసశృంగార కేళి. 🙏🙏🙏
@Sai_swaroopa@ivak99@Vishnudasa_
సందర్భం:
అమ్మవారు రాత్రి పడకగదిలో అయ్యవారితో రతిక్రీడలో మునిగి తేలుతూ, తెల్లవారిన సంగతి మరచింది. వారిని శయన మందిరంలో మేలుకొలపటానికి వచ్చిన చెలికత్తెలు అమ్మవారి కళ్యాణవదనం చూసి, మార్పులు గమనించి చర్చించుకుంటున్న మాటలు.
"కడుపులోని లోకాలన్నీ కదులుతాయి. లాలి కాస్త నెమ్మదిగా ఊచండి".
అన్నమయ్య యశోదమ్మగా మారి, మిగతా గోపికలతో కృష్ణుడికి ఉగ్గు ఎలా పెట్టాలి, ఎలా లాలించాలి అని అత్యంత ఆప్యాయంగా పరితపించిన కీర్తన. @stellensatz@ivak99@Sai_swaroopa@Vishnudasa_
పల్లవి:
ఉగ్గు వెట్టరే వోయమ్మా చె-
య్యొగ్గీనిదె శిశువోయమ్మా
పల్లవి భావం:
ఉగ్గుపాల కోసం చేయి చాచుతున్నాడు కృష్ణుడు, ఆకలిగా ఉందేమో ఉగ్గు పెట్టండమ్మా.