ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Sep 24, 2022, 9 tweets

#సతీ_సక్కుబాయి 1935లో విడుదలైన తెలుగు సినిమా,

ఆ తరువాత కడారు నాగభూషణం దర్శకత్వంలో యస్ వరలక్ష్మి గారితో సతీ సక్కుబాయి (1954) సినిమా గాఁ ,

అంజలి దేవి గారితో సతీ సక్కుబాయి (1965) సినిమా గాఁ పునః నిర్మించడం జరిగింది.

తొలి సినిమా గురించి మనకు అంత సమాచారం లేదు,

రెండవ సక్కు మాత్రం అద్భుతమనే చెప్పక తప్పదు, కాకోపోతే కాస్త శోకపుపాళ్లు ఎక్కువ , సతీ సక్కుబాయి (1954) సినిమా లోని పాటలు అద్భుతమే చెప్పాలి, యస్ వరలక్ష్మి గారి నటన, వారి గాత్రంతో ఈ సినిమాన్నిఇంకో స్థాయిలోకి తీసుకుని వెళ్లారు.

ఈ మూవీ లో అనుకున్నంత స్థాయిలో హాస్యం లేకపోవడం, ఎక్కువగా

అసలు విషయం పైన దర్శకుడు దృష్టి సారించడంతో హృదయానికి కాస్త భారంగా ఉంటుంది,

#కన్నాంబ గారి నటనకి పరాకాష్ట, #వరలక్ష్మి #కన్నాంబ గార్ల నటన అద్భుతం , వారిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు కట్టి పడేస్తాయి , రేలంగి , వరలక్ష్మి భార్య భర్తలుగా నటించడం విశేషం. గయ్యాళి పాత్రలో కన్నాంబ , కనకం

కలిసి సినిమాని ఇంకో స్థాయి లో నిలబెట్టారు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమి లేదు. అమాయకునిగా రేలంగి గారిగురించి చెప్పదేముంది.

ఏ మాటకామాట చెప్పుకోవాలి ,ఈ సతీ సక్కుబాయి (1954) సినిమా ఒక మాస్టర్ పీస్, ఒక క్లాసిక్ అని చెప్పుకోక తప్పదు. దూరదర్శన్లో ఈ సినిమా 90వ దశకం వరకు కాస్త అందుబాటులో

వున్నా , తరువుత పూర్తిగా కనుమరుగైంది .

ముచ్చటగా మూడవ సారి , అప్పటికే ఒరిజినల్ ప్రింట్లో చాలా భాగం చెడిపోవడం, ఉన్నది కూడా అతుకులబొంతలా మారిపోవడంతో , ఎదో మాటల సందర్భములో అంజలీదేవిగారితో ఈ విషయం గురించి చర్చించాడు రేలంగి.

ఒక సారి ఆ సినిమా చూద్దాం అన్నయ్య అని చెప్పారు రేలంగి గారితో

అంజలి దేవి గారు. భర్త అది నారాయణ రావు గారు , యస్వీ రంగారావు గారు, రేలంగి , సూర్యకాంతం, గిరిజలతో కలిసి సతీ సక్కుబాయి (1954) సినిమాని చూసారు అంజలి దేవి గారు.

వెంటనే ఆదినారాయణ రావు గారు ఈ సినిమాని మనం పుననిర్మిద్దామని చెప్పడం, పక్కనే నిర్మాత చిన్నారావు గారు ఈ సినిమాని నిర్మించే

అవకాశం నాకివ్వమని చెప్పడం , దర్శకునిగా వేదాంతం రాఘవయ్య గారు ఎలాగో వున్నారు. తొలుత సూర్యకాంతమ్మ భయపడ్డారు మహానటి కన్నాంబ గారి పాత్రకి నేను న్యాయం చేయగలనా అని, యస్వీయార్ గారు నచ్చచెప్పారు కాంతమ్మ నువ్వు తప్ప ఆ పాత్రకి ఎవరు న్యాయం చెయ్యలేరు అని , మొహమాటంతో ఒప్పుకున్నారు సూర్యకాంతమ్మ

ఈ క్లాసిక్ గురించి చెప్పుకోవాలంటే , ముఖ్యముగా కొన్ని విశేషాలు :-

ఆదినారాయణరావు గారి సంగీతం ఒకెత్తు సుశీలమ్మ గాత్రం ఇంకో ఎత్తు, అసలు ఆదినారాయణరావు సినిమా చేద్దాము అనడానికి కారణం సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండడం, ఇప్పటికి ఎప్పటికి ప్రతి పాట ఒక ఆణిముత్యమే.

అమాయకపు చక్రవర్తిలా

యస్వీయార్ నటన , గయ్యాళి పాత్రలో సూర్యకాంతమ్మ , భక్తురాలిగా అంజలీదేవిగారు , రేలంగి, గిరిజల మధ్య సాగిపోయే సన్నివేశాలు మన కళ్ళు తిప్పుకోనీవు , కృష్ణునికి కాంతారావు గారు చాలా చక్కగా నటించారు.

మరాఠీలో తరువాత ఈ సినిమా ని డబ్బింగ్ చేసి విడుదల చేశారు, అక్కడ విజయవంతమైంది.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling