ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Sep 24, 2022, 5 tweets

భూస్వాముల, కామాందుల దౌర్జన్యానికి బలి అయ్యి, సర్వం కోల్పోయి , పగబట్టి గజదొంగ గానో , బందిపోటు దొంగగానో మారి ధనవంతుల కొల్లగొట్టే పాత్రలలో #ఎస్వీఆర్ అదరగొట్టేసే వారు. గంబీరంమైన నిలువెత్తు విగ్రహం, హుంకరించే స్వరం , భయపెట్టే హావభావాలతో ఆలాంటి పాత్రలకు ప్రాణప్రతిష్ట చెయ్యడం లో

ఎస్వీఆర్ అగ్రగణ్యులు. బందిపోటు దొంగలు, బందిపోటు భీమన్న, డాక్టర్ బాబు, దెబ్బకు టా దొంగల ముఠా , కత్తుల రత్తయ్య చిత్రాలలో బందిపోటు గా కనిపిస్తారు. శ్రీ ఎస్వీఆర్, అలాంటి పాత్రలలో కూడా ప్రేక్షకుల కంట నీరు తెప్పించగల మహానటుడు వారు. అమాయకత్వం, నిస్సహాయత, భాధ , కసి, కోపంతో పాటు

జాలి , హాస్యం , పశ్చాతాపం చూపగల దిట్ట. బందిపోటు దొంగలు చిత్రంలో తూటా దెబ్బలు తగిలి డాక్టర్ ఇంటికివస్తాడు. సర్దార్, మత్త్తుమందు ఇవ్వకుండా తూటాలు తీయమని డాక్టర్ ను బెదిరిస్తాడు. చాల నొప్పిగా బాధగా ఉంటుందని చెప్పిన డాక్టర్ తో పరవాలేదు అంటాడు సర్దార్. డాక్టర్ భార్య పసి బిడ్డను

ఎత్తుకుని భయపడుతూ చూస్తుంటుంది. సర్దార్ బిడ్డ వైపు చూస్తాడు. బోసి నవ్వులు నవ్వుతాడు ఆ చిన్నారి, వెక్కిరిస్తాడు సర్దార్. మళ్ళి నవ్వుతాడు ఆ చిన్నారి. ఆలా ఆ పసివాడితో ఆడుకుంటే ఉండగానే తూటాలను తొలగిస్తాడు. ఆ సన్నివేశం లో ఎస్వీఆర్ నటన ప్రేక్షకులను ముగ్దులను చేస్తుంది.

డాక్టర్ బాబు చిత్రంలో కూతురుకు దూరంగా రహస్యంగా జీవించే సన్నివేశం , అతను చూపించే ఆవేదన గుండెలను పిండుతుంది. మొత్తం మీద బందిపోటు దొంగ ఎలా ఉంటాడు అని అడిగితే మనకు గుర్తుకు వచ్చేది ఎస్వీఆర్ గారి రూపమే.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling