Konatham Dileep Profile picture
#JaiTelangana ✊

Sep 29, 2022, 17 tweets

#Thread

సుదీర్ఘ పోరాటం, అసమాన త్యాగాల తరువాత సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలోని తొలి ప్రభుత్వం చేసిన ముఖ్యమైన పనుల్లో ఒకటి, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాషకు సముచిత స్థానం కల్పించడం

ఆ వివరాలు తెలిపే ట్వీట్ #Thread ఇది

1/n

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషకు, చరిత్ర, సంస్కృతికి తీవ్ర వివక్ష ఎదురైంది. మరీ ముఖ్యంగా ఇది పాఠ్య పుస్తకాల్లో స్పష్టంగా ప్రతిఫలించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన భవిష్యత్ తరాలు చదివే పాఠ్య పుస్తకాలను సమూలంగా సంస్కరించింది.

2/n

తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికులు, మన భాష, సంస్కృతి, చరిత్రకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రక్రియ కొనసాగింది. ఒకటో తరగతి మొదలుకొని డిగ్రీ స్థాయి వరకూ ఉన్న పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేశారు.

3/n

ఒకటో తరగతి తెలుగు పుస్తకంలో ఉన్న కొన్ని పాఠాలు: మూకుడు, మైదాకు, గీతల అంగి, కొంగ సోపతి ... ఇలా పాఠాల పేర్లలోనే తెలంగాణతనం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.

ఉమ్మడి రాష్ట్రపు పాఠ్య పుస్తకాల్లో కనిపించని తెలంగాణ భాషను పిల్లలకు పరిచయం చేసే ప్రయత్నం ఇది.

4/n

రెండవ తరగతి తెలుగు వాచకంలో ఉన్న ...తెలంగాణ రాష్ట్రం, బతుకమ్మ పేరుద్దాం, బతుకమ్మ ఆడుదాం, బతుకమ్మలెత్తుదాం, పోయిరా గౌరమ్మ, సోపతి... లాంటి పాఠాలు విద్యార్థుల్లో తెలంగాణ సోయిని కలుగచేస్తాయి.

#Thread
5/n

మూడవ తరగతి తెలుగు వాచకంలో ఉన్న 'తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు' అన్న పాఠంలో జింక, పాలపిట్ట, జమ్మి చెట్టు, తంగేడు పువ్వుల గురించి... 'నీటి అందాలు' అన్న పాఠంలో లక్నవరం, కుంటాల జలపాతం, నాగార్జున సాగర్ ల గురించిన సమాచారాన్ని పొందుపరిచారు.

#Thread

6/n

నాల్గవ తరగతి తెలుగు వాచకంలో తెలంగాణ గొప్పతనం ఇతివృత్తంగా "తెలంగాణ వైభవం", "కళారత్నాలు" అన్న గేయాలు ఉన్నవి. తెలంగాణ రాష్ట్రం ఘనచరిత్రకు, త్యాగధనులకు, కవులకు, కళాకారులకు, చారిత్రక కట్టడాలకు, ప్రకృతి వనరులకు నిలయమని తెలియజెప్పడమే ఈ గేయాల ఉద్దేశం.

#Thread
7/n

ఐదవ తరగతి తెలుగు వాచకంలో హైదరాబాద్ చరిత్రను వివరిస్తూ "ప్యారా హైదరాబాద్" పాఠం, తెలంగాణ సంస్కృతి, పండగలు గురించి "బోనాలు" పాఠం, తెలంగాణ చరిత్ర, స్ఫూర్తిప్రదాతల జీవితాలను విద్యార్థులకు వివరించే "చిట్యాల ఐలమ్మ" పాఠం, ఇంకా యాదగిరి గుట్ట, సాలార్ జంగ్ మ్యూజియం పాఠాలు చేర్చారు.

8/n

ఆరవ తరగతి తెలుగు వాచకంలో సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ పాఠం, రామప్ప దేవాలయం, గోల్కొండ, కాకతీయ శిలాతోరణం, గద్వాల్ కోట, పిల్లల మర్రి, సింగరేణి గనులు వంటి దర్శనీయ ప్రదేశాల గురించి పాఠాలు, ఉపవాచకంలో 'సమ్మక్క సారక్క జాతర' పాఠం, 'తెలంగాణ పల్లెలు - సంస్కృతి' పాఠం ఉన్నాయి.

9/n

ఏడవ తరగతి తెలుగు వాచకంలో తెలంగాణ గ్రామ సంస్కృతిపై దేవులపల్లి రామానుజరావు 'గ్రామాల్లో వేడుకలు, క్రీడా వినోదాలు' పాఠం, అమరవీరుడు, తెలంగాణ బిడ్డ 'కెప్టెన్ విజయరఘునందన రావు' గురించి పాఠం, ఉపవాచకంలో మన పండగల మీద, రాణి రుద్రమదేవి గురించి, ఆరుట్ల కమలాదేవి గురించి పాఠాలు ఉన్నాయి

10/n

8వ తరగతి తెలుగు & స్పెషల్ తెలుగు పుస్తకాల్లో తెలంగాణ చరిత్రను, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా -పాల్కురికి సోమనాథుడు, దాశరథి కృష్ణమాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి మొదలైన వారి రచనలు; ఉపవాచకంలో షోయబుల్లాఖాన్, చిందు ఎల్లమ్మ, పివి నరసింహారావు గార్ల గురించి పాఠాలు ఉన్నాయి

11/n

9 వ తరగతి తెలుగు, స్పెషల్ తెలుగు వాచకాల్లో కాళోజీ , డాక్టర్ సినారె లాంటి తెలంగాణ సాహిత్యవేత్తల రచనలు పాఠ్యాంశాలుగా.. తెలుగు ఉపవాచకంలో కుంరం భీం, కాళోజీ, సురవరం ప్రతాపరెడ్డి, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ లాంటి మహనీయుల జీవితాల గురించి మన విద్యార్ధులు నేర్చుకుంటారు.

#Thread

12/n

పదవ తరగతి తెలుగు వాచకంలో సామల సదాశివ, దాశరధి కృష్ణమాచార్య, సినారె, పాకాల యశోదా రెడ్డి, అలిశెట్టి ప్రభాకర్ మొదలైన తెలంగాణ కవుల రచయితల సాహిత్యం, ఒగ్గు కథ లాంటి కళారూపాలు... ఉపవాచకంలో స్ఫూర్తిప్రదాతలు అన్న శీర్షికతో తెలంగాణ మహనీయుల జీవితాలు విద్యార్థులకు స్పూర్తినిస్తాయి.

13/n

ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో తెలంగాణ భౌగోళిక అంశాలు, సాహిత్యం, శిల్పాలు, కట్టడాల గురించి పాఠ్యాంశాలు ఉన్నాయి. "తెలంగాణలో పచ్చదనం" అన్న పేరుతో ప్రత్యేక పాఠ్యాంశం, ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు పద్మశ్రీ వనజీవి రామయ్య గురించి సమాచారం ఉంది.

14/n

ఏడవ తరగతి సాంఘికశాస్త్రంలో "మతము - సమాజము" చాప్టర్ లో బోనాలు, జహంగీర్ పీర్ దర్గా, మేడారం జాతర, పోతరాజు, బీరప్ప, కాటమరాజు దేవుళ్లు, గ్రామ దేవతలైన ఎల్లమ్మ, మైసమ్మ, గంగమ్మ, పోచమ్మల గురించి - మొత్తంగా మన తెలంగాణకు సొంతమైన సంస్కృతి సంప్రదాయాల గురించి విద్యార్థులు నేర్చుకుంటారు

15/n

8వ తరగతి సాంఘిక శాస్త్రంలో "ఆధునిక కాలంలో కళలు- కళాకారులు" పాఠంలో కిన్నెర మొగులయ్య, గుసాడీ, డప్పు నాట్యం, "సినిమా ముద్రణ మాధ్యమాలు" పాఠంలో నర్సింగ్ రావు గారి "మాభూమి" అల్లాణి శ్రీధర్ గారి "కొమరం భీం" సినిమాలు, సురవరం ప్రతాప రెడ్డి గారి గోల్కొండ పత్రిక గురించి సమాచారం ఉంది

16/n

పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం గురించి - భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం, 1969 ఉద్యమం, 1990లలో ఉద్యమాలు, ధూమ్ ధామ్, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, వంటా-వార్పు లాంటి వినూత్న పోరాటాల గురించిన సమాచారం పొందుపరిచారు.

#Thread

17/n

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling