ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 5, 2022, 11 tweets

వామ పక్ష భావాల పత్రికలనో, మేధావులమనో చెప్పుకుంటూ ఎంత విద్వేషం జల్లినా...

#ఎన్టీఆర్ లేని లోటు ఇప్పటి వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన చారిత్రక, పౌరాణిక సినిమాలు చూస్తే కొట్టవచ్చినట్లు తెలియడం లేదూ ?

#ఎన్టీఆర్ ఏదో ఒక వర్గానికో, ఒక పార్టీకో చెందిన వ్యక్తి కాదు.

అద్భుతమైన కళాకారుడు. నటుడు, దర్శకుడు, చిత్రకారుడు, రచయిత. చిత్ర సీమలోని అన్ని భాగాలలో ప్రావీణ్యం కలవాడు.

ఈ టీ వీ సినిమా (Tatasky Chanel 1440) లో సాయంకాలం 7 గంటలకు వస్తున్న ఈ వారపు సినిమాలు చూడండి. మీ పిల్లలకు చూపించండి.

1) 01/10/2022, శనివారం : మిస్సమ్మ 1955

సంక్రాంతి కానుకగా 12 జనవరి 1955న విడుదలై జయభేరి మోగించి 13 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.

2) 02/10/2022, ఆదివారం : మల్లీశ్వరి 1951

బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రామారావు, భానుమతిల నటన ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా రూపుదిద్దుకున్న చిత్రం

3) 03/10/2022, సోమవారం : గుండమ్మ కధ, 1962

నందమూరి తారక రామారావు నటించిన 100 వ చిత్రం విజయా వారి గుండమ్మ కధ (23 కేంద్రాలలో 100 రోజులు)

4) 04/10/2022, మంగళవారం : నర్తనశాల 1963

ఎన్టీఆర్ లేకపోతే ఈ సినిమానే లేదు. ఆయన ఇంతకుముందు చేసిన పౌరాణిక పాత్రలన్నీ ఒకెత్తు అయితే, ఈ బృహన్నల

మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఓ పక్క పురుషత్వం, మరో పక్క స్త్రీ లాలిత్యాన్ని కలగలుపుతూ ఆయన చూపిన అభినయం ఓ పాఠ్యాంశమే. అర్జునుడు బృహన్నలగా ఎన్టీఆర్ అభినయం శిఖర స్థాయిని చేరుకుంది. రెండు పాత్రల మధ్య వైవిధ్యం ప్రేక్షక జనాన్ని మెస్మరైజ్ చేసింది. ఆ నటవైభవం టాక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అయింది.

తొలి రిలీజ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం 26 కేంద్రాల్లో విడుదలైతే, అన్ని చోట్లా 50 రోజులు ఆడింది. ఏకంగా 19 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది.

5) 05/10/2022, బుధవారం : మాయా బజార్, 1957

మాయాబజార్ 23 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని, రజతోత్సవ చిత్రం గా ఆ ఏటి అతి పెద్ద

విజయంగా సంచలనం సృష్టించింది.

తప్పక చూడాల్సిన సినిమాలు..

షావుకారు, పాతాళ భైరవి, మల్లీశ్వరి, తోడుదొంగలు, అగ్గిరాముడు, మిస్సమ్మ, కన్యాశుల్కం, జయసింహ, తెనాలి రామకృష్ణ, పాండురంగ మహాత్మ్యం, మాయాబజార్, భూ కైలాస్, శబాష్ రాముడు, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం, జగదేక వీరుని కధ,

సీతా రామ కల్యాణం, కలసి ఉంటే కలదు సుఖం, భీష్మ, దక్ష యజ్ఞం, గుండమ్మ కధ, రక్త సంబంధం, మహామంత్రి తిమ్మరుసు, ఆత్మ బంధువు, శ్రీ కృష్ణార్జున యుద్ధం, లవ కుశ, నర్తనశాల, బొబ్బిలి యుద్ధం, రాముడు భీముడు, గుడి గంటలు, దాగుడు మూతలు, పాండవ వనవాసం, తోడు నీడ, ఆడ బ్రతుకు, వీరాభిమన్యు,

పల్నాటి యుద్ధం, పరమానందయ్య శిష్యుల కధ, శ్రీ కృష్ణ పాండవీయం, ఉమ్మడి కుటుంబం, శ్రీ కృష్ణ తులాభారం, శ్రీ కృష్ణావతారం, ఆడపడచు, రాము, వరకట్నం, కధానాయకుడు, చిట్టి చెల్లెలు, కోడలు దిద్దిన కాపురం, బడిపంతులు, దేశోద్ధారకులు, దేవుడు చేసిన మనుషులు , నిప్పు లాంటి మనిషి.

( ఎన్ టి ఆర్ 1949 -1974 మధ్య నటించిన 200 తెలుగు సినిమాలలో మొదట చెప్పుకునే 50 సినిమాలు )

ప్రపంచంలో మరే నటుడు ఇన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించలేదు. అందుకే ఎన్టీఆర్ ని నడిచే దేవుడిగా కొలవబడ్డ పరమాచార్య , విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అని సంబోధించారు.

ఇప్పటికైనా మన తెలుగువారు, 1949- 1974 మధ్య వచ్చిన మన పౌరాణిక, చారిత్రక సినిమాలను తరువాత తరంవారికి చూపించవలసిన భాద్యత ఉంది..

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling