వామ పక్ష భావాల పత్రికలనో, మేధావులమనో చెప్పుకుంటూ ఎంత విద్వేషం జల్లినా...

#ఎన్టీఆర్ లేని లోటు ఇప్పటి వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన చారిత్రక, పౌరాణిక సినిమాలు చూస్తే కొట్టవచ్చినట్లు తెలియడం లేదూ ?

#ఎన్టీఆర్ ఏదో ఒక వర్గానికో, ఒక పార్టీకో చెందిన వ్యక్తి కాదు. Image
అద్భుతమైన కళాకారుడు. నటుడు, దర్శకుడు, చిత్రకారుడు, రచయిత. చిత్ర సీమలోని అన్ని భాగాలలో ప్రావీణ్యం కలవాడు.

ఈ టీ వీ సినిమా (Tatasky Chanel 1440) లో సాయంకాలం 7 గంటలకు వస్తున్న ఈ వారపు సినిమాలు చూడండి. మీ పిల్లలకు చూపించండి. Image
1) 01/10/2022, శనివారం : మిస్సమ్మ 1955

సంక్రాంతి కానుకగా 12 జనవరి 1955న విడుదలై జయభేరి మోగించి 13 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.

2) 02/10/2022, ఆదివారం : మల్లీశ్వరి 1951

బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రామారావు, భానుమతిల నటన ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా రూపుదిద్దుకున్న చిత్రం Image
3) 03/10/2022, సోమవారం : గుండమ్మ కధ, 1962

నందమూరి తారక రామారావు నటించిన 100 వ చిత్రం విజయా వారి గుండమ్మ కధ (23 కేంద్రాలలో 100 రోజులు)

4) 04/10/2022, మంగళవారం : నర్తనశాల 1963

ఎన్టీఆర్ లేకపోతే ఈ సినిమానే లేదు. ఆయన ఇంతకుముందు చేసిన పౌరాణిక పాత్రలన్నీ ఒకెత్తు అయితే, ఈ బృహన్నల Image
మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఓ పక్క పురుషత్వం, మరో పక్క స్త్రీ లాలిత్యాన్ని కలగలుపుతూ ఆయన చూపిన అభినయం ఓ పాఠ్యాంశమే. అర్జునుడు బృహన్నలగా ఎన్టీఆర్ అభినయం శిఖర స్థాయిని చేరుకుంది. రెండు పాత్రల మధ్య వైవిధ్యం ప్రేక్షక జనాన్ని మెస్మరైజ్ చేసింది. ఆ నటవైభవం టాక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అయింది. Image
తొలి రిలీజ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం 26 కేంద్రాల్లో విడుదలైతే, అన్ని చోట్లా 50 రోజులు ఆడింది. ఏకంగా 19 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది.

5) 05/10/2022, బుధవారం : మాయా బజార్, 1957

మాయాబజార్ 23 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని, రజతోత్సవ చిత్రం గా ఆ ఏటి అతి పెద్ద Image
విజయంగా సంచలనం సృష్టించింది.

తప్పక చూడాల్సిన సినిమాలు..

షావుకారు, పాతాళ భైరవి, మల్లీశ్వరి, తోడుదొంగలు, అగ్గిరాముడు, మిస్సమ్మ, కన్యాశుల్కం, జయసింహ, తెనాలి రామకృష్ణ, పాండురంగ మహాత్మ్యం, మాయాబజార్, భూ కైలాస్, శబాష్ రాముడు, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం, జగదేక వీరుని కధ, Image
సీతా రామ కల్యాణం, కలసి ఉంటే కలదు సుఖం, భీష్మ, దక్ష యజ్ఞం, గుండమ్మ కధ, రక్త సంబంధం, మహామంత్రి తిమ్మరుసు, ఆత్మ బంధువు, శ్రీ కృష్ణార్జున యుద్ధం, లవ కుశ, నర్తనశాల, బొబ్బిలి యుద్ధం, రాముడు భీముడు, గుడి గంటలు, దాగుడు మూతలు, పాండవ వనవాసం, తోడు నీడ, ఆడ బ్రతుకు, వీరాభిమన్యు, Image
పల్నాటి యుద్ధం, పరమానందయ్య శిష్యుల కధ, శ్రీ కృష్ణ పాండవీయం, ఉమ్మడి కుటుంబం, శ్రీ కృష్ణ తులాభారం, శ్రీ కృష్ణావతారం, ఆడపడచు, రాము, వరకట్నం, కధానాయకుడు, చిట్టి చెల్లెలు, కోడలు దిద్దిన కాపురం, బడిపంతులు, దేశోద్ధారకులు, దేవుడు చేసిన మనుషులు , నిప్పు లాంటి మనిషి. Image
( ఎన్ టి ఆర్ 1949 -1974 మధ్య నటించిన 200 తెలుగు సినిమాలలో మొదట చెప్పుకునే 50 సినిమాలు )

ప్రపంచంలో మరే నటుడు ఇన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించలేదు. అందుకే ఎన్టీఆర్ ని నడిచే దేవుడిగా కొలవబడ్డ పరమాచార్య , విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అని సంబోధించారు. Image
ఇప్పటికైనా మన తెలుగువారు, 1949- 1974 మధ్య వచ్చిన మన పౌరాణిక, చారిత్రక సినిమాలను తరువాత తరంవారికి చూపించవలసిన భాద్యత ఉంది.. Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with ఆదిత్య శివశంకర కలకొండ

ఆదిత్య శివశంకర కలకొండ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @adithyashiva23

Aug 1, 2023
#తమిళ భాషను #తెలుగువారు "#అరవం"అని ఎందుకు అంటారు?

మన మునుపటి తరం #తెలుగు వాళ్ళు #తమిళాన్ని #అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇలా ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను '#మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు.
ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాల లాగా అన్నమాట. #చోళ మండలం, #పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''#తొండై_మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే #అరువనాడు. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం
వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకి అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద #అరవభాష, #అరవం అని పిలుస్తున్నారు.

మనం మాత్రమే కాదు తమిళులని ఇలా రాజ్యం పేరుతో పిలిచేది,
Read 5 tweets
Apr 29, 2023
#తెలుగు_భాష

తెలుగు భాషను మన ఇళ్లలోనే వాడటం మానేశామా?

డోర్ లాక్ చెయ్యకండి..

నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో..

నా కార్ కీస్ ఎక్కడ?

ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..

ఎందుకు ?

ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..

ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?

మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
వంటింటిని... #కిచెన్ చేసాం..
వసారా... #వరండాగా మారింది...
ఇలా #చావడి, #పంౘ, #ముంగిలి, #నట్టిల్లు, #తలవాకిలి, #నడవ, #పెరడు, ఇవన్నీ మరచిపోయాం..

మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు..
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు..
Read 13 tweets
Mar 21, 2023
*#వదిలెయ్_మిత్రమా*

✒️ ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం
*వదిలెయ్*

✒️ పిల్లలు ఎదిగాక, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాల పడక
*వదిలెయ్*
✒️ కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను
*వదిలెయ్*

✒️ ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోయినా, లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా
*వదిలెయ్*
✒️ మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం
*వదిలెయ్*

✒️ మనలోని కోరికకు, మన సామర్థ్యానికి మధ్య చాలా తేడా ఉంటే, ఆ కోరికను
*వదిలెయ్*

✒️ ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తితో మరో వ్యక్తిని సరిపోల్చకుండా
*వదిలెయ్*
Read 4 tweets
Mar 21, 2023
ఎవరు వ్రాసారో కానీ చాల గొప్పగా ఉంది..
చాలా గర్వంగా ఉంది..

ఒక గర్భవతైన భార్య,
ఆమె భర్త ఇలా
మాట్లాడుకుంటున్నారు..

భార్య:

ఏం అనుకుంటున్నావ్..?
అబ్బాయి పుడతాడనా ?
అమ్మాయనా..??

భర్త:

అబ్బాయనుకో...
వాడికి లెక్కలు
నేర్పుతాను...
ఇద్దరం కలిసి గేమ్స్
ఆడుకుంటాం...
స్విమ్మింగ్
నేర్పుతా...
చెట్లెక్కడం
నేర్పుతా...
అమ్మాయిలతో
ఎలా మాట్లాడాలో
నేర్పుతా... ఇంకా....

భార్య:

చాలు చాలు!
మరి అమ్మాయి పుడితే..!?

భర్త:

అమ్మాయైతే
ఏం నేర్పనవసరంలేదు...!
అదే నాకు
నేర్పుతుంది...

నేనేం తినాలి...
ఏం తినకూడదు...
ఏం మాట్లాడాలి...
ఏం మాట్లాడకూడదు...
నేను ఎలాంటి బట్టలు
వేసుకోవాలి...

ఒక రకంగా
మా అమ్మ లాగా
అన్నమాట...

ఇంకా నేను దానికి
ప్రత్యేకంగా ఏం
చేయకపోయినా
నన్ను హీరోలా చూసుకుంటుంది...

నన్నెవరైనా
బాధపెట్టారనుకో,
వాళ్ళని అస్సలు
క్షమించదు...
ఎదురు తిరుగుంది...

భర్త దగ్గర కూడా
నాగురించి గొప్పగా
చెప్తుంది...
Read 8 tweets
Mar 21, 2023
#గడ్డి నీలం రంగులో కదా ఉండేది❓" అని ఒక గాడిద పులిని అడిగింది.

దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి❓.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది..

గాడిద "ఏడ్చావులే❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది..
ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ, అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి..

దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.

అక్కడికి చేరుకోగానే❗ పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద *"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా
ఉండేది.. అవునా కాదా❓ మీరే చెప్పండి " అంది.

"అవును❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం.

అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా❗అలా అని నేను ఎంత చెప్పినా, ఈ పులి ఒప్పుకోవడం లేదు. అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.
Read 6 tweets
Mar 14, 2023
#సనాతన_ధర్మం - #పునర్జన్మ

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను
స్వామివారి ముందుంచాడు.

”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో
నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.

”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.

అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(