#ఎన్టీఆర్, #సావిత్రి తెలుగు సినీ కళామతల్లి కిరీటంలో వన్నె తరగని వజ్రాలు.
ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు నుంచే వారిద్దరూ సహనటులు. అదెలాగంటే... ఎన్టీఆర్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో స్థాపించిన 'ఎన్ ఏ టి' నాటక సంస్థలో ఎన్టీఆర్, జగ్గయ్యలతో కలిసి కొన్నాళ్ళు నాటకాలు వేశారు సావిత్రి.
ఎన్టీఆర్ సరసన 'పల్లెటూరు' చిత్రంలో తొలిసారి కథానాయికగా నటించారు సావిత్రి. అదివరకు ఎన్టీఆర్ హీరోగా నటించిన 'సంసారం', 'పాతాళ భైరవి', 'పెళ్ళిచేసి చూడు' చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన సావిత్రికి 'పల్లెటూరు' సినిమా కథానాయిక స్థాయినిచ్చింది.
ఆ తర్వాత 'మిస్సమ్మ', 'మాయాబజార్',
'గుండమ్మకథ', 'నర్తనశాల', 'పాండవవనవాసం'.. ఇలా ఎన్నెన్నో అద్భుత చిత్రాలలో వీరిద్దరూ కలిసి ప్రేక్షకుల మనసు దోచారు. ‘కన్యాశుల్కం’ సినిమాలో 'మధురవాణి'గా సావిత్రికి, 'గిరీశం'గా ఎన్టీఆర్ కు విభిన్నమైన పాత్రలు లభించాయి. ఈ పాత్రల్లో వీరిద్దరూ పోటీపడి
నటించి ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు.
వీరిద్దరూ నటించిన చిత్రాలన్నీ ఒకవైపైతే 'రక్త సంబంధం' చిత్రం మరోవైపు. తమిళంలో 'పాశమలర్' అనే చిత్రం చాలా విజయవంతమైంది. శివాజీ గణేశన్, సావిత్రి అన్నా చెల్లెలుగా నటించారు. 'పాశమలర్'ను తెలుగులో రీమేక్ చేయాలనుకున్న నిర్మాత,
ముందు అక్కినేని గారిని సంప్రదించారు. 'నేను సావిత్రికి అన్నగా నటిస్తే.. జనం తిప్పి కొడతారు.' అని తప్పుకున్నారు. వెంటనే ఎన్టీఆర్ ని డూండీగారి ద్వారా సంప్రదించారు. ఆయన రెండో ఆలోచన లేకుండా 'ఆల్ ది బెస్ట్ బ్రదర్' అని చెప్పి డేట్స్ ఇచ్చేశారు.
'రక్తసంబంధం' చిత్రం విడుదలై అఖండ
విజయం సాధించింది. సినిమాల ఎంపిక విషయంలో ఎన్టీఆర్ విజన్ ఇలా ఉంటుందన్న మాట అని అందరూ ఆశ్చర్యపోయారు. అన్నాచెల్లెళ్ళ నటనని అందరూ ఆదరించారు. అన్నాచెల్లెళ్ళ బంధానికి ఈ చిత్రాన్ని ఇప్పటికీ ఉదాహరణగా చెప్పుకుంటారు.
ఎన్టీఆర్, సావిత్రిల సోలో ఫోటోలు వారి లైఫ్‌టైమ్ ఆల్బమ్‌గా నిలిచిపోయాయి.
ఎన్టీఆర్, సావిత్రిల మీద ఈ సినిమా ఎంత ప్రభావం చూపించిందంటే.. ఆ తర్వాత వారిద్దరూ జంటగా చాలాకాలం నటించలేకపోయారు.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.