ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 6, 2022, 7 tweets

అందుకే ఆయన నవరస నట సార్వభౌముడు అయ్యాడు !

అవి ‘ఎస్వీయార్’ శకం ముగుస్తున్న రోజులు. ఆ విశ్వనటుడు తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు ? అని సినీ ప్రముఖులు ఆందోళన పడుతున్న రోజులు అవి.

అప్పుడే నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కైకాల సత్యనారాయణ. మరో ఎస్వీయార్ అవుతాడు అన్నారు.

కానీ, #కైకాల నవరస నటుడు అయ్యాడు. #ఎస్వీయార్ ప్రభావం తనమీద పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు #కైకాల.

తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవరుచుకుంటూ నవరసాల నట చక్రవర్తి అయ్యాడు.

కైకాల, తానూ నటించిన ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, అందరి మన్ననలు పొందిన మేటి నటుడు ఆయన.

వెండితెరపై భయంకరమైన విలన్ గా మెరిసిన కైకాల.. ప్రేక్షకుల గుండెల్లో గొప్ప నటుడిగా నిలిచిపోయాడు. అయితే, ఏఎన్నార్ సినిమా షూట్ కోసం ఉదయమే సెట్ కి వెళ్లారు కైకాల సత్యనారాయణ గారు. ఆ రోజు ఫైట్ షూట్ చేస్తున్నాం అన్నారు. పైగా వర్షంలో ఫైట్ చిత్రీకరణ. అందుకే.. కైకాల సత్యనారాయణ కాస్త

ఇబ్బంది పడుతూనే ఆ రోజు షూట్ లో పాల్గొన్నాడు. కట్ చేస్తే.. ఆ ఫైట్ షూటింగ్ మొదలు అయింది.

ఆ ఫైట్ లోని ఒక షాట్ చాలా ప్రమాదకరంగా ఉంది. దాంతో ఆ షాట్ చేయనని కైకాల సత్యనారాయణ తెగేసి చెప్పారు. దర్శకనిర్మాతలు అంగీకరించలేదు. డబ్బు తీసుకునేటప్పుడే చేయాలి అని వాళ్ళు దెప్పిపొడిచారు.

కైకాల సత్యనారాయణ మనసు గాయపడింది. నేరుగా ఆ సినిమా హీరో #ఏఎన్నార్ వద్దకు వెళ్లి ఇదే విషయాన్ని చెప్పాడు. ఏఎన్నార్ గారు, కైకాల గారు మాటలు అన్నీ విని.. ‘చూడండి, సత్యనారాయణ గారు ఆ ఫైట్ మీరే కాదు, నేను కూడా చేస్తున్నాను. నిర్మాత అప్పు తెచ్చి సినిమా చేస్తున్నాడు.

మనం ఇలాంటివి చేయాలి. ప్రేక్షకులు ఇవి కోరుకుంటున్నారు’ అంటూ ఏఎన్నార్ చెప్పుకుంటూ పోయారు.

అయితే, ఏఎన్నార్ మాటలు కైకాల సత్యనారాయణ కి నచ్చలేదు. వెంటనే కైకాల అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్లిపోయారు. కానీ, మరుసటి రోజు ఆ ప్రమాదకరమైన షాట్ కైకాల గారే చేశారు. అయితే ఆ తర్వాత కైకాల గారు

ఫైట్ సీన్స్ చేయడం తగ్గిస్తూ వచ్చారు.

అంతలో కైకాల గారికి కామెడీ క్యారెక్టర్లు కూడా వచ్చాయి. హాస్యం కైకాల వల్ల ఏం అవుతుంది ? అంటూ విమర్శలు చేశారు. అందుకే, హాస్య పాత్రలను ప్రత్యేకంగా తీసుకుని కైకాల గారు కసితో నటించారు. అందుకే, ఆయన నవరస నటనా సార్వభౌముడు అయ్యాడు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling