#వెల్ల #కామెర్ల #మందు
వ్యాసరచన - -భీమాంకర్ గారు
#వెల్ల అనే గ్రామం #తూర్పుగోదావరి జిల్లా #రామచంద్రపురం మండలంలో ఉంది. సుమారు 100 ఏళ్లుగా ఆ గ్రామంలో ఒక కుటుంబం పచ్చ కామెర్లు(జాండీస్) కు వైద్యం చేస్తున్నారు. వారు కేవలం ఈ ఒక్క వ్యాధికి మాత్రమే ఆకు నూరిన మాత్రలతో వైద్యం చేస్తారు.
ఈ మందు తీసుకోదలిచిన వారిని ఉదయం ఏమీ తినకుండా సుమారు 6 గంటలు ఆపి ఆ మందు తినిపిస్తారు.ఆ తరువాత పాలు తాగిస్తారు. మూడు రోజులు ఏమి తినాలో, ఏమి తినకూడదో వివరించి, మూడోరోజు ఆముదం గానీ, విరేచన ఆకుతో కాసిన చారు గానీ పూర్తి విరోచనం కోసం తాగమంటారు. ఇదే వైద్యం.
పచ్చకామెర్లు ఈ విధంగా తగ్గిన
రోగులు ఈ ప్రాంతంలో వేలల్లో ఉన్నారు. ఇప్పటికీ ఆ వైద్యం కొనసాగుతోంది. ఆ వైద్యం చేసే కుటుంబీకులు మరేవిధమైన రోగాలకూ వైద్యం చేయరు. అంటే ఆయుర్వేద వైద్యులు కాదన్నమాట. వారు ఓ 30 ఏళ్ల క్రితం వరకు ఆ మందు కోసం ఒక్క రూపాయి తీసుకునేవారు. ఇప్పుడెంత తీసుకుంటున్నారో తెలీదు. కానీ ఆ వైద్యం పట్ల
ప్రజలు ఇప్పటికీ ఎంతో సంతృప్తితో ఉన్నారు.
మనకు ప్రకృతిలో సహజంగా లభించే మూలికలూ, మొక్కలూ, ఆకులూ, కాయలూ, గింజలూ, చెట్టు బెరడు లాంటివి మన శరీరంలో అనేక మార్పులకు సర్దుబాట్లకూ, అస్వస్థతకూ, స్వస్థతకూ కచ్చితమైన పాత్ర వహిస్తాయనటంలో సందేహం లేదు.
ప్రాచీన కాల వైద్య రంగంలో ఈ విధమైన ప్రకృతి
సహజమైన మూల పదార్ధాల స్వభావంపై మనుషులపై వాటి ప్రభావాన్ని బౌద్ధులు మొదటగా వివరించారన్న రుజువులున్నాయి. ఈ మూలికా/ఆయుర్వేదంలో శాస్త్రీయ పద్ధతులనూ, రీసెర్చ్ నూ బౌద్ధులే కనుగొన్నారన్నది కూడా వాస్తవం.
అల్లోపతి సునామీ వలన ఇపుడు దేశీయంగా ఆయుర్వేదానికి ఉన్న ఆ కాస్త పలుకుబడీ
అడుగంటిపోయింది. అల్లోపతితో సమాంతరంగా ఆయుర్వేద ఫార్మా కూడా అభివృద్ధి జరగాలి. ఈ రంగంలో అంతంత మాత్రంగానే ఉన్న రీసెర్చ్ అండ్ డవెలప్ మెంట్ ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. ప్రభుత్వాలూ ఆయుర్వేద రంగానికి పూర్తిగా కట్టుబడి ప్రణాళికాబద్ధంగా ప్రోత్సహించాలి.
ప్రకృతిపరమైన మూల పదార్ధాలతో
దేశీయంగా, తయారయ్యే మందులు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది సంప్రదాయంగా ఈ వైద్య పద్ధతిని తరతరాలుగా అనుసరిస్తున్నారు. మానవసేవ మాధవసేవగా రోగుల నుండి రూపాయి తీసుకోకుండా చికిత్స అందిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో ప్రజలు పూర్తి స్వస్థత, సంతృప్తి చెందుతున్నపుడు, ప్రామాణిక ఆయుర్వేద వైద్యం కూడా
మానవాళికి ఒక ఉపయుక్తమైన వైద్య విధానంగా ఇప్పటికైనా మనము గుర్తించాలి.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.