ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 7, 2022, 18 tweets

విజయ్ సారథి వడ్డి గారి వ్యాసం

ఈ చిత్రంలో కనిపించుతున్న వ్యక్తి డాక్టర్ #కేశవరావ్_బలీరాం_హెడగేవారు. #రాష్ట్రీయస్వయంసేవకసంఘ (#RSS) స్థాపకులు. ఇప్పటికి 97 సంవత్సరాల క్రితం విజయదశమినాడు సంఘాన్ని ప్రారంభించారు. ఆయన సంఘాన్ని ఎందుకు ప్రారంభించారో తెలుసా?

మనదేశం పరాయిపాలనలో ఉండటం

ఆయనకు చిన్ననాటినుండి భరించరానిదిగా ఉండేది. భారత సామ్రాజ్ఞి #విక్టోరియారాణి జన్మదినోత్సవం సందర్భంగా పాఠశాలలో పంచిపెట్టిన లడ్డూను తినకుండా విసిరి కొట్టాడు. ఆ రాణి మరణానంతరం ఇంగ్లాండు రాజైన #ఎడ్వర్డ్ పట్టాభిషేకం సందర్భంగా నాగపూర్లోని ఎంప్రెస్ మిల్లువారు తారాజువ్వలతో వెలుగుపూల

ప్రదర్శన ఏర్పరిచినదాన్ని పోయి చూద్దామని స్నేహితులు బలవంతపెట్టినా వెళ్లలేదు. ఆరువేల మైళ్ల దూరం నుండి కొన్నివేలమంది వ్యాపారం కోసంవచ్చి, ఇంతవిశాలమైన దేశాన్ని వశపరచుకొని, అధికారం చలాయించటమేమిటని మథనపడుతుండేవాడు.

ఆయన పెద్దవాడైన తర్వాత కూడా తన దగ్గరకు వచ్చిన విద్యార్థులకు ఒక ప్రశ్న

వేస్తుండేవారు. ప్రపంచంలో ఏడువింతలు అని మీ చరిత్రపుస్తకంలో ఉంటుంది. ఇవిగాక ఎనిమిదో వింత ఒకటి ఉంది, మీకు తెలుసా? అని. అలా మొదలుపెట్టి ఆంగ్లేయుల పాలనను పెకలించి పారవేయాల్సిందేనన్న భావాన్ని వారి మనస్సులలో నాటుతుండేవారు.

ఆనాటికి ఆంగ్లేయుల పాలనాకేంద్రంగా కోలకత్తా నగరం ఉండేది.

ఆంగ్లేయుల పాలనను తుద ముట్టించాలనే దీక్షతో పనిచేస్తున్న రహస్య సంస్థలు ఎన్నో అక్కడ ఉండేవి. వాటితో సమన్వయం ఏర్పరుచుకొనే దృష్టితో స్వాతంత్ర్య పిపాసులైన నాగపూర్ వాసులు కొందరు ఆర్థిక సహాయమందించి కొలకత్తాలోని జాతీయ వైద్య కళాశాలలో వైద్యవిద్య నభ్యసించేందుకు కేశవరావును పంపించారు.

కొలకత్తా చేరిన కేశవరావ్ #అనుశీలనసమితి అనే రహస్యవిప్లవ సంస్థలో సభ్యుడైనాడు. వివిధ కార్యకలాపాలలో పాల్గొని అనుభవం గడించాడు. ఎంతో శ్రమపడి, సాహసికులైన యువకులు రూపొందించిన ప్రణాళికలు పోలీసులకు చిక్కిన ఒకరిద్దరు అర్భకులు ఆ రహస్యాలను దాచలేక బయటకు కక్కితే మొత్తం ప్రణాళిక వ్యర్థమై పోతుండటం

ఆయనను ఎంతగానో బాధించేది.

వైద్యవిద్యలో పట్టా పొంది నాగపూర్ కి తిరిగి వచ్చిన తర్వాత కూడా తన బహుముఖ కార్యకలాపాలను కొనసాగించారు. #పాండురంగ_ఖాంఖోజేతో కలసి విప్లవ కార్యక్రమాల రచనలో నిమగ్నులైనారు. కాంగ్రెసు సంస్థలో చేరి సామాన్య ప్రజానీకాన్ని మేల్కొలిపి స్వాతంత్ర్యోన్ముఖులను చేసే కార్య

కలాపాలలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1920 డిశెంబరులో అఖిల భారత కాంగ్రెసు మహాసభలు నాగపూర్లో జరిగినపుడు ఆ సభల ఏర్పాట్లలో ప్రధాన పాత్ర ఆయనదేనని చెప్పవచ్చు. ప్రశంసాపత్రంగా ఆ పని నిర్వహించారు.

కాటోల్, భరత్ వాడ అనే పట్టణాల్లో జరిగిన సభల్లో ఆయన చేసిన ప్రసంగాలకు బెంబేలెత్తిపోయిన

ఆంగ్ల ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం నేరం మోపి కేసు నడిపించింది. తన దేశ ప్రజలను స్వాతంత్ర్యోన్ముఖులను చేస్తూ, తమదేశాన్ని తాము రక్షించుకొంటూ తామే పరిపాలించుకోవాలని, ఆంగ్లేయులవలె ఇతరుల భూములను కబళించటం తగదని తానుచెప్పిన మాట నిజమేనని వివరణాత్మకంగా ఇచ్చిన ఉపన్యాసం చిరస్మరణీయమైనది.

"రాజద్రోహకరమైన ఏ ఉపన్యాసానికి విచారిస్తున్నామో, దానికి మించి రాజద్రోహకరంగా ఉంది ఈ వాఙ్మూలం" అంటూ జడ్జి ఒక ఏడాది జైలుశిక్ష విధించాడు.

ఏడాది తర్వాత ఆయన విడుదలైన సందర్భంలో నాగపూర్ ప్రజానీకమంతా స్వాగతం పలికి సత్కరించారు. ఆంగ్లేయులను వెళ్లగొట్టడానికి ఏమార్గం అనుసరించినా సమ్మతమేనని

అన్ని ప్రయత్నాలను సూక్ష్మంగా అధ్యయనం చేసిన డా౹౹కేశవరావ్ #స్వాతంత్ర్య అనే పత్రికను కూడా నడిపారు. అంతకుముందు 1920-21లో జరిగిన ఖిలాఫత్ ఉద్యమం కూడా ఎంతో అనుభవాన్ని ఇచ్చింది. జైలుజీవితం మనదేశ చరిత్రను నెమరు వేసుకొని ఇప్పటి పరిస్థితులలో మన కర్తవ్యమేమిటో ఆలోచించుకొనే అవకాశమిచ్చింది.

ఇంతటి విస్తృత అనుభవాలు, లోతైన అధ్యయనముల లోంచి రూపుదిద్దుకొన్నదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్.

హిందువులు ఈ దేశంలో రాష్ట్రీయులు. వారిని మేల్కొల్పటం, వారిలోని అవగుణాలను వదిలించటం, సంస్కారాల నివ్వటం, సంఘటిత పరచటం ఈ దేశ ప్రగతికి అనివార్యం. ఎన్నో రంగాలలో ప్రగతిగాంచిన హిందువు, ఎన్నో

సద్గుణాలు కలిగియుండిన హిందువు దేశంకోసం జీవించాలని దేశ స్వాతంత్ర్యానికి, సంరక్షణకు తన జీవితంలో ప్రథమ ప్రాధాన్యమివ్వాలని గుర్తించి వ్యవహరించకపోవటమే మనలను బానిసతనంలోకి నెట్టివేసినదని గుర్తించారు. ఆంగ్లేయులను తరిమి కొట్టటం ఎంత అవసరమో, ఆతర్వాత లభించే స్వాతంత్ర్యాన్ని

నిలబెట్టుకొపడానికి, సద్వినియోగ పరుచుకొనడానికి శిక్షణ ఇవ్వటం అనివార్యమని ఆయన గ్రహించారు.

సాధారణ హిందువు అనుదిన జీవితంలో దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకుపోవాలనే ఆకాంక్షను ప్రవేశపెట్టి, రోజులో ఒకగంట ఈ విధమైన ఆలోచనలు చేసేవారిమధ్య గడపటంద్వారా తన జీవనశైలిని, ప్రవర్తననూ

తీర్చిదిద్దుకోవాలనే ఆలోచనను చిగురింపజేయాలి. అభ్యాసం లభింపజేయాలి. ఈ స్పష్టతతో దేశవ్యాప్తమైన హిందూ సంఘటనా కార్యమే మనం మరోసారి మరో విదేశీ శక్తికి లొంగిపోకుండా రక్షించుకోగల నిత్య జాగృత, నిత్య సంసిద్ధ శక్తిగా మనలను రూపొందించగలదని యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం ఆరంభించారు.

ఒకసారి ఈ

నిర్ణయానికి వచ్చిన తర్వాత వారు బహుముఖమైన తన కార్యకలాపాలన్నింటికీ స్వస్తి చెప్పి, ఆత్మ విస్మృతిని అంతంచేసి, భారతమాత సంతానమైన మనమంతా అన్నదమ్ములము ,మనం హిందూరాష్ట్రానికి అంగభూతులము అనే ఆత్మీయ భావాన్ని వ్యక్తపరిచే సంఘకార్యాన్ని సుదృఢం చేయడానికి అంకితమైనారు.

హిందూదేశానికి స్వాతంత్ర్యం ఇస్తున్నామని బ్రిటీష్ లేబర్ పార్టీ నాయకుడు, ప్రధానమంత్రి అయిన క్లెమెంట్ అట్లి ప్రకటించినపుడు, వారికి ఆ యోగ్యత లేదు, ఇండియా చీలికలు పీలికలు అయిపోతుందని ప్రతిపక్షనేత, మాజీ ప్రధానమంత్రి అయిన చర్చిల్ చేసిన హెచ్చరిక వాస్తవం కాలేదంటే దేశభక్తిభావాన్ని ప్రజలలో

మేల్కొల్పుతూ, ఉత్తమ సంస్కారాల నందిస్తూ, వ్యక్తినిర్మాణకార్యాన్ని, దేశవ్యాప్తమైన హిందూ సంఘటనా కార్యాన్నీ నిరంతరంగా నడిపించుతున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కర్తృత్వాన్ని అందుకు ప్రధాన కారణంగా చెప్పక తప్పదు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling