ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 7, 2022, 21 tweets

#నర్తనశాల

తన నట సామర్థ్యం మీద నమ్మకం ఉన్న నటుడు ఎలాంటి పాత్రని చేసి మెప్పించినా, ఇమేజితో సంబంధం లేకుండా అభిమానులు ఆదరిస్తారని య్యేళ్ళ క్రితమే నిరూపించిన తెలుగు నటుడు #నందమూరి_తారకరామారావు. అప్పటికే వందకి పైగా సినిమాల్లో నటించి, అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు మధ్యే మధ్యే జానపదాలు

ఇలా అది ఇది ఏమని అన్ని రకాల సినిమాలు చేస్తూ ఆంధ్రదేశాన్ని ఉపేస్తున్న వేళ, అటూ ఇటూ కాని #బృహన్నల పాత్ర పోషించడమంటే ఏ నటుడికైనా అదో పెద్ద సాహసమే..

పైగా ఆ పాత్రలో కనిపిచాల్సింది ఏ ఐదు పది నిమిషాలో కాదు, మూడుగంటల పాటు సాగే సినిమాలో దాదాపు రెండున్నర గంటల పాటు!! అయినప్పటికీ సాహసానికి

సై అన్నాడు #తారకరాముడు. ఫలితమే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన '#నర్తనశాల' అనే #విరాటపర్వం. మరో రెండేళ్లలో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి దర్శకుడు 'పౌరాణిక బ్రహ్మ' గా పేరుపొందిన #కమలాకర_కామేశ్వర రావు. కథ, మాటలు, పద్యాలతో పాటు కొన్ని పాటలని రాసింది సముద్రాల

సీనియర్ గా పిలవబడే #సముద్రాల_రాఘవాచార్యులు కాగా సుస్వరాలని అందించింది #సుసర్ల_దక్షిణామూర్తి,

ఈ సినిమాకి సాంకేతిక వర్గమంతా కలిపి ఒక స్థంభమైతే, అర్జునుడిగానూ, బృహన్నలగానూ నటించిన #ఎన్టీఆర్, సైరంద్రి పాత్రలో #సావిత్రి, కీచకుడిగా కనిపించిన #ఎస్వీరంగారావు మిగిలిన మూడు స్థంభాలూ

అనడానికి సందేహం లేదు.

కథ కొత్తదేమీ కాదు. అనాది కాలం నుంచీ, నిన్న మొన్నటివరకూ - అంటే కేబుల్ టీవీలో ప్రవేశించనంత వరకూ - వర్షాల కోసం పల్లెటూళ్ళ చెరువుగట్ల మీద భక్తితో చదివించిన #విరాటపర్వమే. మహాభారత కథ. అరణ్య వాసం పూర్తి చేసుకున్న పాండవులు ఒక ఏడాది అజ్ఞాత వాసం పూర్తి చేయడం కోసం

#విరాటరాజు కొలువులో మారువేషాల్లో చేరడం, గడువు పూర్తయ్యాక #ఉత్తర_గోగ్రహణంలో #కౌరవులపై విజయం సాధించి హస్తినకి తిరిగి వెళ్ళడం.

సినిమా ప్రారంభమే ఇంద్రసభకి అతిధిగా వెళ్ళిన అర్జునుడికి స్వాగతం పలుకుతూ ఆస్థాన నర్తకి #ఊర్వశి ' నరవరా..' పాట పాడుతూ చేసే మెరుపు నృత్యంతో.

అటుపై ఉర్వశి అర్జునుడిపై మనసు పడడం, మాతృ సమానురాలవంటూ అర్జునుడామెని తిరస్కరించడం, అవమానభారంతో ఉర్వశి పీడిగా జీవించమని #అర్జునుడికి శాపం ఇవ్వడం, ఇంతలో అక్కడికి వచ్చిన #ఇంద్రుడు ఆ శాపాన్ని అజ్ఞాతవాస కాలంలో వరంగా మార్చుకొమ్మని అర్జునుడికి సలహా ఇవ్వడం చకచకా సాగిపోతాయి.

#ధర్మరాజు #విరాటరాజు సలహాదారుగానూ, #భీముడు వంటవాడుగానూ, #నకుల #సహదేవులు గుర్రాల శాల, గోశాలల్లోనూ పనులకి కుదరగా, #ద్రౌపది అంత:పురంలో పూలమాలలల్లే #సైరంద్రిగా చేరుతుంది.

రాకుమారి #ఉత్తరకి నాట్యం నేర్చే గురువుగా #బృహన్నల అవతారం ఎత్తుతాడు అర్జునుడు. ఓపక్క పాండవుల అజ్ఞాతవాసాన్ని

భగ్నం చేసేందుకు కౌరవులు చేసే కుటిల యత్నాలు, వాటిని తిప్పి కొడుతూనే అజ్ఞాతంలో వచ్చే సమస్యలని #పాండవులు ఎదుర్కొంటూ ఉండగా ప్రవేశిస్తాడు #కీచకుడు, మహారాణి #సుధేష్ణ సోదరుడు. అత్యంత శక్తివంతుడు. తొలిచూపులోనే సైరంద్రిని మోహిస్తాడు. అంతే కాదు, సైరంద్రిని తన బసకి పంపకపోతే రాజ్యం

సర్వ నాశనం చేస్తానని సుధేష్ణని బెదిరిస్తాడు కూడా. మరోపక్క తన తండ్రులని వెతుకుతూ వచ్చిన అర్జునకుమారుడు #అభిమన్యుడు #ఉత్తరతో ప్రేమలో పడిపోతాడు. భీముడి చేతిలో కీచకుడు మరణించడం, ఇంతలోనే #సుశర్మ, #కౌరవులు దక్షిణ, ఉత్తర గోగ్రహణాలకి పాల్పడడం, పాండవుల అజ్ఞాతవాసం ముగియరావడం దాదాపు

ఒకేసారి జరుగుతాయి. యుద్ధం గెలిచి, విరాటరాజుకు తమ నిజరూప దర్శనం ఇచ్చి, #ఉత్తరాభిమన్యుల పెళ్ళి జరిపించడంతో 'శుభం' కార్డు పడుతుంది సినిమాకి.

తెలిసిన కథే అయినా, ఎన్ని సార్లు చూసినా, ఎప్పుడూ ఎక్కడా విసుగు రాకపోడానికి కారణం బలమైన స్కీన్ ప్లే, సంభాషణలు, నటీనటుల నటన

మరియు నిర్మాణ విలువలు. చిన్న చిన్న సంభాషణల ద్వారా జీవిత సత్యాలెన్నింటినో పలికించడం సముద్రాల వారికి పెన్నుతో పెట్టిన విద్య. ముందే చెప్పినట్టుగా ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి నువ్వా-నేనా అన్నట్టుగా నటించారు. ఎక్కడా 'అతి' పోకడలు కనిపించవు. ఆవిధంగా నటన రాబట్టుకున్న ఘనత

దర్శకుడు #కమలాకర_కామేశ్వరరావుదే.

మరీ ముఖ్యంగా ఎస్వీఆర్-సావిత్రి కాంబినేషన్ సన్నివేశాల్లో క్లిష్ట సమాసాలతో నిండిన డైలాగుల్ని ఎస్వీఆర్ #సమోసాలు తిన్నంత సులువుగా చెప్పేస్తుంటే, సావిత్రి కాబట్టి పోటీగా నిలబడింది అనిపించక మానదు.

జకార్తాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో

ఉత్తమనటుడు అవార్డు అందుకున్నారు ఎస్వీఆర్.

సైరంద్రికి పెద్దగా డైలాగులు లేవు. సావిత్రిని ఆ పాత్రకి అనుకున్నాక, ఇక డైలాగులు అనవసరం అనుకుని ఉంటారు. "ప్రభువుల వెంటే నేనూ" అని చెప్పేటప్పుడు ఆత్మాభిమానం, అర్జునుడిని బృహన్నలగా చూసినప్పుడు ఆశ్చర్యం, "జననీ శివ కామినీ" అని పాడేటప్పుడు ఆరి,

కీచకుడి చేతిలో అవమానానికి గురైనప్పుడు ఆవేశం, ఆక్రోశం ఇవన్నీ కనుపాప కదలికలతో అభినయించింది సావిత్రి, బృహన్నల పాత్ర మీద ఏ ఇతర పాత్రల ప్రభావాన్నీ పడనివ్వలేదు #ఎన్టీఆర్. కేవలం ఈ పాత్ర పోషణ కోసమే శాస్త్రీయనృత్యాన్ని నేర్చుకున్న కమిట్మెంట్ ని అభినందించి తీరాలి. అభిమన్యుడిగా శోభన్ బాబు,

కృష్ణుడిగా కాంతారావు చిన్న పాత్రల్లో మెరిశారు. శోభన్ లో కనిపించే కొద్దిపాటి బెరుకుని సులువుగానే పట్టుకోవచ్చు.

దాదాపు అన్ని పాటలూ ఇవాల్టికీ జనం నాలుకల మీద ఆడేవే కావడం 'నర్తనశాల' కి సంబంధించిన మరో విశేషం. 'నరవరా..' వినగానే జానకి గుర్తొచ్చి తీరుతుంది. ఈ సినిమా పేరు చెప్పగానే

అప్రయత్నంగానే గుర్తొచ్చేసే పాట 'సలలిత రాగ సుధారస సారం..' #మంగళంపల్లి వారిచేత పాడించడం సరైన ఎంపిక.

'జననీ శివకామినీ... 'సఖియా వివరింపవే..' 'దరికి రాబోకు రాజా' ఈ మూడూ #సుశీల మార్కు పాటలు. దేనికదే ప్రత్యేకం.

ఇక డ్యూయెట్ ఎలా ఉండాలో చెప్పే పాట "ఎవ్వరికోసం ఈ మందహాసం.." ఉత్తరకుమారుడిని హాస్యానికి వాడుకున్నారు. '#మాయాబజార్' ఛాయలు పడని విధంగా ఈ పాత్రని పోషించారు రేలంగి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కాంబినేషన్ సన్నివేశాల్లో రేలంగి నటన మర్చిపోలేం.

భీముడిగా నటించిన #దండమూడి_రాజగోపాల్

నిజజీవితంలోనూ మల్లయోదుడే! #ధూళిపాల దుర్యోధనుడు కాగా, #కైకాల దుశ్శాసనుడు, #ప్రభాకర_రెడ్డి కర్ణుడు. వీళ్ళందరివీ అతిధి పాత్రలే. 1964 సంవత్సరానికి గానూ జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డుని అందుకున్న 'నర్తనశాల' ని రంగుల్లోకి మారుస్తారన్న వార్తలు వచ్చాయి.

రంగుల 'మాయాబజార్' విడుదలైన సమయంలో. ఇప్పటివరకూ అందుకు సంబంధించిన వివరాలేవీ లేవు.

స్కీన్ ప్లే, మాటలు, సంగీతం, మరీ ముఖ్యంగా నటన ఎలా ఉండాలో చెప్పే రిఫరెన్స్ సినిమాల్లో

ఒకటైన 'నర్తనశాల' ని మళ్ళీ చూసైనా, "ఫ్యాన్స్ ఒప్పుకోరు" లాంటి శషభిషలు విడిచిపెట్టి ఇప్పటి కథానాయకులు వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటే బాగుండును..

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling