లక్ష్మి Profile picture
13-07-1971

Oct 12, 2022, 14 tweets

#అట్లతద్దె
ఇవాళ  అట్లతద్దె /చంద్రోదయ ఉమా వ్రతం 13-10-2022.
ఆశ్వీయుజ బహుళ తదియ నాడు ఈ పండగ జరుపుకుంటాం.ఇది కూడా ఉండ్రాళ్ళతద్దె లాగానే ఉంటుంది దాదాపు. నివేదన,వాయనదానాల్లో అట్లు(దోసెలు కాదు😃)ఇస్తారు.

ఈ నోము ఆడపిల్లలు(పెళ్లి కాని వారూ, పెళ్ళైన వారు)నోచుకుని 3,5,7 ఇలా బేసి సంఖ్య గల

ఏడాది ఉద్యాపన చెయ్యాలి.
ముందు రోజు సాయంత్రం గోరింటాకు రుబ్బి చేతులకి,కాళ్ళకి పెట్టుకోవాలి.
ఒక వెడల్పాటి ప్లేటులో  గోరింటాకు ముద్ద వేసి నీళ్లు కలిపి రెండు పాదాలు సగం వరకు  దాన్లో మునిగేలా ఉంచి,
కొంత సేపు అయ్యాక తీస్తే చక్కగా పాదాలు,వేళ్ళు,అరికాలు మొత్తం పండుతుంది ఎర్రగా...

వీటినే "సిరిపాదాలు"/"లక్ష్మీ పాదాలు" అంటారు.ఈ మాసం కూడా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి,గోరింటాకు పెట్టుకుంటే నీళ్ళల్లో తడవడం వల్ల వచ్చే ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
గోరింటాకు బహిష్టు సంబంధిత దోషాలు (irregular periods)   పోగొడుతుంది.

అట్లతద్దికి ముందురోజును "భోగి" అంటారు
విదియ నాడు వాయనం తీసుకొనే ముత్తైదువులకు సున్నిపిండి,కుంకుడుకాయలు,నువ్వుల నూనె,పసుపు,కుంకుమ ఇచ్చి మర్నాడు తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాలి.
తదియ నాటి తెల్లవారుజామున తలంటు పోసుకుని చద్ది అన్నంలో పొట్లకాయ కూర,గోంగూర పచ్చడి,నువ్వుపొడి,పెరుగు

వేసుకుని భోంచేసి,సాయంకాలం వరకు ఏమి తినకూడదు.
పొట్లకాయ శరీరాన్ని డీటాక్సీఫీకేషన్ చేస్తుంది.ఇది చలికాలం మొదలయ్యే రోజులు కాబట్టి నువ్వులు, గోంగూర తినడం వల్ల శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రత అందిస్తుంది.
సాధారణంగా పెళ్లి కాని వాళ్ళు తాంబూలం వేసుకోరు.కానీ ఈ ఒక్క రోజు మాత్రం వేసుకోవచ్చు.

తాంబూలం సౌభాగ్య చిహ్నం.అమ్మవారి "తాంబూలపిడచ" తిని పుట్టుమూగవాడు ఐన "మూకశంకరుడు" అమ్మవారి మీద ఆశువుగా ఐదు శతకాలు(మూకపంచశతీ) చెప్పిన గురించి తెలుసు కదా మనకి🙏
అసలు ఇంటికి వచ్చిన వారికి పండూ తాంబూలం ఇచ్చి గౌరవించడం మన సంప్రదాయం.

ఇక అట్ల  ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
పూర్వం మినపప్పు మాత్రం రోట్లో కాటుకలాగా రుబ్బి,అందులో నానపెట్టి రోట్లో దంచిన బియ్యపిండి కలిపి వేసేవారు అట్లు.ఇవి తెల్లగా,మెత్తగా,దూదుల్లాగా చూడటానికి చంద్రబింబంలాగా
ఉండేవి.ఇప్పట్లగా రోష్టు, డబల్
రోష్టు చేసి ఎర్రగా ఉండేవి కావు😃.

నువ్వుల నూనె వేసి చేసేవారు ఆ అట్లని.నువ్వులనూనె ఎముకపుష్టి ఇస్తుంది.అట్లతో అనుపానంగా "తిమ్మనం"వండుతారు.సాధారణంగా అన్యోన్య దాంపత్యానికి కారకుడు,మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు చంద్రుడు.
వీర్యపుష్టి,సంతాన కారకుడు రాహువు.స్త్రీలు మంచి భర్త కోసం,మంచి సంతానం కోసం, చేసే ఈ నోములో

వారివురికి సంబంధించిన( చంద్రుడికి బియ్యము,రాహుగ్రహానికి మినుములు)వస్తువులతో చేసిన ఆహారాన్ని(అట్లు) నైవేద్యంగా అర్పించడం అనేది
ఆయా గ్రహదోషాలు ఏమైనా ఉంటే పోవడానికే.అలాగే నవగ్రహాలలో "కుజుడికి"అట్లు అంటే ప్రీతి అని శాస్త్ర వచనం. వివాహానికి అడ్డంకిగా భావించే "కుజదోష"పరిహారానికి గాను,

అలాగే ఋతుచక్రం 
సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు.
ఈ రోజు చెయ్యవలసిన మరో ముఖ్యమైన పని.బాగా ఆటలు ఆడి, ఉయ్యాల ఊగడం.వీటి ద్వారా శరీరానికి అవసరమైన ఎక్సర్సైజు దొరుకుతుంది.పొట్ట,నడుము,చేతులు,కాళ్లు దగ్గర ఉండే నరాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.ఊపిరి బిగపట్టి ఊగుతారు

కబట్టి breathing exercise కూడా అవుతుంది.
సాయంత్రం చంద్రోదయమయ్యాక గణపతి ని,గౌరీ దేవిని,పూజించి,11మంది ముత్తైదువులకు నల్లపూసలు,లక్కజోళ్ళు,రవిక గుడ్డలు,పసుపుకుంకుమలు,దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. ఒక్కొక్కరికి 11 చొప్పున అట్లు పోసి,ఒక దొంతరగా పేర్చి,దాని

మీద చిన్న బెల్లం ముక్క పెట్టి,ఆవునేతి చుక్క వేసి వాయనమివ్వడం ఈ నోము ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు నలుగురితో,తెలియని వాళ్ళకి తెలియచెప్పడమే ముఖ్యఉద్దేశం. 
మరో 11 అట్లు గౌరీ దేవికి నైవేద్యంగా పెట్టి నోము చేసిన వాళ్ళు,కుటుంబసభ్యులు ప్రసాదంగా తీసుకోవాలి.
వివాహానికి,గర్భధారణకి

అడ్డుగా ఉన్న దోషాల్ని ఆహారం,వ్యాయామం,దైవభక్తి ద్వారా తొలగించి ,స్త్రీలకు మాతృత్వపు వరాన్ని ఇస్తుంది అట్లతద్దె పండుగ.

భాద్రపద మాసంలో చేసే "ఉండ్రాళ్ళతద్దె"....తరువాతి మాసం ఐన ఆశ్వీయుజ మాసం లో చేసే "అట్లతద్దె"...ఆచరించే  విధానం ఒకేలా ఉన్నా...రోజుల తేడాతో మళ్ళీ చెయ్యడం ఎందుకు అంటే,

ఇప్పుడు మనం తీసుకున్న covid వాక్సిన్ "సెకండ్ డోస్" లాగా అన్నమాట😃.

అందరికీ అట్లతద్దె శుభాకాంక్షలు.💐💐
గౌరీ అనుగ్రహ ప్రాప్తిరస్తు.🙏
【అ ల సు】

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling