ఇది ద్వాపరయుగంలో ప్రారంభమైన పూజ. అంతకు ముందు ఈ పూజను #ఇంద్రయాగం అనేవారు. కార్తీకమాస ఆరంభంలో ఈపూజ నిర్వహిస్తారు. ఈ పూజకు ఆరాధ్యదైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు.వర్షకారకుడు.వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి.అందుకే ఈ పండుగ రోజు
Oct 25, 2022 • 11 tweets • 5 min read
#కార్తీక_మాసం #Dos_Donts.
ఈ సంవత్సరం 26-10-2022 నుంచి 23-11-2022 వరకూ కార్తీక మాసం.
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు;
గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
🕉అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
#కార్తీకమాసం_ముఖ్యమైన_రోజులు
26-10-2022 ఆకాశదీపం ప్రారంభం.(శుద్ధపాడ్యమి)
27-10-2022 భాతృవిదియ/యమ ద్వితీయ/భగినీ హస్త భోజనం (సోదరి ఇంట్లో భోజనం చెయ్యాలి)
28-10-2022 సోదరీ తృతీయ(సోదరికి బహుమతులు ఇవ్వడం)
29-10-2022 నాగులచవితి (పుట్టలో పాలు పొయ్యడం,నాగేంద్రుడికి పూజ,ఒక పూట ఉపవాసం,పొట్లకాయ కత్తి, చాకు లాంటివి వాడటం నిషిద్ధం,నువ్వులతో,చలిమిడితో నైవేద్యం)
31-10-2022 కార్తీక సోమవారం
1-11-2022 గోష్ఠాష్టమి (గో పూజ)
4-11-2022 ఉత్థాన/బోధన ఏకాదశి.(విష్ణు పూజ,ఉపవాసం)
Oct 13, 2022 • 5 tweets • 1 min read
1st Answer
#భాగవతం_అష్టమ_స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది అండీ.(అందుకే పురాణాలు చదవాలి, అది మన కర్తవ్యం. ఋషి ఋణం అని ఒకటి ఉంటుంది అది తీరాలి అంటే వారు రాసినవి చదివి అర్థం చేసుకుంటేనే తీరుతుంది..రామాయణం భారతం,భాగవతం,భగవద్గీత లో లేని విషయం ఇంకేం లేదు ఈ ప్రపంచంలో..మీరు
కూడా ఆ పుస్తకాలు చదివితే అన్ని సందేహాలకీ సమాధానం లభిస్తుంది 🙏🙏)
నవమ స్కంధంలో వైవస్వత మనువు వంశవృత్తాంతం ఉంది.ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన "వైవస్వత మన్వంతరము"లో27 మహాయుగాలు ఐపోయి,28వ మహాయుగంలో కృత,త్రేతా,ద్వాపరయుగాలు ఐపోయి,కలియుగములో ఉన్నాము.ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు
Oct 12, 2022 • 9 tweets • 2 min read
#యుగం_మన్వంతరం_కల్పం.
కృత యుగం-17,28,000 సంవత్సరాలు.
త్రేతాయుగం-12,96,000 సంవత్సరాలు.
ద్వాపరయుగం-8,64,000 సంవత్సరాలు.
కలియుగం- 4,32,000 సంవత్సరాలు.
కలియుగం 5,123 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుతం 2022 (ఇది క్రీస్తుశకం లెక్కల ప్రకారం!!) సంవత్సరానికి ఇంకా 4,26,877 సంవత్సరాలు మిగిలివుంది.428,899లో అంతమవుతుంది.
3101 +present year =కలియుగం ప్రారంభం అయ్యింది.ఇదే శ్రీకృష్ణ నిర్యాణం చెందిన సంవత్సరం కూడా!!
Oct 12, 2022 • 14 tweets • 4 min read
#అట్లతద్దె
ఇవాళ అట్లతద్దె /చంద్రోదయ ఉమా వ్రతం 13-10-2022.
ఆశ్వీయుజ బహుళ తదియ నాడు ఈ పండగ జరుపుకుంటాం.ఇది కూడా ఉండ్రాళ్ళతద్దె లాగానే ఉంటుంది దాదాపు. నివేదన,వాయనదానాల్లో అట్లు(దోసెలు కాదు😃)ఇస్తారు.
ఈ నోము ఆడపిల్లలు(పెళ్లి కాని వారూ, పెళ్ళైన వారు)నోచుకుని 3,5,7 ఇలా బేసి సంఖ్య గల
ఏడాది ఉద్యాపన చెయ్యాలి.
ముందు రోజు సాయంత్రం గోరింటాకు రుబ్బి చేతులకి,కాళ్ళకి పెట్టుకోవాలి.
ఒక వెడల్పాటి ప్లేటులో గోరింటాకు ముద్ద వేసి నీళ్లు కలిపి రెండు పాదాలు సగం వరకు దాన్లో మునిగేలా ఉంచి,
కొంత సేపు అయ్యాక తీస్తే చక్కగా పాదాలు,వేళ్ళు,అరికాలు మొత్తం పండుతుంది ఎర్రగా...
శరదృతువు,ఆశ్వీయుజ మాసం మొదటి తొమ్మిది రోజులని "దేవీ నవరాత్రులు"గా జరుపుకుంటాం.
ఇది వర్షాకాలం,చలికాలంకి మధ్యలో వచ్చే సంధికాలం.వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే రోజులు.
యమధర్మరాజు దంష్ట్రలు(కోరలు) సంవత్సరంలో రెండు సార్లు బైట పెడతాడట!అందువల్ల
ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయి.కానీ ఆ బాధలు లేకుండా చెయ్యడానికి ప్రకృతిలో దొరికే ఆహారాన్నే ఔషధంగా ఉపయోగించవచ్చు.
ఉగాది సమయంలో,ఎండాకాలం మొదలయ్యే ముందు ఒకసారి,మళ్ళీ దసరా సమయంలో రెండో సారి ఇలా జరుగుతుంది.
వాటికి నివారణగా ప్రకృతి ఇచ్చిన ఓషధాలే -వేపపువ్వు &ఉసిరికాయలు.వీటిని ఆయా
#లలితాసహస్రనామాల్లో అమ్మవారికి ఇష్టమైన పదార్థాల గురించిన నామాలు ఉన్నాయి..వాటిని పెట్టడం అన్నిటి కంటే శ్రేష్ఠదాయకం
1.పాయసాన్నప్రియా(పాలతో చేసిన పాయసం)
2.స్నిగ్ధౌదనప్రియా(నెయ్యి వేసిన అన్నం,బెల్లంముక్క)
3.గుడాన్నప్రీతమానసా(బెల్లంతో చేసిన అన్నం-పరవాణ్ణం.
4.దద్యన్నాసక్తహృదయా(పెరుగు అన్నం(దద్ధోజనం)
5.ముద్గౌదనాసక్తచిత్తా(పెసరపప్పుతో కలిపి వండిన అన్నం-పులగం/కట్టె పొంగలి.
6.హరిద్రాన్నైకరసికా(పసుపుపచ్చని అన్నం-పులిహోర(చింతపండు,నిమ్మకాయ,దబ్బకాయ,నారింజకాయ,ఉసిరికాయ,మామిడికాయ.
Sep 24, 2022 • 7 tweets • 1 min read
మంచి ప్రశ్న అడిగారు రవిగారూ...
మనం ఇంట్లో శ్రాద్దం పెట్టడానికి వీలు పడనప్పుడు కదా #స్వయంపాకం(భోజనానికి అవసరమైన పదార్థాలు-బియ్యం,పప్పుదినుసులు,ఉప్పు, కూరగాయలు, నెయ్యి,నూనె వంటివి )ఇస్తాము.
శ్రాద్దం పెట్టినప్పుడు కూడా ఇద్దరు బ్రాహ్మణులకి భోజనం పెడతారు -ఒకళ్ళు మన పితృదేవతల స్వరూపం,
ఇంకొకరు విష్ణుమూర్తి స్వరూపం గా భావించి.వారు ఇద్దరూ సంతృప్తిగా భోజనం చేసి,మన వంశం అభివృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇస్తారు.
స్వయంపాకం ఇచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది indirect గా!!తీసుకున్న బ్రాహ్మణుడు, వంట చేసిన ఆయన భార్య, పిల్లలు కూడా తృప్తిగా భోజనం చేస్తారు ఆ పూట మీరు ఇచ్చిన
Sep 24, 2022 • 11 tweets • 3 min read
మీరు చెప్పింది కరెక్టే కల్యాణి గారూ,శ్రావణ మాసం చివర్లో వచ్చే అమావాస్యని #పోలాల_అమావాస్య అంటారు.నిజానికి అది #పొలాల_అమావాస్య !!
శ్రావణ భాద్రపద మాసాలు వర్షఋతువు కదా..అందుకే ఆ రోజు ఇంట్లో కంద పిలక కి పూజ చేసి,తీసుకువెళ్ళి పొలాల్లో నాటుతారు.కందే ఎందుకు అంటే ఒక్క కంద దుంప పైన ఎన్ని
కణుపులు ఉంటాయో అన్ని పిలకలు వేసి,అన్ని మొక్కలు వచ్చి మళ్ళీ అన్ని దుంపలుగా పంట పండుతుంది. మనకి ఏరువాక పౌర్ణమి రోజు దుక్కి దున్ని పొలం నాట్లు వెయ్యడానికి సిద్ధం చేసాక అన్ని రకాల #విత్తనాలు,#నారు లాంటివి నాటుతారు. దుంపకూరలు ఐన కంద,చేమదుంపలు, అల్లం,ఆలూ, ముల్లంగి లాంటివి నాటాలంటే భూమి
Sep 4, 2022 • 4 tweets • 1 min read
ఒకసారి అమెరికాలోని సబ్బులు ఫ్యాక్టరీలో ఒక పొరపాటు జరిగింది.
కవర్ ప్యాక్ అయింది కాని అందులో సబ్బు లేదు.
డీలర్లు, కస్టమర్లు గొడవతో పెద్ద గోలయింది. దానితో ఆ కంపెనీ యాజమాన్యం కంపెనీలో ఇంకెప్పుడూ ఇలాంటి సమస్యతో పరువు పోకూడదని జాగ్రత కోసం “ఆరు”కోట్లు ఖర్చు పెట్టి ఎక్సరే మిషన్
కొన్నారు.ప్యాకైన సబ్బులు లైన్ మీద వెళ్తుంటే అందులో సబ్బు ఉన్నదీ, లేనిదీ ఆ మిషన్ ద్వారా తెలుసు కుంటున్నారు. ఈ విషయం విన్న మన తెలుగోడు హైదరాబాద్లో సబ్బుల కంపెనీ వాడు,అలాంటి సమస్య రాకూడదని 3 వేలు పెట్టి పెడెస్టల్ ఫ్యాన్ కొని లైన్ మీద వెళ్తోన్న సబ్బుల వైపు ఫుల్ స్పీడ్ తో పెట్టాడు
Sep 4, 2022 • 8 tweets • 4 min read
#గడ్డికి#గరిక కీ చాలా తేడా ఉందండీ.
గరిక పొడవుగా,రెండు పక్కలా చాలా పదునుగా (rajor sharpness)ఉంటుంది.
గడ్డి పొట్టిగా, మెత్తగా ఉంటుంది.
మొదటి చిత్రం గరిక,రెండోది గడ్డి
పచ్చి గరిక ని ఎండపెడితే పవిత్రమైన దర్భలు గా తయారవుతాయి.వాటికి అప్పుడు పూజల్లో వాడే #అర్హత,#పవిత్రత వస్తుంది.గరుత్మంతుడు అమృతం తెచ్చి గరిక మీద ఉంచాడు.. #పవిత్రత పోకుండా ఉండేలా...పాములు ఆత్రంగా ఆ పాత్ర ని కదిలిస్తే అమృతం గరిక మీద ఒలికి పోవడం,దానిని నాకిన పాముల నాలుక రెండు గా
Sep 4, 2022 • 12 tweets • 4 min read
ఇవాళ #రాధాష్టమి(#భాద్రపద_శుద్ధ_అష్టమి)
రాధాదేవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
🕉రాధాదేవి అమ్మవారి 5
పూర్ణబ్రహ్మస్వరూపాల్లో ఒకళ్ళు.(దుర్గ-లక్ష్మీ-సరస్వతి-గాయత్రి-రాధ)
🕉ఈ 5 స్వరూపాలు మనలో ఉండే 5శక్తులకి ప్రతిరూపాలు(ఇచ్చాశక్తి, ఐశ్వర్యశక్తి,జ్ఞానశక్తి,వేదశక్తి, ఆనందశక్తి)
🕉బృందావనం లో నంద,యశోదాదేవి పుత్రుడుగా
శ్రీకృష్ణుడు శ్రావణ బహుళాష్టమి రోజు జన్మించాడు.
🕉బృందావనం లోనే, వృషభానుడు & కళావతి అనే దంపతులకు రాధాదేవి భాద్రపద శుక్ల అష్టమి రోజు జన్మించింది.
🕉వృషభానుడు,కళావతి పితృదేవతల లోకానికి చెందినవాళ్ళు పూర్వ జన్మలో.
మొన్న వినాయక చవితికి పాలవెల్లికి కట్టిన వెలగపండు చూస్తే ఎప్పుడో చదివిన/విన్న విషయం ఒకటి గుర్తు వచ్చింది.
"కరి మింగిన వెలగపండు" అనే మాట మీరందరూ వినే ఉంటారు.ఏనుగుకి వెలగపండు ఇస్తే గుటుక్కున మింగేస్తుంది...మర్నాడు మళ్ళీ వెలగపండు ఎలా ఉందో అలాగే
విసర్జిస్తుంది..కానీ లోపల గుజ్జు మాత్రం స్వాహా చేస్తుందిట.దానికి గొప్ప జీర్ణశక్తి ఉందిట.ఇలాంటి వివరణ కూడా వినే ఉంటారు.
కానీ ఈ మాట ఏ మాత్రం నిజం కాదు!!#కరి అనే శబ్దానికి ఉన్న నానార్థాలు ఈ పుకారుకి కారణం.
కరి అంటే నిదర్శనం,హద్దు, నియమం,లక్ష్యం,సాక్షి, ఏనుగు, నల్లటి,పురుగు...
పూజకి కావల్సినవి అన్నీ తయారుగా ఉంచుకుంటే, పూజ మధ్యలో లేవకుండా, హడావుడి పడకుండా, ప్రశాంతంగా చేసుకోవచ్చు.
1.పసుపు
2.కుంకుమ
3.పసుపు గణపతి
4.మట్టి గణపతి
5.బియ్యం పిండి(ముగ్గు వెయ్యడానికి,పాలవెల్లి అలంకరించడానికి)
6.అక్షతలు(కొంత పసుపుతో;కొంత కుంకుమతో కలిపినవి)
7.పంచపాత్ర
8.ఉద్దరిణ
9.కలశం కి చెంబు/గ్లాసు
10.అగరువత్తులు
11.కర్పూరం
12.ఏకహారతి
13.కొబ్బరికాయలు
14.పళ్ళు
15.విడి పువ్వులు
16.పూలమాల
Aug 26, 2022 • 14 tweets • 3 min read
#పితృపక్షాలు
విజ్ఞప్తి:: 1. పోస్ట్ పూర్తిగా చదివి, దేశ, విదేశాల్లో
నివసించే మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయడం ద్వారా హిందూధర్మాన్ని
కాపాడండి. శ్రాద్ధకర్మల ఆవశ్యకత
గ్రహించి పూర్వీకులకు నివాళులు
అర్పించేందుకు మీవంతు కృషి చేయండి. 2. ప్రస్తుత సంవత్సరంలో అనగా శ్రీ శుభకృత్
నామ సం.లో భాద్రపద బహుళ
పాడ్యమి ది 10-09-22
నుండి బహుళ అమావాస్య
ది 25-09-22 వరకు పితృపక్షం.
3.. వారణాశి నందు సత్రములు మరియు
ఆశ్రమము వివరములు ఇచ్చుచున్నాము.
మనం పూజించే దేవుడు/దేవత ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండటం వల్ల ఆ దేవుడి/దేవతా రూపం మనకి స్పష్టంగా గోచరిస్తే (మానసికంగా)..అది #సారూప్యముక్తి.(EX:కంచి పరమాచార్య కి కామాక్షి అమ్మ వారు,
రామకృష్ణ పరమహంస & తెనాలి రామలింగడి కి కాళికాదేవి ని కళ్ళు మూసుకుని ధ్యానంలో చూడగలిగారు!!)
ఇంటి ముందర, గడప మీద,గేటు బయట ముగ్గులు పెడితే ఆ ఇంట దుష్టశక్తులు ప్రవేశించకుండా,ఇంట్లో ఉన్న లక్ష్మి బైటికి వెళ్ళకుండా కాపాడతాయి.
ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండు అడ్డగీతలు వేస్తే ఆ ఇంట మంగళకరమైన పనులు జరుగుతున్నాయి అని అర్దం.
నక్షత్రం ఆకారంలో వేసిన ముగ్గు భూతప్రేతపిశాచాలని ఆ ఇంటి దరిదాపులకు కూడా రాకుండా చేస్తుంది.
సాధారణంగా మనం వేసే ముగ్గుల్లో పద్మాలు శుభసూచకం.అందుకే ఏ ముగ్గునీ తొక్కకూడదు.అలాగే ఒట్టి ముగ్గు వేసి వదిలెయ్యకూడదు, దాని మీద కొంచెం పసుపు/కుంకుమ/పువ్వులు వెయ్యాలి.
విష్ణుసహస్రనామం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్తుంటే ధర్మరాజాదులు విన్నారు, కానీ ఎవరూ రాసుకోలేదు. మరి అది ఎలా ప్రచారం పొంది మన వరకూ వచ్చింది??
ఈ ప్రశ్నకు సమాధానం కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఇలా చెప్పారు.
భీష్ముడు చెపుతున్నప్పుడు పాండవులు, వ్యాసమహర్షి అందరూ శ్రద్ధగా విన్నారు.కానీ ఎవరూ రాయలేదు.అప్పుడు ధర్మరాజు అడిగాడు శ్రీ కృష్ణుడ్ని "ఈ నామాలు మేమందరమూ విన్నాము.కానీ మళ్ళీ పారాయణ చెయ్యాలంటే ఎలా??ఏం చెయ్యాలి" అని.