ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 15, 2022, 10 tweets

#నెమలి_పట్టాభి_రామారావు.. ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈయన.. దేశ స్వాతంత్ర్యం కోసం తనవంతు పోరాటం చేశారు. స్వాతంత్ర్యంపై ప్రజల్లో చైతన్యం నింపి.. ఆ దిశగా అందరినీ పయనమయ్యేలా చేశారు. అంతేకాదు.. ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు పని కల్పించారు.

ప్రజాసేవలో చురుకుగా పాల్గొన్నారు. తన సొంత ఖర్చులతోనే గ్రామాలను పర్యటించి, సామాన్య ప్రజల ఉద్ధరణకు సలహాలు సూచిస్తుండేవారు. ప్రత్యేక ఆంద్రరాష్ట్రం ఏర్పాటుకు మద్దతు పలికారు.

#జీవిత_విశేషాలు :

1862లో కడప జిల్లా సిద్ధవటంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో పట్టాభి రామారావు జన్మించారు.

ఈయన కడప ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. 1882లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ డిగ్రీతో పట్టభద్రుడై మదనపల్లెలోని సబ్‌కలెక్టరు కార్యాలయంలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. అక్కడ తన ప్రతిభను ప్రదర్శిస్తూ,

తనకంటూ ప్రత్యేక స్థానాన్ని చూరగొన్న ఈయన.. 1895లో అసిస్టెంట్ కమీషనర్ స్థాయికి చేరుకున్నారు. తదనంతరం డిప్యుటీ కమీనషరుగానూ పదవోన్నతి పొందారు. కొచ్చిన్ సంస్థానంలో రెవిన్యూ సెటిల్‌మెంట్ వ్యవస్థను సంస్కరించేందుకు.. ఆ విషయాలలో అనుభవమున్న పట్టాభి రామారావును ప్రభుత్వం కొచ్చిన్

సంస్థానానికి దీవాన్‌గా నియమించింది. 1902 నుండి 1907 వరకు దీవాన్ గా పనిచేసిన రామావు, రెవిన్యూ సెటిల్‌మెంటును పూర్తిచేసి భూమి దస్తావేజులను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలను ప్రవేశపెట్టారు. 1908లో ఉద్యోగ జీవితం నుండి విరమించారు.

#ప్రజాసేవలో_రామారవు_పాత్ర :

పట్టాభి రామారావు పదవీ

విరమణ చేసిన తర్వాత మద్రాసులోని పూనమల్లి హై-రోడ్డుపై ‘శ్రీరామ బ్రిక్ వర్క్స్’ అనే ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు పనికల్పించారు. తన సొంత వ్యాపార నిర్వహణతో పాటు ఆదోనిలోని వెస్ట్రన్ కాటన్ కంపెనీ, ఉన్నిదారం ఎగుమతిచేసే మద్రాసు యార్న్ కంపెనీల నిర్వహణలో పాల్పంచుకోనేవారు.

తెలుగు అకాడమీ, భారతీయ అధికారుల సంఘం, కేంద్ర వ్యవసాయ కమిటీల కార్యదర్శిగా ప్రజాసేవలో చురుకుగా పాల్గొనేవారు. చివరకు మదనపల్లెలో స్థిరపడి సబ్ డివిజన్ సంఘానికి అధ్యక్షత వహించి, వాటి కార్యక్రమాలకు పూర్తి సమయాన్ని కేటాయించారు. సొంత ఖర్చులతో గ్రామాలను పర్యటించి, సామాన్య ప్రజల ఉద్ధరణకు

సలహాలు సూచనలిచ్చారు. తొలుత ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఉత్సుకత చూపించకపోయినా, ఆ తర్వాత మనసు మార్చుకొని అందుకు మద్దతునిచ్చారు. ఈయన 1918లో కడపలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు. వృద్ధాప్యకారాణాలవల్ల 1937 అక్టోబరు 15న మద్రాసులో తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

#స్వాతంత్ర్యోద్యమంలో_పాత్ర :

ఆనాడు బ్రిటీష్ అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆయా ఉద్యమాల్లో ఈయన కూడా పాల్గొన్నారు. స్వాతంత్ర్యంపై ప్రజల్లో చైతన్యం నింపి, ఆ దిశగా పావులు కదిపేలా కృషి చేశారు. తెల్లదొరలను భారతదేశం నుంచి తరిమి కొడితేనే తాము స్వాతంత్ర్యంగా

జీవించగలమని, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా వుండాలని, ప్రతిఒక్కరు స్వాతంత్ర్యం కోసం పోరాడాలంటూ పిలుపునిచ్చారు. ఈయన ప్రసంగానికి ఎంతోమంది ఉత్తేజితులై.. స్వాతంత్ర్య పోరాటాల్లో పాలుపంచుకున్నారు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling