#నెమలి_పట్టాభి_రామారావు.. ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈయన.. దేశ స్వాతంత్ర్యం కోసం తనవంతు పోరాటం చేశారు. స్వాతంత్ర్యంపై ప్రజల్లో చైతన్యం నింపి.. ఆ దిశగా అందరినీ పయనమయ్యేలా చేశారు. అంతేకాదు.. ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు పని కల్పించారు.
ప్రజాసేవలో చురుకుగా పాల్గొన్నారు. తన సొంత ఖర్చులతోనే గ్రామాలను పర్యటించి, సామాన్య ప్రజల ఉద్ధరణకు సలహాలు సూచిస్తుండేవారు. ప్రత్యేక ఆంద్రరాష్ట్రం ఏర్పాటుకు మద్దతు పలికారు.
1862లో కడప జిల్లా సిద్ధవటంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో పట్టాభి రామారావు జన్మించారు.
ఈయన కడప ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. 1882లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ డిగ్రీతో పట్టభద్రుడై మదనపల్లెలోని సబ్‌కలెక్టరు కార్యాలయంలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. అక్కడ తన ప్రతిభను ప్రదర్శిస్తూ,
తనకంటూ ప్రత్యేక స్థానాన్ని చూరగొన్న ఈయన.. 1895లో అసిస్టెంట్ కమీషనర్ స్థాయికి చేరుకున్నారు. తదనంతరం డిప్యుటీ కమీనషరుగానూ పదవోన్నతి పొందారు. కొచ్చిన్ సంస్థానంలో రెవిన్యూ సెటిల్‌మెంట్ వ్యవస్థను సంస్కరించేందుకు.. ఆ విషయాలలో అనుభవమున్న పట్టాభి రామారావును ప్రభుత్వం కొచ్చిన్
సంస్థానానికి దీవాన్‌గా నియమించింది. 1902 నుండి 1907 వరకు దీవాన్ గా పనిచేసిన రామావు, రెవిన్యూ సెటిల్‌మెంటును పూర్తిచేసి భూమి దస్తావేజులను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలను ప్రవేశపెట్టారు. 1908లో ఉద్యోగ జీవితం నుండి విరమించారు.
విరమణ చేసిన తర్వాత మద్రాసులోని పూనమల్లి హై-రోడ్డుపై ‘శ్రీరామ బ్రిక్ వర్క్స్’ అనే ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు పనికల్పించారు. తన సొంత వ్యాపార నిర్వహణతో పాటు ఆదోనిలోని వెస్ట్రన్ కాటన్ కంపెనీ, ఉన్నిదారం ఎగుమతిచేసే మద్రాసు యార్న్ కంపెనీల నిర్వహణలో పాల్పంచుకోనేవారు.
తెలుగు అకాడమీ, భారతీయ అధికారుల సంఘం, కేంద్ర వ్యవసాయ కమిటీల కార్యదర్శిగా ప్రజాసేవలో చురుకుగా పాల్గొనేవారు. చివరకు మదనపల్లెలో స్థిరపడి సబ్ డివిజన్ సంఘానికి అధ్యక్షత వహించి, వాటి కార్యక్రమాలకు పూర్తి సమయాన్ని కేటాయించారు. సొంత ఖర్చులతో గ్రామాలను పర్యటించి, సామాన్య ప్రజల ఉద్ధరణకు
సలహాలు సూచనలిచ్చారు. తొలుత ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఉత్సుకత చూపించకపోయినా, ఆ తర్వాత మనసు మార్చుకొని అందుకు మద్దతునిచ్చారు. ఈయన 1918లో కడపలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు. వృద్ధాప్యకారాణాలవల్ల 1937 అక్టోబరు 15న మద్రాసులో తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
ఆనాడు బ్రిటీష్ అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆయా ఉద్యమాల్లో ఈయన కూడా పాల్గొన్నారు. స్వాతంత్ర్యంపై ప్రజల్లో చైతన్యం నింపి, ఆ దిశగా పావులు కదిపేలా కృషి చేశారు. తెల్లదొరలను భారతదేశం నుంచి తరిమి కొడితేనే తాము స్వాతంత్ర్యంగా
జీవించగలమని, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా వుండాలని, ప్రతిఒక్కరు స్వాతంత్ర్యం కోసం పోరాడాలంటూ పిలుపునిచ్చారు. ఈయన ప్రసంగానికి ఎంతోమంది ఉత్తేజితులై.. స్వాతంత్ర్య పోరాటాల్లో పాలుపంచుకున్నారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మన మునుపటి తరం #తెలుగు వాళ్ళు #తమిళాన్ని #అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇలా ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను '#మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు.
ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాల లాగా అన్నమాట. #చోళ మండలం, #పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''#తొండై_మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే #అరువనాడు. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం
వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకి అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద #అరవభాష, #అరవం అని పిలుస్తున్నారు.
మనం మాత్రమే కాదు తమిళులని ఇలా రాజ్యం పేరుతో పిలిచేది,
ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..
ఎందుకు ?
ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..
ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?
మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
#గడ్డి నీలం రంగులో కదా ఉండేది❓" అని ఒక గాడిద పులిని అడిగింది.
దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి❓.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది..
గాడిద "ఏడ్చావులే❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది..
ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ, అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి..
దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.
అక్కడికి చేరుకోగానే❗ పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద *"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా
ఉండేది.. అవునా కాదా❓ మీరే చెప్పండి " అంది.
"అవును❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం.
అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా❗అలా అని నేను ఎంత చెప్పినా, ఈ పులి ఒప్పుకోవడం లేదు. అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.
ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను
స్వామివారి ముందుంచాడు.
”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో
నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.
”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.