ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 17, 2022, 28 tweets

పుత్తడి జిలుగులు బొమ్మ.. వెండితెర వెలుగుల కొమ్మ హేమమాలిని పుట్టినరోజు నిన్న..

అక్టోబర్ 16వ తేది ప్రఖ్యాత నటి, నిర్మాత, దర్శకురాలు, భరతనాట్య కళాకారిణి, రాజకీయ నాయకురాలు శ్రీమతి #హేమామాలిని గారి పుట్టినరోజు సందర్భంగా.. ఆవిడకి శుభాకాంక్షలు..

సౌందర్య రాశి, చలన చిత్ర అప్సరస,‌ సహజ

స్నిగ్ధ సుకుమారి, హాస విలాస శృంగార నైషధి, మనోజ్ఞ మంజుల మాలిని, మరాళ గమని, విజృంభిణ తరళ తటిల్లత, అభినయ ముద్రాంకిత జావళి మన హేమమాలిని. పేరులోనే పసిడితనం రంగరించిన పడతి. ఒక విలక్షణమైన కథానాయికగా భారతీయ సినిమా పరిశ్రమలో ఆసేతు హిమాచలం వరకు ప్రేక్షకుల హృదయ సింహాసనం మీద ఒక

మహారాణిగా నిలిచిపోయింది. దక్షిణ భారతం నుంచి ఉత్తరాది సినిమా పరిశ్రమలో ఆల్ ఇండియా "డ్రీమ్ గర్ల్" గా ఒక "బ్యూటీ ఐకాన్" గా ఈనాటి వరకు నిలిచింది. అంతటి గొప్ప కళాకారిణి యావత్ భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

#హేమమాలిని_విలక్షణ_ప్రత్యేకత:

హేమామాలిని గారు ఏ కథానాయికతో

పోల్చదగని ఆహార్యం భారతీయ సినిమా పరిశ్రమలో నిలిచిపోయింది. మన చలన చిత్రాలలో ఒక కథానాయికకు ఒక ప్రత్యేకమైన శైలిలో ఒక విధమైన కాస్ట్యూమ్స్ బాగా నప్పుతుంది. అలాగే, కేశాలంకరణం విషయంలో కూడా అందరి కథానాయికలకు ఒకే విధమైన స్టైల్స్ నచ్చుతాయి కొందరి అసలే సరిపోవు. ఈ విషయంలో విభిన్నమైన కోణాల్లో

కొన్ని లక్షణాలు కొందరికి మాత్రమే వర్తిస్తాయి. కాని మన హేమమాలిని గారి ఆహార్యం ఒక విన్నూతమైన పోల్చదగని స్థాయిలో ఉంటుంది. ఏ కాస్ట్యూమ్ వేసిన ఏ హేయిర్ స్టైల్ విభిన్న శైలిలో పోలికలేని విధంగా ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన వెండితెరపై వెలుగులు చిమ్ముతుంది. బహుశా, ఈ విషయంలో హేమమాలిని గారు

ప్రత్యేకతను సంతరించుకొని ఎప్పుడు చూసినా ఏదో విశేషత్వం ఆహార్యంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సాంప్రదాయ చీరకట్టు నుంచి అధునాతనమైన ఏ కొత్త ట్రెండ్ స్టైల్ వరకు దానికి తగ్గట్టు ఇమిడిపోయి దానికి ఒక విధమైన కొత్తందం తెచ్చే బ్యూటిపుల్ స్టేచర్ ఒక్క హేమామాలిని కావడం గమనార్హం.

అందుకోసమే మన #వేటూరి వారు అన్నట్టు "నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ ఆ కట్టుబడికి ధన్యమ్యె పట్టుపురుగు జన్మా...." అన్న కవి హృదయానికి సాక్షాత్ సజీవ ఉదాహరణకి #హేమమాలిని గారు నిలిచారన్నది అతిశయోక్తి కాదు.

సాంప్రదాయ శ్రీవైష్ణవ అయ్యంగార్ కుటుంబానికి చెందిన వస్త్ర ధారణ హేమమాలిని

కుదిరినట్టు వేరే కొందరు కథానాయకులకు కుదరదు. అందమైన ఆహార్యం చిరునామాకు నిలిచారు హేమమాలిని గారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక తిరగరాయని రికార్డు సాధించిన హేమమాలిని ఈ నాటికి ఎవ్వరును ఆ స్థానాన్ని చేరుకోవడం అసాధ్యం గగన కుసుమమే. ఈ ఉదాహరణకు 1977 విడుదలైన బాలీవుడ్

హిందీ చిత్రం 'డ్రీమ్ గర్ల్'లోని ఒక పాటలో దాదాపుగా అత్యధిక సంఖ్యలో డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ డిఫెరెంట్ స్టైల్స్ మార్చిన ప్రయోగకర్త కథానాయికగా హేమామాలిని గారు నిలిచారు.అంతటి అజేయమైన అద్భుతమైన అందాల రాశి హేమమాలిని.

హేమామాలిని గారి ఇంకో మరుగున ఘటన దాదాపుగా పరిశ్రమలో ఎవ్వరికి తెలియని

విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. 1971 నాటి కౌముది వారి యమ్.యస్. రెడ్డి గారి నిర్మాణంలో పౌరాణిక బ్రహ్మ శ్రీ #కామలాకర_కామేశ్వరరావు గారి దర్శకత్వంలో "శ్రీకృష్ణ విజయము" తెరకెక్కిస్తున్న రోజులు. కథాపరంగా సన్నివేశ అణుగుణంగా దేవేంద్రుని కొలువులో శ్రీకృష్ణుడికి ఒక అప్సరస స్వాగత గీతం చర్చ

జరిగే వేళలో ఆ అప్సరస 'రంభా' పాత్రకు చర్చ జరుగుతోంది. అయితే యన్టీఆర్ ఈ రంభ పాత్రకు 'పాండవ వనవాసం' చిత్రంలో నృత్య సన్నివేశంలో నటించిన అమ్మాయి హేమమాలినికి అవకాశం ఇద్దామన్నాడు. ఈ చర్చలో ఉన్న కమలాకర వారు, రెడ్డిగారు యన్టీఆర్ ప్రస్తావనకు అంగీకరించారు. ఈపాట సినిమాకే హైలెట్ గా నిలిచింది.

సంగీతం, సాహిత్యం, గానం, నృత్యం ఒకదానికొకటి అంతర్లీనంగా ఒదిగిపోయిన అత్భుత ఆవిష్కరణకు నాంది పలికింది. కర్నాటక శాస్త్రీయ సంగీతంలోని 'అఠణా' రాగంలో స్వరపరిచిన ఈ పాట "జోహారు శిఖిపింఛ మౌళీ..." ఎంత సంచలన విజయం సాధించిన పాటగా నిలిచిందో రసజ్ఞులైన మీ అందరికి విదితమే కదా? ప్రత్యేకించి నేను

చెప్పాల్సిన అవసరం లేదు. వెంటనే యమ్.యస్. రెడ్డి గారు హేమమాలిని గారిని బాంబే నుంచి విమానంలో పిలిపించి ఆ పాట షూట్ చేయించారు.

ఈ పాట విన్న తరువాత హేమమాలిని గారు తాను చేసిన నృత్యాభినయనాని కంటే పాట కాంపోజిషన్ పెండ్యాల సాబ్ తో పాటుగా అందునా సుశీలజీ పాడటం చాలా బాగుందన్నారు.

హేమామాలిని గారు చెబుతూ సుశీలమ్మ గానం ముందు తన నృత్యం ఏపాటియని ఆ గాత్రం తగ్గట్టు నృత్యం అసాధ్యమని చెప్పారు. సుశీలజీ గమకాలలో నృత్య రీతులు సమానంగా ఇమడలేవని కష్టతరం అని చెపుతారు. హేమామాలిని చెబుతూ సుశీలజీ, ఎందరు ఉన్నా కూడా భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత మధురమైన, పరిపూర్ణమైన,

స్పష్టంగా, హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుందని అంటారు.

అక్కడున్న యన్టీఆర్ తో సహా కమలాకర వారు, పెండ్యాల వారు, రెడ్డి గారు, సి.నారాయణ రెడ్డి గారు కరతాళ ధ్వనులతో హేమామాలిని అభినందించారు. విచిత్రమైన విషయమేమిటంటే అక్కడున్న వారందరికి సుశీలమ్మ వీరాభిమానులు కావడం యాదృచ్ఛికం.

#హేమామాలిని_గారి_సంక్షిప్త_పరిచయం :

హేమామాలిని గారి అసలు పేరు 'హేమమాలిని చక్రవర్తి'. 1948 అక్టోబర్ 16వ తేదిన సాంప్రదాయ తమిళ వైష్ణవ అయ్యంగార్ కుటుంబంలో వి.యస్.ఆర్ చక్రవర్తి, జయలక్ష్మి దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం/తిరుచురాపల్లి/ తిరుచ్చి లో జన్మించారు.

మద్రాసులోని 'ఆంధ్ర మహిళా సభా' కాలేజిలో చదివారు. భారతీయ చరిత్ర ఫెవరేట్ సబ్జెక్ట్. మొదటి నుంచే భారతీయ సనాతన సంప్రదాయాలపై గౌరవం ఉన్న ఏకైక నటి మణి హేమమాలిని గారే.

తొలిసారిగా తమిళ సినిమా 'ఇదు సత్తియం'లోన 'సింగారి' పాత్రలో ఒక గ్రూప్ సాంగ్ లో మెరుపు తీగలా తళుక్కున తెరంగ్రేటం చేసారు.

విఖ్యాత నట విశారద పసుపులేటి కన్నాంబ గారు ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రంలో హేమమాలిని చూసి #కన్నాంబ గారు భారతీయ సినిమా ఒక మంచి స్థానం చేరుకొనగలవని ఆశీర్వదించారు. మరి కన్నాంబ గారి మాటే నిజమైనది. సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి అందించారు. కణ్ణదాసన్ గారు తొలి సాహిత్యం అందించారు.

మరల వెంటనే 1965 నాట పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వంలో తెరకెక్కిన 'పాండవ వనవాసం'చిత్రంలో అనుకోకుండా ఒక నృత్య కళాకారిణిగానే అవకాశం లభించింది. అలా ఈ చిత్రంలో అనితరసాధ్యులైన యస్వీఆర్, యన్టీఆర్, సావిత్రి, నాగయ్య గారు, ఋషేంద్రమణి, సంధ్య, వాణిశ్రీ, లాంటి అత్యున్నత

కళాకారులతో పని చేసే అదృష్టం దక్కింది. ఈ సినిమా పాత్ర నిడివి చాలా చిన్నదైన హేమమాలిని గారి నటజీవితంలో మరపురానిదని చెపుతారు.

హేమామాలిని గారు భరతనాట్యం శాస్త్రీయ నృత్య కళాకారిణి. శ్రీ వెంపటి చిన సత్యం గారి వద్ద 'కూచిపూడి' మరియు కళామండలం గురు గోపాలకృష్ణన్ గారి వద్ద

'మోహినీ అట్టం' అభ్యసించారు. 'నాట్య విహార కళా కేంద్రం' అనే సొంత డాన్స్ స్కూల్ కూడా ప్రారంభి నడుపుతున్నారు.

మొదటి నుంచే భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు

2003 నుంచి 2009 వరకు భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటు రాజ్యసభకు ఎన్నికైనారు

2010, 2011 బి.జె.పి జనరల్ సెక్రటరీ ఎన్నికైనారు

2014 నాట మథురా నియెజకవర్గంలో బి.జె.పి పోటి చేసి లోక్ సభకు ఎన్నికైనారు

'న్యూ ఉమెన్' 'మేరీ సహేలి' అనే స్త్రీ పత్రికలకు సంపాదకురాలు

2000 నుంచి 2003 వరకు వరుసగా మూడేళ్లు 'నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్'(NFDC) ఛైర్ పర్సన్ గా

వ్యవహరించారు. ఈ సంస్థ మొట్టమొదటి మహిళా నిలిచారు.

#హేమామాలిని_వారసత్వ_సంపద :

హేమామాలిని జీవిత చరిత్ర ఆధారంగా మూడు పుస్తకాలు అచ్చు వేసారు. అందులో 'రామ్ కమల్ ముఖర్జీ' రచించినవి 'హేమమాలిని దివా అన్వేల్డ్' మరియు 'హేమమాలిని - బియాండ్ డ్రీమ్ గర్ల్' కాగా 'భావనా సౌమ్య' రచించిన

'హేమమాలిని - ది ఆథరైజడ్ బయోగ్రఫీ' ముఖ్యమైన గ్రంధాలగా నిలిచాయి.

#హేమామాలిని_సినీ_ప్రస్థానం_విశేషాలు :

మొట్టమొదటి సినిమా తమిళ భాషలో 'ఇదు సత్తియం'

మొదటి బాలీవుడ్ హిందీ చిత్రం 'సప్నోకా సౌదాఖర్'

మొదటి కథానాయకుడు 'రాజ్ కపూర్'

మొదటి ప్లేబ్యాక్ సింగర్ యల్.ఆర్.ఈశ్వరి

మొదటిసారి సాహిత్యం అందించింది తెలుగులో 'కొసరాజు' గారు, తమిళంలో 'కణ్ణదాసన్' గారు హిందీలో 'శైలేంద్ర' గారు

మొదటి దర్శకుడు 'కె. శంకర్' తమిళ భాషలో, తెలుగులో 'కమాలాకర కామేశ్వరరావు' గారు, హిందీలో మహేశ్ కౌర్

మొదటి సంగీత దర్శకుడు 'విశ్వనాథన్ రామ్మూర్తి' గారు,

తెలుగులో 'ఘంటసాల మాస్టర్' గారు హిందిలో 'శంకర్ జైకిషన్'

అభిమాన నటుడు యన్టీరామారావు, యస్వీరంగారావు, ధర్మేంద్ర

అత్యధికంగా ధర్మేంద్రతో నటించింది

అభిమాన నటి కన్నాంబ, సావిత్రి, మీనాకుమారి

తెలుగులో చివరిసారిగా రాజమాత పాత్రలో 'గౌతమి పుత్ర శాతకర్ణి'

అభిమాన గాయకుడు ఘంటసాల వారు, ముఖేశ్

అభిమాన గాయని పి సుశీల గారు, లతా మంగేష్కర్ గారు

అభిమాన సంగీత దర్శకులు ఘంటసాల వారు, పెండ్యాల వారు, శంకర్ జైకిషన్లు,

ఇంతటి ఒక ప్రత్యేకమైన శైలి, స్థానం, ఇమేజ్, గ్లామర్ సంపాదించుకున్న మన దక్షిణాది గొప్ప నటియైన మన 'హేమమాలిని' గారికి భగవంతుడు ఆయు,

ఆరోగ్యాలు ఇతోధికంగా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ...

సేకరణ.. వేంకట రఘు వేదం_సూర్య అరవా

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling