అక్కిరాజు లక్ష్మీ సునీత Profile picture

Oct 25, 2022, 9 tweets

శుభోదయం 🙏

#గోవర్ధన_పూజ/#అన్నకూట్_పూజ/#ఛప్పన్_భోగ్

ఇది ద్వాపరయుగంలో ప్రారంభమైన పూజ. అంతకు ముందు ఈ పూజను #ఇంద్రయాగం అనేవారు. కార్తీకమాస ఆరంభంలో ఈపూజ నిర్వహిస్తారు. ఈ పూజకు ఆరాధ్యదైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు.వర్షకారకుడు.వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి.అందుకే ఈ పండుగ రోజు

ఇంద్రుని పూజిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల,గోపాలకుల పండుగ. ఈ పండుగనాడు పలురకాలైన తీపి పదార్థాలు, రుచిగల వంటకాలు, అన్నపురాశులు.. గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రునకు నివేదనగా సమర్పించే వారు. అందుకే ఈపూజకు #అన్నకూటం అని మరొక పేరు కూడా ఉంది.

ఈ పూజ వెనుక కథ
శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వం అణిచి, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కథ మనకు తెలుసు కదా..ఆ నాటి నుండి ‘ఇంద్రయాగం’ ‘గోవర్ధనపూజ’గా మారిపోయింది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకున్న రోజు ‘కార్తీక శుద్ధ పాడ్యమి’. అందుకనే ఈ రోజున  రైతాంగమంతా ఈ గోవర్ధన పూజను

నిర్వహిస్తారు. ఈ రోజున ఉదయమే తలస్నానం చేసి, ఆవుపేడతో శ్రీకృష్ణుని విగ్రహాన్ని,గోవర్ధన పర్వతాన్ని  తయారుచేసి, షోడశోపచారాలతో శ్రీకృష్ణుని ఆరాధించి, అన్నపు రాశులు, రకరకాల పిండివంటలు, పదార్ధాలు శ్రీకృష్ణునకు నివేదనగా సమర్పిస్తారు. తర్వాత  ఆట పాటలతో శ్రీకృష్ణుని సంతోష పరిచి

ఆ ప్రసాదాన్ని సామూహికంగా భుజిస్తారు. ఇదీ ‘గోవర్ధన పూజ’ కథ.

యాభై ఆరు ఆహార పదార్థాలు (చప్పన్ భోగ్) తయారు చేసి నైవేద్యం గా సమర్పిస్తారు.మథుర నగరంలోని ఆవుల కాపరులు ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తారు, ఆవు మరియు ఎద్దుతో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు,

పోతన భాగవతంలోని గోవర్ధనగిరిని  ఎత్తిన ఘట్టం లోని పద్యాలు చూడండి..ఎంత బావున్నాయో!!

బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతో గృష్ణుండు దా నమ్మహా
శైలంబున్ వలకేల దాల్చి విపులచ్ఛత్త్రంబుగా బట్టె నా
భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీగోప గోపంక్తికిన్!

బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా
జాలండో యని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నా
కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందం బ్రమోదంబునన్!
Pic courtesy Google

BAPS ,Swamy Narayan Temple,Houston లో అన్నకూట్
Pic courtesy by my niece

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling