ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 26, 2022, 14 tweets

#తెల్లదొరలను పాలించనున్న భారతీయ శక్తి

నాలుగు వందల ఏళ్లు మనం ఆంగ్లేయుల పాలనలో మగ్గాం. ఎన్నో అవమానాలు.. ప్రాణత్యాగాలు.. స్వతంత్రం సిద్ధించింది. మేం వదిలివెళ్లిన భారత్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవుతుంది అని నవ్విన చర్చిల్ దొర. ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ రిషి పాలనను చూడాలని

కోరుకుందాం. బ్రిటన్‌లో తొలిసారిగా భారత సంతతికి చెందిన ఓ పౌరుడు ప్రధాని కావడం ద్వారా కొత్త చరిత్ర మొదలైంది. భారత సంతతికి చెందిన #రిషి_సునక్ ఇప్పుడు బ్రిటన్ ప్రధాని అయ్యారు. రిషి సునక్ భారతీయ పౌరుడు కాకపోవచ్చు, కానీ అతని హృదయంలో భారత్‌ ఉంది. 42 ఏళ్ల రిషి సునక్.. భారతదేశం,

తూర్పు ఆఫ్రికా నుంచి వచ్చిన సంపన్న వలసదారుల్లో ఒకరు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు #నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. సునక్ తండ్రి #యశ్వీర్_సునక్ నేషనల్ హెల్త్ సర్వీస్‌లో జనరల్ ప్రాక్టీషనర్‌, ఆయన తల్లి #ఉషా_సునక్ ఒక కెమిస్ట్ షాపును నడిపారు.

రిషి సునక్ వించెస్టర్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తన తల్లిదండ్రుల గురించి సునక్ మాట్లాడుతూ, నా తల్లిదండ్రులు అంకితభావంతో ప్రజలకు సేవ చేయడం నేను చూశాను. నేను వారి నీడలో పెరిగాను. సునక్ ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడతారు, కాబట్టి అతను

తన ఖాళీ సమయంలో క్రికెట్, ఫుట్ బాల్ ఆడటం, సినిమాలు చూడటానికి ఇష్టపడతాడు.

నేను చదువుకుంటూనే అనేక దేశాలలో నివసించాను. పని చేయడానికి గొప్ప అవకాశాలను పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను కాలిఫోర్నియాలో నా భార్య అక్షతను కలిశాం. మేము చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాం. మాకు కృష్ణా, అనుష్క

అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్లతో ఉంటే టైం అసలు తెలియదు. బిజీ అయిపోతాం. అంతకంటే వరం ఇంకేం కావాలి. అని అన్నారు.

2015లో రిచ్మండ్ (యార్క్) నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన సునక్ 2017, 2019లో తిరిగి ఎన్నికయ్యారు. జూలై 2019 లో, సునక్ జనవరి 2018 లో స్థానిక ప్రభుత్వ మంత్రిగా

ఎన్నికయ్యారు. తరువాత, #ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. 2020 ఫిబ్రవరిలో ఖజానాకు ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది జులై వరకు ఈ పదవిలో పనిచేసే అవకాశం ఆయనకు లభించింది.

#భారత్‌_విడిచివెళ్లిన_రిషి_సునక్_తాత

తాత పేరు రామ్ దాస్ సునక్, అమ్మమ్మ పేరు సుహాగ్ రాణి సునక్, ఇద్దరూ

బాగా చదువుకున్న కుటుంబానికి చెందినవారు. 1935లో రామ్ దాస్ సునక్ కెన్యాలోని నైరోబీలో గుమాస్తాగా ఉద్యోగం సంపాదించారు. ఆయన నీటి ఓడకు వన్-వే టికెట్ బుక్ చేసి కెన్యాకు బయలుదేరారు. 1937లో అమ్మమ్మ కూడా కెన్యా చేరుకున్నారు.

వారిద్దరికీ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలతో సహా ఆరుగురు

పిల్లలు ఉన్నారు, వారిలో ఒకరు సునక్ తండ్రి అయిన యశ్వీర్ సునక్. యశ్వీర్ సునక్ 1949లో నైరోబీలో జన్మించారు. రిషి సునక్ తాత రామ్ దాస్ భారతదేశాన్ని విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ దేశంతో తన సంబంధాన్ని పూర్తిగా ఆయన తెంచుకోలేదు. కొన్ని సంవత్సరాల తరువాత రామ్ దాస్, సుహాగ్ రాణితోపాటు మొత్తం

కుటుంబం బ్రిటన్‌లో స్థిరపడింది.
రిషి సునక్ తల్లి ఉషా సునక్, యశ్వీర్ సునక్ 1977లో ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లో వివాహం చేసుకున్నారు. ఉషా సునక్ తండ్రి రిషి సునక్ మేనమామ కూడా భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవారే.

సునక్ 1980లో ఒక సాధారణ ఆసుపత్రిలో జననం. రిషి సునక్ 1980 మే 12న

సౌతాంప్టన్ జనరల్ ఆసుపత్రిలో జన్మించారు. యశ్వీర్, ఉషా సునక్‌లకు మొదటి సంతానం. ఆయన తర్వాత రిషి తమ్ముడు సంజయ్ సునక్ 1982లో జన్మించగా, చివరకు 1985లో అతని చెల్లెలు రాఖీ సునక్ జన్మించారు. పిల్లల ప్రతి అవసరాన్ని తీర్చడానికి తల్లిదండ్రులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసేవారు.

రిషి సునక్ తన తల్లి దుకాణంలో సాయం చేసేవారు.

చిన్నప్పటి నుంచి దేవాలయాలను సందర్శన చేసే రిషి సునక్ ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. కాబట్టి అతనికి చిన్నప్పటి నుంచి ఆలయాలను సందర్శించే అలవాటు ఉంది. అతని తాత రామ్ దాస్ సునక్ ఈ ఆలయ స్థాపక సభ్యుడు కాబట్టి సౌతాంప్టన్ లోని హిందూ వైదిక సమాజం

ఆలయం అంటే ఆయనకు చాలా ఇష్టం. వారు ఇక్కడ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. విదేశాల్లో ఓ వ్యక్తి భగవద్గీత మీద ప్రమాణం చేసి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించటం ఎంత గొప్పదో మన హిందూ ధర్మం.

రిషి సునక్ నీ భారతీయ మూలాలైన మేం గర్వించేలా బ్రిటన్ ను పాలించి ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించు. ఇదే మేం కోరుకునేది.

సేకరణ... ఏ బి పి దేశం...

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling