నాలుగు వందల ఏళ్లు మనం ఆంగ్లేయుల పాలనలో మగ్గాం. ఎన్నో అవమానాలు.. ప్రాణత్యాగాలు.. స్వతంత్రం సిద్ధించింది. మేం వదిలివెళ్లిన భారత్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవుతుంది అని నవ్విన చర్చిల్ దొర. ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ రిషి పాలనను చూడాలని
కోరుకుందాం. బ్రిటన్‌లో తొలిసారిగా భారత సంతతికి చెందిన ఓ పౌరుడు ప్రధాని కావడం ద్వారా కొత్త చరిత్ర మొదలైంది. భారత సంతతికి చెందిన #రిషి_సునక్ ఇప్పుడు బ్రిటన్ ప్రధాని అయ్యారు. రిషి సునక్ భారతీయ పౌరుడు కాకపోవచ్చు, కానీ అతని హృదయంలో భారత్ ఉంది. 42 ఏళ్ల రిషి సునక్.. భారతదేశం,
తూర్పు ఆఫ్రికా నుంచి వచ్చిన సంపన్న వలసదారుల్లో ఒకరు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు #నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. సునక్ తండ్రి #యశ్వీర్_సునక్ నేషనల్ హెల్త్ సర్వీస్‌లో జనరల్ ప్రాక్టీషనర్, ఆయన తల్లి #ఉషా_సునక్ ఒక కెమిస్ట్ షాపును నడిపారు.
రిషి సునక్ వించెస్టర్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తన తల్లిదండ్రుల గురించి సునక్ మాట్లాడుతూ, నా తల్లిదండ్రులు అంకితభావంతో ప్రజలకు సేవ చేయడం నేను చూశాను. నేను వారి నీడలో పెరిగాను. సునక్ ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడతారు, కాబట్టి అతను
తన ఖాళీ సమయంలో క్రికెట్, ఫుట్ బాల్ ఆడటం, సినిమాలు చూడటానికి ఇష్టపడతాడు.
నేను చదువుకుంటూనే అనేక దేశాలలో నివసించాను. పని చేయడానికి గొప్ప అవకాశాలను పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను కాలిఫోర్నియాలో నా భార్య అక్షతను కలిశాం. మేము చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాం. మాకు కృష్ణా, అనుష్క
అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్లతో ఉంటే టైం అసలు తెలియదు. బిజీ అయిపోతాం. అంతకంటే వరం ఇంకేం కావాలి. అని అన్నారు.
2015లో రిచ్మండ్ (యార్క్) నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన సునక్ 2017, 2019లో తిరిగి ఎన్నికయ్యారు. జూలై 2019 లో, సునక్ జనవరి 2018 లో స్థానిక ప్రభుత్వ మంత్రిగా
ఎన్నికయ్యారు. తరువాత, #ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. 2020 ఫిబ్రవరిలో ఖజానాకు ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది జులై వరకు ఈ పదవిలో పనిచేసే అవకాశం ఆయనకు లభించింది.
తాత పేరు రామ్ దాస్ సునక్, అమ్మమ్మ పేరు సుహాగ్ రాణి సునక్, ఇద్దరూ
బాగా చదువుకున్న కుటుంబానికి చెందినవారు. 1935లో రామ్ దాస్ సునక్ కెన్యాలోని నైరోబీలో గుమాస్తాగా ఉద్యోగం సంపాదించారు. ఆయన నీటి ఓడకు వన్-వే టికెట్ బుక్ చేసి కెన్యాకు బయలుదేరారు. 1937లో అమ్మమ్మ కూడా కెన్యా చేరుకున్నారు.
వారిద్దరికీ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలతో సహా ఆరుగురు
పిల్లలు ఉన్నారు, వారిలో ఒకరు సునక్ తండ్రి అయిన యశ్వీర్ సునక్. యశ్వీర్ సునక్ 1949లో నైరోబీలో జన్మించారు. రిషి సునక్ తాత రామ్ దాస్ భారతదేశాన్ని విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ దేశంతో తన సంబంధాన్ని పూర్తిగా ఆయన తెంచుకోలేదు. కొన్ని సంవత్సరాల తరువాత రామ్ దాస్, సుహాగ్ రాణితోపాటు మొత్తం
కుటుంబం బ్రిటన్‌లో స్థిరపడింది.
రిషి సునక్ తల్లి ఉషా సునక్, యశ్వీర్ సునక్ 1977లో ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లో వివాహం చేసుకున్నారు. ఉషా సునక్ తండ్రి రిషి సునక్ మేనమామ కూడా భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవారే.
సునక్ 1980లో ఒక సాధారణ ఆసుపత్రిలో జననం. రిషి సునక్ 1980 మే 12న
సౌతాంప్టన్ జనరల్ ఆసుపత్రిలో జన్మించారు. యశ్వీర్, ఉషా సునక్‌లకు మొదటి సంతానం. ఆయన తర్వాత రిషి తమ్ముడు సంజయ్ సునక్ 1982లో జన్మించగా, చివరకు 1985లో అతని చెల్లెలు రాఖీ సునక్ జన్మించారు. పిల్లల ప్రతి అవసరాన్ని తీర్చడానికి తల్లిదండ్రులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసేవారు.
రిషి సునక్ తన తల్లి దుకాణంలో సాయం చేసేవారు.
చిన్నప్పటి నుంచి దేవాలయాలను సందర్శన చేసే రిషి సునక్ ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. కాబట్టి అతనికి చిన్నప్పటి నుంచి ఆలయాలను సందర్శించే అలవాటు ఉంది. అతని తాత రామ్ దాస్ సునక్ ఈ ఆలయ స్థాపక సభ్యుడు కాబట్టి సౌతాంప్టన్ లోని హిందూ వైదిక సమాజం
ఆలయం అంటే ఆయనకు చాలా ఇష్టం. వారు ఇక్కడ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. విదేశాల్లో ఓ వ్యక్తి భగవద్గీత మీద ప్రమాణం చేసి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించటం ఎంత గొప్పదో మన హిందూ ధర్మం.
రిషి సునక్ నీ భారతీయ మూలాలైన మేం గర్వించేలా బ్రిటన్ ను పాలించి ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించు. ఇదే మేం కోరుకునేది.
సేకరణ... ఏ బి పి దేశం...
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మన మునుపటి తరం #తెలుగు వాళ్ళు #తమిళాన్ని #అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇలా ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను '#మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు.
ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాల లాగా అన్నమాట. #చోళ మండలం, #పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''#తొండై_మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే #అరువనాడు. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం
వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకి అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద #అరవభాష, #అరవం అని పిలుస్తున్నారు.
మనం మాత్రమే కాదు తమిళులని ఇలా రాజ్యం పేరుతో పిలిచేది,
ఇందులో 'డోర్', 'లాక్', ‘కీస్’ కు అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. కానీ మనం వాడం..
ఎందుకు ?
ఓ ముప్పై యేళ్ళు వెనక్కి వెళితే,
తలుపు తాళం వేసుకో,
గడియ పెట్టుకో అనే వాళ్ళం..
ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం.
నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?
మన తెలుగులో మాటలు లేవా ?
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !
కానీ మనం పలకం.
#గడ్డి నీలం రంగులో కదా ఉండేది❓" అని ఒక గాడిద పులిని అడిగింది.
దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి❓.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది..
గాడిద "ఏడ్చావులే❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది..
ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ, అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి..
దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది.
అక్కడికి చేరుకోగానే❗ పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద *"వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా
ఉండేది.. అవునా కాదా❓ మీరే చెప్పండి " అంది.
"అవును❗గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం.
అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా❗అలా అని నేను ఎంత చెప్పినా, ఈ పులి ఒప్పుకోవడం లేదు. అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది.
ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను
స్వామివారి ముందుంచాడు.
”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో
నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.
”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.