శ్రీ Profile picture
He/Him/His ⚛️ #Atheist and unapologetic #Sanatani. Pun is intentional, at least, most of the times 🫣

Oct 30, 2022, 22 tweets

#WhyJaganHatesPawan

పవన్ కళ్యాణ్ పేరు కూడా పలకడం ఇష్టం లేనంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడు జగన్రెడ్డి?

కేవలం 2014 లో అధికారానికి దూరం చేసాడనా? ఇంకేమైనా వుందా.. పరిశీలిద్దాం. (1/22)

#Sree_thread

కొంత వెన్నక్కెళ్లి చరిత్ర చూద్దాం.

నిజానికి 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి 70లక్షల ఓట్లు 18అసెంబ్లీ సీట్లు గెలవకపోతే టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించేది.

బాబు, వైయస్సార్ ఇద్దరూ అబద్దపు ప్రచారాలని చేసి కోవర్టులని పంపి PRPని దెబ్బ తీశారన్నది వేరేవిషయం (2/22)

#WhyJaganHatesPawan

టీడీపీ తక్కువ మార్జిన్ లో ఓడిపోయినవి, PRP గెలిచిన చోట టీడీపీ రెండో స్థానంలో వున్నవి చాలా సీట్లు వున్నాయ్.

అసలే సినిమాల్లో తోక్కేసిన మెగాస్టార్ అధికారాన్ని కూడా దూరం చేశాడని టీడీపీ ఇప్పటికీ విషం కక్కుతాది.

అయితే జగన్ కోణం ఏంటి? (3/22)

#WhyJaganHatesPawan

వైయస్సార్ మరణానంతరం జరిగిన సంతకాల సేకరణలో పార్టీని చీల్చి అయినా ముఖ్యమంత్రిని అయిపోలనుకున్న జగన్ కి అడ్డుపడింది చిరంజీవే. బేషరతుగా మైనారిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దత్తు ఇచ్చి నిలబెట్టారు.

సోనియా ముఖ్యమంత్రి పోస్ట్ ఆఫర్ చేసినా రెడ్డి లాబీ అడ్డుపడింది అనే వార్త వుంది. (4/22)

ఆంధ్రా విభజన తరువాత రాజధాని ప్రాంతాన్ని గుర్తించడానికి ఏర్పాటు చేసిందే శివరామకృష్ణన్ కమిటీ. వారు గుర్తించింది దొనకొండ - వినుకొండ ప్రాంతాల్లో వున్నా వేలాది ఎకరాల బీడు పోరంబోకు భూమి రాజధాని నిర్మించడానికి అన్నిరకాలుగా అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. (5/22)
timesofindia.indiatimes.com/india/panel-fi…

వైయస్సార్ మరణం మీద సానుభూతి, చర్చిల్లో ప్రచారం, కన్వర్షన్ మాఫియా అండలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తున్నాం అనే గట్టి నమ్మకంతో వున్నా జగన్ ముఠా ఈ విషయాన్ని కాష్ చేసుకోవడానికి పూనుకున్నారు.
బెదిరించీ, ప్రలోభపెట్టీ ఆ ప్రాంతంలో వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. (6/22)

తమప్రభుత్వం రావడమే తరువాయి లక్షలకోట్లకు పడగలెత్తొచ్చు అనే ప్రణాళికలు వేసుకున్నారు

సరిగ్గా ఇక్కడే పవన్ కళ్యాణ్ అనే ఒకేఒక వ్యక్తి తమ ఆశలపై నీళ్లు చల్లాడు. పార్టీ అయితే ప్రకటించాడు, తానుతప్ప ఇంకెవరూ లేరు, ఏం చేయగలడు అనుకున్నవాళ్ళకి చుక్కలు చూపించి అంచనాలు తలక్రిందులు చేసాడు. (7/22)

అప్పటిదాకా ఎవరి అంచనాల్లోనూ లేని తెలుగుదేశం పార్టీ పవన్ మోదీ ల సాయంతో అనూహ్యంగా విజయం సాధించింది.

ఈనగాచి తినబోతున్న తమ నోటికాడ కూడు పోయిందనే బాధ జగన్ కి ఇప్పటికీ వుంది. ఆ ఉక్రోషంతోనే ప్యాకేజీ అనే ప్రచారానికి తెర లేపాడు. (8/22)
#WhyJaganHatesPawan

ప్రశాంత్ కిషోర్ సూచనలతో తననీ, తన తండ్రినీ, ఆఖరికి తనతల్లిని సైతం అనరాని మాటలతో అసభ్యంగా దూషించిన వారిని సైతం పార్టీలో జేర్చుకుని అధికారమే అంతిమలక్ష్యంగా ఎత్తులు వేసిన జగన్ ముఠా పవన్ కళ్యాణ్ దగ్గరకి కూడా పొత్తుకోసం వచ్చారు. (9/22)
#WhyJaganHatesPawan

విజయసాయి రెడ్డి స్వయంగా నాగబాబు, బొలిశెట్టి సత్యలను పొత్తు విషయమై సంప్రదించడానికి ప్రయత్నించారు.

అయితే క్రిమినల్స్ తో రాజకీయాలు చేయడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ అప్పోయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.

ఇది జగన్ అహాన్ని బాగా దెబ్బ తీసింది. (10/22)
#WhyJaganHatesPawan

చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అందరికీ తెలిసిందే. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా వుంది

సరిగ్గా అప్పుడే ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు బాబు పవన్ ఒక్కటే, పవన్ కి వోటేస్తే బాబుకు వేసినట్టే అనే విష ప్రచారం మొదలు పెట్టారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా వేసిన ఎత్తుగడ (11/22)

నిజానికి ఈప్రచారాన్ని జనం నమ్మలేదు.

కానీ రేపు వైసీపీ, టీడీపీ, జనసేనలకు బొటాబొటిగా వచ్చి జనసేన ఒకరికి సపోర్ట్ చేయాల్సి వస్తే పవన్ ఎట్టి పరిస్థితిలోనూ జగన్ కి సపోర్ట్ చేయడు అనేది మాత్రం అందరికీ అర్ధమైంది.

అందుకే పవన్ కి పడాల్సిన ఫెయిర్ షేర్ వోట్లు కూడా పడలేదు. (12/22)

అన్ని వోట్లు పోగై అనూహ్య మెజారిటీతో తాము కూడా ఊహించని విధంగా 151 సీట్లతో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.

అయితే కేవలం ఐదు నెలల్లో ప్రభుత్వ అసంబద్ధ ఇసుక విధానాలపై గళమెత్తి జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ ఐదు లక్షల పైచిలుకు ప్రజలు పాల్గొనడంతో అద్భుత విజయం సాధించింది. (13/22)

మళ్ళీ లేవకుండా పార్టీని చంపేసాం, సాక్షాత్తూ అధినేతనే ఒక్క సీటు గెలవకుండా చేసేశాం అనుకున్న వైసీపీ కి ఇది గొడ్డలి పెట్టు.

ఇంచుమించు అదే సమయంలో విజయసాయి మొబిలైజేషన్ చేసినా తన విశాఖ పర్యటనకి ఎవరూ రాకపోవడం జగన్రెడ్డికి వైసీపీకీ అత్యంత అవమానకరం. (14/22)

#WhyJaganHatesPawan

పవన్ కళ్యాణ్ చెప్పిన 25ఏళ్ల పోరాటం ప్రజలకు అర్ధమైంది.
సినీభాషలో చెప్పాలంటే భల్లాలదేవుని పట్టాభిషేకంలా కనబడింది జగన్రెడ్డికి తన పదవి

అప్పుడే తన ఉక్రోషం ఆపుకోలేక అసెంబ్లీలో నలుగురు నలుగురు పెళ్ళాలంటూ అసభ్యంగా మాట్లాడాడు

వీసారెడ్డి అయితే ప్యాకేజీ అంటూ ప్రచారం మొదలెట్టాడు
(15/22)

ఏ ఆధారాలతో ప్యాకేజీ అంటున్నారు అని వీసా రెడ్డిని ఒక మీటింగులో విలేఖరి అడిగారు.

ఖంగుతిన్న సాయిరెడ్డి ఆధారాలు లేవని ఒప్పుకుంటూనే
నిరూపించలేము కానీ మనస్సాక్షి అంటూ నీళ్లు నమిలారు.

ఏదో మూల సంశయంలో వున్న ప్రజలకు దీనితో జగన్ ముఠా విషప్రచారం మీద ఒక అవగాహన వచ్చేసింది. (16/22)

ఓడిపోతే పార్టీని నడపలేడు అనే గట్టి నమ్మకంతో వున్న వైసీపీ అంచనాలని తలక్రిందులు చేస్తూ రోజు రోజుకీ బలపడుతున్న జనసేనని చూస్తే వైసీపీ భయపడుతుంది అనేది అందరికీ అర్ధమైంది.

కేసులు పెట్టి, బూతులు తిట్టీ, దాడులు చేసీ బెదిరించలేరు అనే అవగాహనకి ప్రజలు కూడా వచ్చారు. (17/22)

పాతికేళ్ల ప్రస్థానం అంటున్నాకానీ తన అన్న లాగే పార్టీని మూసేస్తాడేమోనని 2019లో కొన్ని వర్గాలు అనుమానించిన మాట వాస్తవం.

అయితే ఘోర పరాభవం తరువాత కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా ప్రజల తరపున పోరాడడం అన్ని వర్గాలనూ ఆకట్టుకుంది.

జగన్రెడ్డి ముఠాకు ఇది మింగుడు పడని విషయం. (18/22)

కొన్ని నెలల క్రితం తనపై వక్తిగత దాడులు చేస్తే చంద్రబాబు అంతటి టాల్ లీడర్ పబ్లిగ్గా ఏడవడం, అంతకన్నా దారుణంగా దాడులు చేస్తే పవన్ చెప్పు తీసుకుని కొడతా అని తిరగబడడంతో ప్రజలలో కూడా జగన్ అరాచకాలని ఎదుర్కోవడానికి పవనే సమర్ధుడు అనే నమ్మకం బలపడింది. (19/22)

#WhyJaganHatesPawan

కొరకరాని కొయ్యలా తయారై తన అస్తిత్వానికే ఎసరు పెడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే నిలువెల్లా ద్వేషం వుండడం సహజమే.

ప్రతీ మీటింగులోనూ చంద్రబాబు గారు, ఆయన దత్తపుత్రుడు అని కావాలని తగ్గించి చులకన గా మాట్లాడడానికి అంతర్లీనంగా వున్న భయమే కారణం. (20/22)

ఈ రకమైన ద్వేషం, అసూయలతో దిగజారి జగన్ & కో చేస్తున్న అసభ్య వాఖ్యలు, వెకిలి చేష్టలు జనాలు గమనిస్తున్నారు.

వైజాగ్లో పవన్ ని అడ్డుకోవడానికి 5000 పోలీసులను పారామిలిటరీని మోహరించండం వంటి విపరీత చేష్టలకు జగన్రెడ్డి భారీ మూల్యం చెల్లించబోతున్నాడన్నది ప్రజల్లో వినిపిస్తున్న మాట. (21/22)

పవన్ ని చులకన చేస్తున్నాను అనుకుంటున్నారే కానీ ప్రజల్లో తానే చులకన అవుతున్నాను అనే విషయం గ్రహించలేకపోతున్నారు జగన్రెడ్డి.

వైసీపీ నాయకులకి విషయం అర్ధమవుతున్నా ఆయనకి చెప్పే సాహసం చేయలేరు. (22/22)

#WhyJaganHatesPawan

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling