JanaSena Party Profile picture
Official Twitter Handle - JanaSena Party

Nov 14, 2022, 14 tweets

"చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి" అని చాలా బాగా చెప్పారు ముఖ్యమంత్రి గారు.

నిజంగా ఉన్నత ప్రమాణాలతో విద్యని అందించడమే మీ లక్ష్యం అయితే మరి మీ పాలనలో విద్యావ్యవస్థకి ఈ దుస్థితి ఎందుకు?

Thread - వైసీపీ పాలనలో వెనుక'బడి'న విద్యావ్యవస్థ:

#ChildrensDay

జగన్ గారు అధికారంలోకి వచ్చాక క్రమంగా తగ్గుతూ వస్తున్న పాఠశాలల సంఖ్య. కోవిడ్ ద్య్రష్ట్యా పాఠశాలలు పెంచాల్సింది పోయి, వేల పాఠశాలలని విలీనం చేసి తద్వారా పాఠశాలలు మూతబడేలా చేయడమే కాకుండా, విద్యార్థులకి చదువుని దూరం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది.

దశాబ్దాలుగా విద్యను బోధిస్తున్న ఎయిడెడ్ పాఠశాలల దుస్థితి. 2019-20లో 2,234గా ఉన్న సంఖ్య 2021-22 నాటికి 1,542కి పడిపోయాయి. ఉపాధ్యాయుల సంఖ్య 7,616 నుండి 6,146 కి పడిపోయింది.

భారీగా తగ్గిన ప్రీ-ప్రైమరీ, అంగన్వాడీ కేంద్రాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు.

ప్రీ-ప్రైమరీ స్థాయిలో దారుణంగా విద్యార్థుల నమోదు. నూతన విద్యావిధానంలో ముఖ్యంగా భావించిన ప్రీ-ప్రైమరీ విద్యలో 2020-21లో 2,02,338గా ఉన్న విద్యార్థుల సంఖ్య, 2021-22 నాటికి 62% తగ్గి 77,391కి పడిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు 2020-21లో 44,256 కాగా 2021-22లో 4,588కి తగ్గింది.

అదే ప్రీ-ప్రైమరీ స్థాయిలో బాలుర, బాలికల తగ్గుదల గణనీయంగా ఉంది. 2020-21లో 1,07,157గా ఉన్న బాలుర నమోదు, 2021-22 నాటికి 41,948కి పడిపోయింది. బాలికల నమోదు 95,181 నుండి 35,443 కి పడిపోయింది.

కోవిడ్ కారణంగా బడులకి దూరం అయిన విద్యార్థులని బడులకి తిరిగి తీసుకురాలేకపోయిన జగన్ మానసపుత్రిక "అమ్మ ఒడి"

ప్రభుత్వంలోకి రాగానే మెగా డిఎస్సీ, ఉపాధ్యాయ నియామకాలు చేస్తాం అని చెప్పిన జగన్, దానిని విస్మరించారు. ప్రాథమిక పాఠశాలల్లో 39,000 పోస్ట్లు, ఉన్నత పాఠశాలల్లో 11,888 పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. ఒక పక్క టీచర్లు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదు?

భర్తీ చేయకపోవడం వల్ల ఉపాధ్యాయ: విద్యార్థి నిష్పత్తి ఆందోళనకరంగా ఉంది. అయినా ఈ ప్రభుత్వం "సమూల మార్పులు" అని ఊదరకొడుతుంది.

2,25,000 మంది విద్యార్థులు చదువుకు దూరం అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 'జగన్ మామయ్యా..' అని పిలిపించుకుని విద్యార్థుల చేత కచేరీలు పెట్టించుకునే మీకు, వారి సమస్యలు పట్టవా?

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే చదువుకు దూరం అయిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. 175 స్థానాలు గెలవాలి అని చెప్పే మీకు మీ సొంత జిల్లాలో అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కనపడదా? ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించలేని ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల నిర్వహణ తీసుకుంటుందా?

నూతన విద్యా విధానంలో ముఖ్యమైన వ్రృత్తి విద్యా కోర్సుల విషయంలో వైసిపీ ప్రభుత్వం నిర్లక్ష్యం. గతంలో 10 ఉన్న కోర్సులను ఇప్పుడు కేవలం 4కే పరిమితం చేసారు. 6,156 ఉన్నత పాఠశాలల్లో కేవలం 232 పాఠశాలల్లో మాత్రమే కోర్సులు అందిస్తున్నాయి. దీనికి ముఖ్యమంత్రి దగ్గర సమాధానం ఉందా?

ప్రభుత్వం ఒక పక్క నాడు-నేడు సమూల మార్పులు అని ఊదరకొడుతూ ఇంకోపక్క కనీసం మరుగుదొడ్లు కూడా కల్పించలేని పరిస్థితిలో ఉంది. 8464 బడులలో బాలురకు, 1951 బడులలో బాలికలకు మరుగుదొడ్ల సదుపాయం లేదు. అమ్మ ఒడిలో ₹1000 కోత విధించి ఏం చేస్తున్నారు? మరుగుదొడ్ల బాధ్యత కూడా ప్రజల మీద భారమేనా?

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling