సీమ సిత్రాలు

తిరుమల తిరుపతి దేవస్థానములు - సంగీత సామ్రాజ్ఞి ఎం. యెస్. సుబ్బలక్ష్మి

శంఖులో పోస్తేనే తీర్థం అంటారు. ఎటువంటి కీర్తన అయినా ఏ కృతి అయినా ఎం. యెస్. సుబ్బలక్ష్మి గారి గొంతుతో పడితేనే వాటికి సంపూర్ణ దైవత్వం అలవడుతుందని చాలామంది నమ్మకం.
1/n #TTD #Tirumala #Tirupati
నేను కేవలం ఈ దేశానికే ప్రధానిని, సుబ్బలక్ష్మి సంగీత సామ్రాజ్యానికే సామ్రాజ్ఞి అని నెహ్రు గారు ఒక సందర్భంలో అన్నారు. అంతటి విదుషీమణి ఎం. యెస్. సుబ్బలక్ష్మి. వారి భర్త సదాశివం. జన్మతః తమిళురాలు అయిన సుబ్బలక్ష్మి గారికి తిరుపతి తిరుమల దేవస్థానములతో అవినాభావ సంబంధం ఉంది.
2/n
వృద్ధాప్యంలో సుబ్బలక్ష్మి, సదాశివం దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఎలాగైనా ఆదుకోవాలని కంచి కామకోటి అప్పటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి (మహా పెరియవార్) అప్పటి తితిదే కార్యనిర్వాహక అధికారి (EO) PVRK ప్రసాద్ గారికి ఒక టెలిగ్రామ్ పంపుతారు.
3/n
సుబ్బలక్ష్మి దంపతులు సరే అంటే వారికి విరాళాలు ఇచ్చేవారికి కొదవ ఉండదు. కానీ ఆత్మగౌరవం కలిగిన ఆ దంపతులు అందుకు ససేమిరా ఒప్పుకోరు. అప్పటికే సుబ్బలక్ష్మి గారు తితిదే ఆస్థాన విద్వాన్ గా ఉన్నందున, ఆ పదవికి ఇవ్వాల్సిన పారితోషకం, సదుపాయాలు అప్పటికే ఇస్తూ ఉండటం మూలాన -
4/n
ఇప్పటికిప్పుడు సుబ్బలక్ష్మి గారికి తితిదే చేయగలిగినది ఏమీ లేదని ప్రసాద్ గారికి అధికారులు తెలియచేసారు. ఆ శ్రీవారి దయతో ప్రసాద్ గారికి ఒక లోచన తట్టింది. అన్నమాచార్య కీర్తనలను సుబ్బలక్ష్మిగారితో పాడించి వాటిని అమ్మటం ద్వారా అన్నమాచార్య కీర్తనలను జనబాహుళ్యంలోకి తెచ్చేవిధంగాను -
5/n
ఆ పాటలు పాడినందుకు సుబ్బలక్ష్మి కుటుంబానికి పారితోషికం మరియు రాయల్టీ ఇచ్చే ఉభయతారకమైన ఆలోచన అది. తిరుమల శ్రీవారి చిత్రపటం తీసుకుని ప్రసాద్ గారు,ఇతర అధికారులు నాటి మద్రాసులోని సుబ్బలక్ష్మి, సదాశివం గార్ల అద్దె ఇంటికి వెళ్లి వారి ఆలోచన మొదట సదాశివంగారితో పంచుకున్నారు.
6/n
సుబ్బలక్ష్మిగారు జన్తమతః తమిళులు. కర్ణాటక సంగీత విద్వాంసులకు త్యాగరాజ పంచరత్న కృతులు,ఇతర త్యాగరాజ కృతుల రూపంలో తెలుగు కీర్తనలు కొత్తకాదు కానీ,అన్నమాచార్య కీర్తనలు తెలుగువారికి మినహా తక్కిన భాషా విద్వాంసులకు పెద్దగా పరిచయం లేని రోజులవి. అప్పటికే సుబ్బలక్ష్మి గారి వయసు 63 ఏళ్లు
7/n
ఈ కారణంగా సదాశివంగారు ఆ వయసులో సుబ్బలక్ష్మి గారికి శుద్ధ తెనుగులో ఉన్న అన్నమాచార్య కీర్తనలను నేర్చుకుని, అవగాహన చేసుకుని, ఉచ్చారణ దోషాలు, తప్పులు లేకుండాపాడటం శ్రమతో కూడుకున్న పనే కాక ఆరోగ్యపరంగా అంత మంచిది కాదని భావించి తితిదే వారి ప్రతిపాదన సున్నితంగా తిరస్కరించారు.
8/n
అదే సమయంలో అక్కడకు వచ్చిన సుబ్బలక్ష్మిగారు తన్మయత్వంతో స్వామీ! నన్ను ఆశీర్వదించడానికి నీవే ఇంత దూరం వచ్చావా అని శ్రీవారి చిత్రపటానికి నమస్కరించి, తితిదే అధికారులను వచ్చిన విషయం అడిగి వారి ప్రతిపాతదనకు సంతోషంగా అంగీకరించారు.
9/n
అయితే అన్నమాచార్య కీర్తనలను పాడటం శ్రీవారి సేవగా భావించిన సుబ్బలక్ష్మి అమ్మ తితిదే ఇవ్వజూపిన పారితోషకం తీసుకోవడానికి ఒప్పుకోలేదు. ప్రసాద్ గారు, ఈ కీర్తనల ఆల్బమ్ భక్తులకు అమ్మటం ద్వారా తితిదేకు ఎంతో ఆదాయం సమకూరుతుందని చెప్పి ఒప్పించారు.ఆ ఆల్బమే బాలాజీ పంచరత్న మాల (5 భాగాలు )
10/n
“కౌసల్యా సుప్రజా రామా” అంటూ ప్రతిరోజూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని నిద్రలేపే ప్రతివాద భయంకర శ్రీ అనంతాచార్య విరచిత శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని సుబ్బలక్ష్మి అమ్మ మరియు వారి కుమార్తె రాధా 1963 జూన్ 21న గ్రామఫోన్ కంపెనీ అఫ్ ఇండియా(నేటి సరిగమ ఇండియా)వారి కోసం రికార్డు చేశారు.11/n
తితిదే సుబ్బలక్ష్మి గారిని 1975లో శాశ్వత ఆస్థాన విద్వాన్ గా నియమించటం జరిగింది.

బాలాజీ పంచరత్న మాల మొదటి భాగం 1980వ సంవత్సరంలో విడుదలైనది

1998లో సుబ్బలక్ష్మి అమ్మను కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. (సంగీతం/కళలు రంగంలో మొదటి భారతరత్న సుబ్బలక్ష్మి గారు)
12/n
2006 మే 28న తిరుపతిలోని పూర్ణకుంభం సర్కిల్ లో సుబ్బలక్ష్మి గారి కాంస్య విగ్రహం నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆవిష్కరించటం జరిగింది (ఈ నాటికీ సుబ్బలక్ష్మిగారి కాంస్య విగ్రహం దేశం మొత్తంలో కేవలం తిరుపతిలో మాత్రమే ఉంది. వారు పుట్టిన మదురైలో కూడా లేదు )
13/n
*ఈ వృత్తాంతాన్ని నాటి తితిదే కార్యనిర్వాహక అధికారి PVRK ప్రసాద్ గారు అయన రచించిన నాహం కర్తా అనే పుస్తకంలో విపులంగా రాశారు
చిత్రం : నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా విడుదల అవుతున్న సుబ్బలక్ష్మి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనల LP రికార్డులు
14/14
మూలాలు:
thehindu.com/entertainment/…
thehindubusinessline.com/2004/12/15/sto…
(Subbulakshmi's voice still bestseller for Saregama by Sriram Srinivasan)
thehindu.com/news/cities/Ma…
images courtesy : Google, Wikipedia, Respective Websites
Missing some Tweet in this thread?
You can try to force a refresh.

Like this thread? Get email updates or save it to PDF!

Subscribe to రాయలసీమ ~ Rayalaseema
Profile picture

Get real-time email alerts when new unrolls are available from this author!

This content may be removed anytime!

Twitter may remove this content at anytime, convert it as a PDF, save and print for later use!

Try unrolling a thread yourself!

how to unroll video

1) Follow Thread Reader App on Twitter so you can easily mention us!

2) Go to a Twitter thread (series of Tweets by the same owner) and mention us with a keyword "unroll" @threadreaderapp unroll

You can practice here first or read more on our help page!

Follow Us on Twitter!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just three indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!