సొంత వాహనాల్లో ప్రయాణం చేసే మిత్రులందరికీ ఒక 4 జాగ్రత్తలు*
* బ్రేకులు చక్రాలకే గాని కారుకు కాదు. 70-80 కిలోమీటర్ల లోపు అయితే, సడెన్ బ్రేకేస్తే కారు ఆగుతుంది. కానీ అంతకు మించితే బ్రేకు వల్ల ఉపయోగం లేదు.
* ప్రమాదాలు ఎవరూ ఆపలేరు గాని... మరీ ఆగిఉన్న లారీలను ఢీకొట్టడం మాత్రం కచ్చితంగా స్వయంకృతాపరాధమే.
డ్రైవింగ్‌లో జాగ్రత్త లేనపుడు మాత్రమే ఇది జరుగుతుంది.
* మీరు హర్టయినా పర్లేదు గాని.. మీరేమీ ప్రధాని కాదు, సీఎం కాదు.. మీరు కొంచెం లేటెల్తే ఎవరి కొంపలేం మునిగిపోవు. పైగా మీ కొంప మునిగిపోయే అవకాశాలే ఎక్కువ. స్పీడు 160 దాకా కూడా వెళ్లొచ్చు.
కానీ స్ట్రెయిట్ హైవేలు కానపుడు 80 కి.మీ. కంటే, రాత్రి ప్రయాణములలో80-100 కంటే ఎక్కువ స్పీడు కచ్చితంగా ప్రమాదకరం.
అయినా రాత్రిపూట సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ అర్జెంటుగా మీరు ఉద్దరించాల్సిందేంటో ఆలోచించాలి.
*రిస్కు.*
*వ్యాపార ములో చేస్తే డబ్బులు పోతాయి*
*రోడ్ల మీద చేస్తే ప్రాణములు పోతాయి*
*మీరు లేకుంటేమిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు పడే బాధను ఊహించి జాగ్రత్త గా డ్రైవ్ చేయండి*
జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ద్వారా మన ప్రాణములను నిలుపుకుందాం...
ఎదుట వచ్చే వారి ప్రాణమునకు హామీ ఇద్దాం......
వేగం వద్దు....ప్రాణం ముద్దు
నిదానమే ప్రదానం అని ఊరికే అనలేదు భయ్యా, ఆలోచించండి, ఆచరించండి.. ☝☝
80Kmph స్పీడ్ కి 100-120kmph స్పీడ్ కి మధ్య తేడా కేవలం 10 నిమిషాలు మాత్రమే లేటయితే పోయేది ఏమీ లేదు, కానీ తొందర పడితే పోయేది కొన్ని జీవితాలు...
ఇట్లు --మీ
శ్రేయోభిలాషి .
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ"? ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుశలమడిగింది.
"నేను బావున్నానమ్మా! నువ్వెలా వున్నావు?"
"నేనూ బాగున్నానండీ! అత్తయ్య గారూ! మా అమ్మ నేనూ చీరలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళుతున్నామండీ! ఆషాడమాసం కదా చీరలకి
డిస్కౌంట్ పెట్టారు. మీకు కూడా చీర కొందామను కుంటున్నాను. మీకు ఎలాంటి చీర కొనమంటారు ?"
"అలాగా! మంచిదమ్మా! నాకు షాపింగ్ కు వెళ్లే శ్రమ తగ్గించావు. నువ్వు అడిగావు కాబట్టి చెపుతున్నాను. చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాఇష్టాలు చెపుతాను. దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చేయమ్మా.
అందరూ ఆ చీర చూసి ఆహా! ఓహో! అనాలి. ఏ షాప్ లో కొన్నారు ? 'ఏ కాలేజీలో చదువు తున్నారు' ? అనే లెవెల్ లో ఉండాలి.
చీర మరీ ఎక్కువ ఖరీదు వుండకూడదు. ఎందుకంటే, అంత ఖరీదైన చీర కట్టుకుని బిగుసుకుపోయి, జీవితంలో మొట్ట మొదటి సారి ఫొటో తీయించుకునే వాళ్ల లాగా, ఎక్కడ కూర్చుంటే ఏమి అంటుకుంటుందో
@ _సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._
@ _కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు.
ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు.. గుర్తుంచుకో!_
@ _'జ్ఞానం'.. ఆలోచించి మాట్లాడుతుంది. 'అజ్ఞానం'.. మాట జారాక ఆలోచిస్తుంది.
_వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది._
_అయిదు విధాల ‘శాంతి’ లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు._
_‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. *‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’* అన్నారు స్వామి వివేకానంద._
_మౌనం మూడు రకాలు._ 1. _*ఒకటవది: వాక్‌మౌనం.* వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు.
ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి._ 2. _*రెండోది అక్షమౌనం.* అంటే ఇంద్రియాలను నిగ్రహించడం._
3. _*మూడోది కాష్ఠమౌనం*. దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది.
పని చేయని వాడు
సోమరిపోతనేది పాతమాట..
ఇప్పుడు వాడే
సర్కారు ముద్దుబిడ్డ..
వాడికి తెల్ల కార్డిచ్చి
దానికి జతగా
బోలెడు స్కీములిచ్చి
ఆపై పించనిచ్చి
సోమరిపోతును
సొమ్మరిపోతుగా
తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం..
ఓటుమారి స్కీములు
దండగమారి స్కాములు..
వారు వీరు అంతా
స్వాహాస్వాములు..!
నిజానికి మన వ్యవస్థలే
సోమరిపోతుల
కర్మాగారాలు..
ఎవరికి ఎప్పుడు
ఏమిస్తాయో తెలియదు..
కులవృత్తులను
సబ్సిడీలకు
అనుకూలవృత్తులుగా మార్చి
పంచేస్తున్నాయి సొమ్ములు..
పెంచేస్తున్నాయి అప్పులు..
ప్రతి కులానికి
ఓ కార్పొరేషన్..
డబ్బులు పంచడం..
పంచుకోడమే
వాటి మిషన్..
*_ఇదో రకం వైరల్ ట్రాన్స్మిషన్..!_*
అన్నామంటే
అన్నామంటారు గాని
ఎవడికైనా ఏదైనా
ఎందుకివ్వాలి ప్రభుత్వం..
ఎవడిని వాడు
పోషించుకోలేడా ఏమి..
కుదిరితే ఉద్యోగమివ్వు..
శ్రమ పడి పరిశ్రమ పెడతానంటే..
బుర్ర పెట్టి వ్యాపారం
చేస్తానంటే అప్పివ్వు..
ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిద గుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం...
వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ళ అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు.
1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో