ఒక్కసారి చదవండి
Please
అతనికి తన జీవితం ఒక కల...
27 సంవత్సరాలకే ఎంతో పేరు, ప్రతిష్టలు, ధనం సంపాదించిన ఆ వ్యక్తికి క్యాన్సర్ కారణంగా రోజులు లెక్కబెడుతూ మరణాన్ని చేరుకోవలసిన పరిస్థితి:
అతని పేరు అమిత్ వైద్య. గుజరాతి. US లోనే పుట్టి పెరిగాడు. Ph.D ఎకనామిక్స్.
entertainment industry’s business department లో ఉద్యోగం.
‘నేను చురుకైన వ్యక్తినే కాని నా జీవితమంత ఆరోగ్యకరమైన రీతిలో వున్నది కాదు’ అని అమిత్ చెప్పేవాడు.
తన జీవితమంతా కలతలు, విషాదాలతోనే ఎక్కువ నిండివుండేవి. ఎప్పుడయితే తన తండ్రి క్యాన్సర్ కారణంగా చనిపోయారో అప్పటినుండి.
‘నేను నా 27వ ఏట ఉన్నతమైన జీవితంలో వున్నప్పుడు కలిగిన పెద్ద పతనం’ అని అమిత్ చెప్పాడు. తన తండ్రికి సుమారు రెండేళ్లు అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అతను చనిపోయారు. ఆ తదుపరి తన తల్లికి కూడా క్యాన్సర్. తండ్రి ఎడబాటుకి రెండు నెలల గడువులోనే తల్లి అకాలమరణం
అమిత్ ను తీరని విషాదంలోకి నెట్టేశాయి.
‘స్వదేశానికి చాలా దూరంగా బ్రతుకుతున్న నాకు ఇప్పుడు ఒంటరితనం మరింత భారంగా మారింది. ఎందుకంటే నాకు కూడా క్యాన్సర్ వుంది. 18 నెలల క్రితం చేసిన పరీక్షలు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ లివర్ కు చేరింది. 9 నెలల తరువాత వచ్చిన రిపోర్టుల్లో 2011 లో
క్యాన్సర్ ఊపిరితిత్తులకు వ్యాపించింది’ అంటూ అమిత్ చాలా విచారకంగా తన బాధల్ని ఒకానొక సందర్భంలో వెల్లడించారు.
డాక్టర్స్ చాలా తక్కువ రోజులు మాత్రమే అమిత్ జీవించడానికి అవకాశాలు వున్నాయని తెలిపారు.
‘నేను నా జీవితంలో ఎవ్వరికీ ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాను.
నా అంతిమ క్రియలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నాను. చావును స్వాగతించడంలో నాకు భయంలేదు. నా తల్లి నా కళ్లెదురుగా మరణించిన తీరు నాకు చావు పట్ల భయంలేకుండా చేసింది. ఇది ఒక సినిమాటిక్ సందర్భంలా అనిపించవచ్చు. కాని నా తల్లిదండ్రులు నాకు దూరమయ్యాక ఇక వున్న ఈ జీవితం పట్ల నాకు ఎటువంటి
ఆసక్తి లేదు’ అని అమిత్ చెప్పాడు.
కాని చనిపోయేముందు ఒక్కసారి భారత్ కు రావాలని నిర్ణయించుకున్నాడు అమిత్. తన తల్లిదండ్రులు భారత్ లో పుట్టి US లో తనువులు చాలించారు. ఇక విదేశంలో పుట్టిన అమిత్ తన స్వదేశంలో చివరి ఊపిరిని వీడాలని నిశ్చయించుకున్నాడు.
భారత్ లో అడుగుపెట్టి అక్కడున్న
బంధువులను కలిశాడు. అప్పటికే తీవ్ర అనారోగ్యం అమిత్ ను వెంటాడుతోంది. శరీరం సహకరించని స్థితి. కాని బంధువులంతా వారి వారి జీవిత సమస్యల్లో వున్నారు. అందుకే చేదోడు లభించలేదు. వారి ఇంటి తలుపులు మూసుకున్నాయి.
‘నేను ఢిల్లీలో వున్నప్పుడు కొన్ని ప్రత్యామ్నాయ ఉపాయాలు చెప్పిన నా స్నేహితుడి
మాటలు నాకు గుర్తుకు వచ్చాక నాక్కూడా జీవించాలనే ఆశ కలిగింది. ఒకావిడ నాకు కేవలం ఒక్క రూపాయి ఖర్చుతో కూడిన ఆయుర్వేద వైద్య విధానాన్ని పరిచయం చేశారు. ఎలాగూ బ్రతుకుతాను అనే నమ్మకంలేదు. కాని పోయే ముందు బతకడానికి ఒక ప్రయత్నంగా ఇది భావించాను’ అని అమిత్ చెప్పాడు.
అక్కడకి అమిత్ చేరుకున్నాక, యోగ, ధ్యానం వంటివి సాధన చేసాడు. ప్రతి రోజూ ఆవు పాలు, పెరుగు, గోసంబంధిత ఇతర పదార్థాలను సేవించేవాడు. గోమూత్రమును కూడా తన మెడికేషన్ లో భాగంగా వాడాడు. అది కూడా పరగడుపున. ఇంతకు ముందు చేదు ఇంగ్లీష్ ఔషధాలు వాడిన అతనికి ఇక్కడ గోసంబంధిత పదార్థాలు పెద్దగా ఇబ్బంది
పెట్టలేదు. ఏదో విశ్వాసంతో చేసిన ఈ పని అతడికి పెద్దగా ఫలితం ఇచ్చినట్టు కనిపించకపోయినా అతడు నిరాశపడలేదు.
అయితే కొన్ని రోజలు తరువాత స్కానింగ్ రిపోర్టులు వచ్చాయి. అందులో క్యాన్యర్ వ్యాప్తి నిరోధించబడినట్లు తేలింది. ఇంకో 40 రోజులు అదనంగా ఆయుష్షు పెరిగిందని డాక్టర్లు అంచనా వేశారు.
అంతేకాదు అప్పటి వరకు వున్నక్యాన్సర్ కూడా తగ్గుతుందని తేలింది. అంతే అదే గో సంబంథిత ఔషధాలను అమిత్ కొనసాగించాడు. అక్కడే ఒక రైతును ఆశ్రయించి ఒక ఇల్లు తీసుకుని, గోశాల కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అందులో దేశీయ ఆవులను పెంచాడు. ఆ గ్రామస్తులు అతనికి బాగా సహకరించారు.
18 నెలలు గడిచాయి. ఎందరో డాక్టర్లు బ్రతికించలేని తనను ఒక గోవు బ్రతికించింది. తన అంత్యక్రియలను ముందుగానే ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఈ రోజు పూర్తి ఆరోగ్యంతో జీవిస్తున్నాడు. అంతేకాదు తనలాగా క్యాన్సర్ బాధితులకు స్వయం సేవలను అందిస్తున్నాడు. అక్కడా అంతా ఉచితమే.
ఆయన స్థాపించిన NGO పేరే “హీలింగ్ వైద్య”.
అతను తిరిగి మళ్లీ US వెళ్లలేదు.
‘భరతమాత, గోమాత నాకు చాలా ఇచ్చాయి. నేను ఇక్కడే వుండాలి’ అని అమిత్ చాలా గర్వంగా చెబుతారు.
అమిత్ రాసిన పుస్తకం Holy Cancer – How A Cow Saved My Life లో చాలా విషయాలు రాశాడు.
ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఒక్క గోవు వుంటేనే క్యాన్సర్ లాంటి మహమ్మారి జయించాడు అమిత్. మరి దేశంలో ప్రతి ఇంటికి గోమాత ఆశీర్వాదం వుంటే ఈ భారత్ ఆరోగ్య భారత్, ఐశ్వర్య భారత్ గా మారుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ"? ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుశలమడిగింది.
"నేను బావున్నానమ్మా! నువ్వెలా వున్నావు?"
"నేనూ బాగున్నానండీ! అత్తయ్య గారూ! మా అమ్మ నేనూ చీరలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళుతున్నామండీ! ఆషాడమాసం కదా చీరలకి
డిస్కౌంట్ పెట్టారు. మీకు కూడా చీర కొందామను కుంటున్నాను. మీకు ఎలాంటి చీర కొనమంటారు ?"
"అలాగా! మంచిదమ్మా! నాకు షాపింగ్ కు వెళ్లే శ్రమ తగ్గించావు. నువ్వు అడిగావు కాబట్టి చెపుతున్నాను. చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాఇష్టాలు చెపుతాను. దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చేయమ్మా.
అందరూ ఆ చీర చూసి ఆహా! ఓహో! అనాలి. ఏ షాప్ లో కొన్నారు ? 'ఏ కాలేజీలో చదువు తున్నారు' ? అనే లెవెల్ లో ఉండాలి.
చీర మరీ ఎక్కువ ఖరీదు వుండకూడదు. ఎందుకంటే, అంత ఖరీదైన చీర కట్టుకుని బిగుసుకుపోయి, జీవితంలో మొట్ట మొదటి సారి ఫొటో తీయించుకునే వాళ్ల లాగా, ఎక్కడ కూర్చుంటే ఏమి అంటుకుంటుందో
@ _సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._
@ _కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు.
ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు.. గుర్తుంచుకో!_
@ _'జ్ఞానం'.. ఆలోచించి మాట్లాడుతుంది. 'అజ్ఞానం'.. మాట జారాక ఆలోచిస్తుంది.
_వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది._
_అయిదు విధాల ‘శాంతి’ లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు._
_‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. *‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’* అన్నారు స్వామి వివేకానంద._
_మౌనం మూడు రకాలు._ 1. _*ఒకటవది: వాక్‌మౌనం.* వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు.
ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి._ 2. _*రెండోది అక్షమౌనం.* అంటే ఇంద్రియాలను నిగ్రహించడం._
3. _*మూడోది కాష్ఠమౌనం*. దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది.
పని చేయని వాడు
సోమరిపోతనేది పాతమాట..
ఇప్పుడు వాడే
సర్కారు ముద్దుబిడ్డ..
వాడికి తెల్ల కార్డిచ్చి
దానికి జతగా
బోలెడు స్కీములిచ్చి
ఆపై పించనిచ్చి
సోమరిపోతును
సొమ్మరిపోతుగా
తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం..
ఓటుమారి స్కీములు
దండగమారి స్కాములు..
వారు వీరు అంతా
స్వాహాస్వాములు..!
నిజానికి మన వ్యవస్థలే
సోమరిపోతుల
కర్మాగారాలు..
ఎవరికి ఎప్పుడు
ఏమిస్తాయో తెలియదు..
కులవృత్తులను
సబ్సిడీలకు
అనుకూలవృత్తులుగా మార్చి
పంచేస్తున్నాయి సొమ్ములు..
పెంచేస్తున్నాయి అప్పులు..
ప్రతి కులానికి
ఓ కార్పొరేషన్..
డబ్బులు పంచడం..
పంచుకోడమే
వాటి మిషన్..
*_ఇదో రకం వైరల్ ట్రాన్స్మిషన్..!_*
అన్నామంటే
అన్నామంటారు గాని
ఎవడికైనా ఏదైనా
ఎందుకివ్వాలి ప్రభుత్వం..
ఎవడిని వాడు
పోషించుకోలేడా ఏమి..
కుదిరితే ఉద్యోగమివ్వు..
శ్రమ పడి పరిశ్రమ పెడతానంటే..
బుర్ర పెట్టి వ్యాపారం
చేస్తానంటే అప్పివ్వు..
ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిద గుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం...
వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ళ అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు.
1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో