కార్తీక మాసంలో శు|| విదియ నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక "అన్నా చెల్లెలు పండుగ" అంటారు.
ఈ సంవత్సరం 29-10-2019 మంగళవారం వచ్చినది.
ఈ పండుగ వృత్తాంతం తెలుసుకుందాం!
వారిపేర్లు"యమధర్మరాజు&యమున".యమునకు అన్నగారు అనగా విపరీతమైన అభిమానం. అమె అన్నగారు "యమధర్మరాజు" గారిని ఎన్నో సార్లు తన ఇంటికి భోజనము నకు రమ్మని పిలిచేది. కాని ఆయనకు తీరిక ఉండేది కాదు. యమలోకంలో పాపులను శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు.
చెల్లెలు యమున సంతోషంగా అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలు వండి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. యమధర్మరాజు త్రుప్తిగా భోజనము చేసి చెల్లెలు తో ప్రేమగా చెల్లీ నాకు ఇషమైన పదార్థములు తో భోజనము పెట్టావు.
అని చెల్లెలు ను దీవించి వెళ్ళాడు. అనగా రేపటి రోజున అక్క & చెల్లెలు చేతివంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపముృత్యు దోషములను ఉండవు.
ఇది పెద్దలు చెప్పిన వృత్తాంతం
అంతరించిపోతున్న కుటుంబ వ్యవస్థకు, ఇటువంటి పండుగలు పునాదులు. ప్రశ్నించడం మానేసి ఆచరిస్తే, కుటుంబ బంధాలు పెరుగుతాయి!
#భగినీహస్తభోజనం