వ్యాపార విషయగణన విశ్లేషకుడు, తెలుగు భాష, అమ్మ, భారతదేశం-వసుదైక కుటుంబం
🇮🇳🇱🇰🇬🇧🇵🇱🇧🇪🇿🇦🇺🇲🇨🇦
2 subscribed
Jul 31 • 6 tweets • 2 min read
Big News 🗞️
#Ransomware attack forces hundreds of small Indian #banks offline, sources say reuters.com/technology/cyb…
A ransomware attack on a technology service provider has temporarily shut down payment systems at nearly 300 small Indian local banks, according to two sources familiar with the situation.
Jul 20, 2022 • 8 tweets • 2 min read
ఈ రోజు వంట.. జీఎస్టీ బిర్యానీ.!
...
హాయ్.. మధ్యాహ్నం వంటల కార్యక్రమానికి స్వాగతం.. ఈ రోజు హైదరాబాదీ చికెన్ జీఎస్టీ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో తెల్సుకుందాం..
ముందుగా 12 శాతం జీఎస్టీ పెట్టి కొన్న స్టీల్ పాత్రలో.. 5 శాతం జీఎస్టీ వేసిన ప్యాకేజ్డ్ చికెన్ ఒక కేజి తీసుకోవాలి.
అందులో 5 శాతం జీఎస్టీ వేసిన పెరుగు, కారం, నిమ్మకాయ, జీఎస్టీ వేసిన అల్లం, జీఎస్టీ వేసిన గరం మసాలా, జీఎస్టీ కట్టి మరీ కొన్న నెయ్యి, ప్రస్తుతానికి జీఎస్టీ లేని ఉల్లిగడ్డ ముక్కల ప్రై వేసి కలుపుకోవాలి. దాన్ని 28 శాతం జీఎస్టీ పెట్టి కొన్న రిఫ్రిజిరేటర్‌లో పెట్టండి.
Feb 19, 2022 • 9 tweets • 1 min read
చాణుక్యుడు తల్లిదండ్రులు పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. ముఖ్యంగా పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తూ కొన్ని అంశాలను సూచించాడు.
భాష:
పిల్లలకు తల్లిదండ్రులు మొదటి గురువులు. వారిని చూసి పిల్లలు అనేక విషయాలను నేర్చుకుంటారు. మీ పిల్లలు మర్యాదపూర్వకంగా, సంస్కారవంతులుగా ఉండాలని మీరు కోరుకుంటే, మొదట చేయవలసినది వారి భాషను మెరుగుపరచడం.
Jan 3, 2021 • 6 tweets • 2 min read
Something Interesting to share
Way back in 1937, two young long-haired women in saris stepped into a small photo studio in Madras. They changed into striped pyjama suits and struck a pose in front of the studio camera.
One of them leaned languidly against a chair, while the other’s eyes focused on something outside the frame. Both of them held cigarettes perhaps just 4 d thrill of it .
That’s world-renowned Carnatic vocalist MS Subbulakshmi and the legendary Bharatanatyam dancer Balasaraswati.
Jun 28, 2020 • 17 tweets • 2 min read
🍁నవ గోప్యములనానేమి?🍁
వివరణ!
నవ గోప్యములనగా ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, అవమానం అనే ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.
👉భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి మాత్రమే ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు.
Jun 6, 2020 • 14 tweets • 3 min read
భాగవతోత్తములు శ్రీ నమ్మాళ్వార్ విశిష్టత
ఈరోజు నమ్మళ్వార్ తిరునక్షత్రమ్ (జయంతి)
నమ్మాళ్వార్ అంటే ఎవరు?
దేవాలయాల్లో శఠగోపం ఎందుకు ఇస్తారు?
కలియుగం ఆరంభమైన 42 వ రోజున ఒక మహానుభావుడు అవతరించాడు. అంటే సుమారు 5100 సంవత్సరాల క్రితం అన్న మాట.
కారిమారులనే దంపతులకు భగవత్ ప్రార్థన చేస్తే ఒక చిన్న శిశువు పుట్టింది. ఆ శిశువు పుట్టగానే మాట లేదు, కదలిక లేదు, ఎట్లాంటి స్పందన లేదు. ఆ పిల్లవాడు పాపం ఆహారం ముట్టడం లేదు, ఆ పిల్లవాడి ప్రవృత్తి ఏం పనికి వచ్చేలా లేదు. తల్లి తండ్రులకు ఏంతోచక ఆళ్వారు తిరునగరి అనే ఊరి దేవాలయం వద్ద
Feb 10, 2020 • 31 tweets • 5 min read
ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉంది.
ప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశసేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు.
దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు.
కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశసేవల గురించి అద్భుతమైన వివరణ ఉంది.
Jan 7, 2020 • 9 tweets • 2 min read
ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు..
అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు.
భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది.
తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు.
దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు.
భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు.
దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.
బ్రాహ్మణుడు భయపడి 'నా దగ్గర ఏమీ లేదు ' అని అన్నారు.
దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు.
Jan 6, 2020 • 13 tweets • 4 min read
ముక్కోటి ఏకాదశి
తేది 06-01-2020 సోమవారం
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.
Dec 21, 2019 • 12 tweets • 2 min read
ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....
నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి.
1. జీవితం లో అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు. 2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.
3.నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుంది.
ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....
Dec 17, 2019 • 11 tweets • 2 min read
"కూతురి ప్రేమ"
పెద్ద శ్రీమంతుల ఇంట్లో ఇంటి యజమాని చనిపోయారు చాలా మంది బంధుమిత్రులు ఇంటికి చేరారు. ఇంట్లో అందరూ శోక సాగరంలో మునిగి పోయారు,భార్య,నలుగురు మగ పిల్లలు ఒక ఆడపిల్ల,భార్యను పిల్లలను కష్టపడి జీవితంలో ఒక మంచి స్థాయికి తెచ్చి న్యాయంగా సంపాదించినదానితోనే పిల్లలందరిని
మంచి ఆస్తి చేసి ఇచ్చాడు. ఆడపిల్లకు మంచి సంబంధం మంచి ఇంటికి ఇచ్చి పెళ్ళి చేశాడు..
మృదు స్వభావం ఆయనది చాలామందికి సహాయం చేసేవాడు.నిజం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి..అన్ని పనులు పూర్తి అయ్యాక శవాన్ని ఎత్తుదాం అనుకునే లోపలే, ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చాడు
Dec 10, 2019 • 21 tweets • 3 min read
కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని.
ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.
తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడి కి వెళ్లాను.
ముగ్గురికి సరిపోయే రవ్వకి ఓ గ్లాసుడెక్కువ నీళ్లు పోస్తే ఐదుగురికి సరిపోయే అద్భుతమేరా ఉప్మా అంటే ..
Oct 24, 2019 • 7 tweets • 1 min read
నీ విలువ|ఒక తండ్రి తాను చనిపోయే ముందు,తన కొడుకుని పిలిచి ఒక గడియారం చూపించి,ఇది 200 సం.పైగా వయస్సు కలిగి, మా తాత ముత్తాతల కాలం నుండి నాకు సంక్రమించింది. అయితే నేను దీనిని నీకు ఇచ్చేముందు ఒకసారి నువ్వు బజారులోని గడియారాల షాప్కి వెళ్లి దీనికి వెల కట్టించుకొని రా అని పంపించాడు.
కొంచెం సేపటికి కొడుకు తిరిగి వచ్చి, ఈ గడియారం బాగా పాతది ఐనది కావున 5 డాలర్లకు మించి రావన్నారు అని చెప్పాడు. అయితే తండ్రి ఈ సారి కొడుకుని అదే గడియారాన్ని ఒక పురాతన వస్తువుల ( యాంటిక్ ) దుకాణానికి పంపి మరలా వెల కట్టించమన్నాడు.
Oct 24, 2019 • 8 tweets • 2 min read
భగినీ హస్త భోజనం!
కార్తీక మాసంలో శు|| విదియ నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక "అన్నా చెల్లెలు పండుగ" అంటారు.
ఈ సంవత్సరం 29-10-2019 మంగళవారం వచ్చినది.
ఈ పండుగ వృత్తాంతం తెలుసుకుందాం!
సూర్య భగవానికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.
వారిపేర్లు"యమధర్మరాజు&యమున".యమునకు అన్నగారు అనగా విపరీతమైన అభిమానం. అమె అన్నగారు "యమధర్మరాజు" గారిని ఎన్నో సార్లు తన ఇంటికి భోజనము నకు రమ్మని పిలిచేది. కాని ఆయనకు తీరిక ఉండేది కాదు. యమలోకంలో పాపులను శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు.
Oct 23, 2019 • 13 tweets • 2 min read
మోహం కధ
ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు..
ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు.
సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని.
మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని," ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !!
వెంటనే ఆ సాధువు " అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.
యజమాని కంగారుపడుతూ." అలా ఎలా కుదురుతుంది ?పిల్లలు చిన్నవాళ్ళు,వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా " అన్నాడు.
పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని ఉండేవారు. ఈ అంబులను గిలకలు అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. మచ్చుకు కొన్ని చూడండి
ప్రారంభంలో పాడే పద్యం :
అనయంబు మేము విద్యాభ్యాసమునకు
అయ్యవారిని చాల ఆశ్రయించితిమి
ఈనాటికిని మహానవమి యేతెంచు
ఈడుజోడగువార మెల్ల బాలురము
గురునకు దక్షిణల్ కోరి యీదలచి
వెరవు తోడ మిమ్ము వేడవచ్చితిమి
పాటించి మా ముద్దు పాటలు వినుడు
మేటి కానుకలిచ్చి మెప్పు పొందరయ్య.