ఉ: పెళ్లిళ్లలోనూ, అర్ధరాత్రి కూటములోనూ పెట్టేది నన్నే అని నువ్ గుర్తుంచుకో..
ఇ: ఏం కాదు.. నను చెయ్యడం ఎంత తేలికనుకున్నావ్.. ?? అందరికీ అందుబాటులో ఉంటాను..
ఇ: ఏం కూశావ్.. ??
ఉ: ఇంకా కూస్తా..చట్నీ లేకపోతే అసలు సహిస్తావా నువ్వు.. పచ్చడో, పంచదారో లేని నీ బోడి మొహాన్ని చూడ్డమే మహాపాపం.. అదే నన్నయితేనా.. యే ఆధరువులూ అక్కర్లేకుండానే ఉఫ్ఫూ ఉఫ్ఫూ అని కళ్లకద్దుకుని మరీ
ఇ: ప్రేమ గురించి నువ్ మాట్లాడుతున్నావా..?? నా పేరు మీద ఇడ్లీఫ్యాక్టరీ అని ఏకంగా బ్రాండే ఉందే ఉప్మా మొఖందానా.