రాధిక Profile picture
ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తీయని రాగం😍
Apr 19 5 tweets 1 min read
(19.04.2022) సంకటహర చతుర్ధి.
చైత్రమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు గణపతిని వికటగణపతిగా పూజించాలని శాస్త్రవచనం. అంతేకాక మంగళవారం కలిసిరావడం అలభ్యయోగం. సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్ధి అంటారు.
నారదమహర్షి చేసిన శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మన జీవితంలో సంకటాలు తొలగిపోతాయి.
శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం
నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం |
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 |
ప్రధమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం |
Apr 17 10 tweets 2 min read
🌿🌼🙏అద్భుతమైన కథ ... పిల్లలకు ఇటువంటి కథలు చెబితే బుద్ధి వికసిస్తుంది, వారు ఆదర్శవంతులవుతారు🙏🌼🌿
🌿🌼🙏ఒక స్వర్ణకారుడి మరణంతో, అతని కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. తినడానికి సరిపడా డబ్బు కూడా వారి వద్ద లేదు. ఒకరోజు అతని భార్య తన కొడుక్కి నీలమణిహారాన్ని ఇచ్చి - Image "నాయనా, దీన్ని మీ మామయ్య దుకాణానికి తీసుకెళ్లు, ఈ హారాన్ని అమ్మి, మనకు కొంత డబ్బు ఇవ్వమని మీ మామయ్యకు చెప్పు", అని అంది.🙏🌼🌿
🌿🌼🙏కొడుకు ఆ హారాన్ని తీసుకుని మేనమామ దుకాణానికి చేరుకున్నాడు. 🙏🌼🌿
🌿🌼🙏మేనమామ ఆ హారాన్ని క్షుణ్ణంగా చూసి - "నాయనా, ప్రస్తుతం మార్కెట్ బాగా
Apr 13 7 tweets 1 min read
🥀పెరుగు🥀

వేసవికాలంలో మనకి చాలా ఉపయోగం
🥀
1. కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని
ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

🥀2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి.
దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. Image దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.

🥀3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి.
దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది.
మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

🥀4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి
Apr 12 5 tweets 1 min read
హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి.ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
1. విద్యా ప్రాప్తికి:-

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!! ఉద్యోగ ప్రాప్తికి హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!

ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!

రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!
Apr 5 8 tweets 2 min read
దురలవాట్లను దూరం చేసే అమ్మవారు.

ఆ ఆలయంలో అడుగుపెడితే దురలవాట్లు దూరం అవుతాయని, ఆమె సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే... చక్కటి విద్యాబుద్ధులు అలవడతాయని భక్తుల నమ్మకం.
ఆ తల్లికి నివేదన చేసిన ప్రసాదం స్వీకరిస్తే చాలు మహాపండితులవుతారనీ, అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయనీ అందరూ అనుకుంటారు.
జగద్గురువు ఆదిశంకరులవారే స్వయంగా ప్రతిష్ఠించిన ఆ అమ్మవారే మూకాంబికాదేవి. కొల్లూరులో కొలువైన ఆ అమ్మ చల్లటి సన్నిధి సకల సంపదలకూ పెన్నిధి.
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం
Apr 4 12 tweets 3 min read
ఒక దీపం 17000 దీపాలు వెలిగించింది !
[ మరిన్ని దీపాలను వెలిగిస్తూనే వుంటుంది ]
ఆమె పేద మహిళ. పొలాల్లో కూలీపని చేసుకొంటూ వుండేవ్యక్తి. హఠాత్తుగా ఆమె బ్రతుకు మీద మరో పిడుగు పడింది. భర్త ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఒకడే కొడుకు. కర్నాటకలో ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్న Image 12 ఏళ్ళ పిల్లవాడు. వాడిని తీసుకొని ఆమె మరొక మహిళ ఇంటికి వెళుతోంది.. మొత్తానికి అడ్రసు పట్టుకొని ఆ ఇంటి తలుపు తట్టింది. '' ఎవరమ్మా , మీరు ? '' అని అడిగింది ఇంటావిడ. ''అమ్మా , నా భర్త ఈ మధ్యనే చనిపోయాడు. వీడు నా కొడుకు. నేను ఒక కూలీ. వీడిని చదివించాలి. మీరు నా బోటివాళ్ళకు
Mar 8 14 tweets 2 min read
మాది వ్యవసాయ కుటుంబం. ఇంటర్‌ అవ్వగానే పెళ్లిచేశారు. ముగ్గురు పిల్లలు. వాళ్లు కాస్త పెద్దయ్యాక ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మే తెలుగు చదివా. ఇంగ్లిష్‌ మీద ఇష్టంతో గీతం యూనివర్సిటీ నుంచి ఎమ్మే ఇంగ్లిష్‌ కూడా పూర్తిచేశా. తర్వాత బీఈడీ. నేను వాలీబాల్లో రాష్ట్రస్థాయి క్రీడాకారిణిని కూడా. ఎస్సై ఉద్యోగం కోసం ప్రయత్నించి... ప్రిలిమ్స్‌లో వెనుతిరిగాను. వేరే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించినా నిరాశే ఎదురయ్యింది. ఇక ప్రైవేట్‌ టీచర్‌గా స్థిరపడి ఆయన భారం కాస్త తగ్గిద్దామనుకున్నా. ఇలా ఎందుకన్నానంటే... మావారు శ్రీనివాసరావు అకౌంటెంట్‌గా చేసేవారు. తొమ్మిదేళ్లుగా ఆయన
Mar 4 8 tweets 2 min read
మాతృ పంచకం 🙏
కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.
ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి. మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం స్మరించుకొందాం. ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కమ్.1
అమ్మా! "నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం
Mar 1 34 tweets 5 min read
1800 సంవత్సరాల ప్రాంతంలో అరుణాచల క్షేత్రంలో ఒక భక్తుని జీవితంలో.......
జరిగిన అత్యద్భుత లీలలు ...వి. ఎస్. మూర్తి 🙏
తమిళనాడు లోని కుంభకోణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తుండేది.భర్త పేరు సుందర రాజన్ , భార్య పేరు శాంభవి.సుందర రాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేసేవారు తక్కువగా వచ్చే జీతంతోనే జీవితం గడుపు తుండేవారు.భార్యాభర్తలిద్దరూ దైవ భక్తులే.వారి ఇంటి దైవం అరుణాచల శివుడు.వారికి వివాహమై పది సంవత్సరాలైనా పిల్లలు కలుగలేదు.సుందర రాజన్ సదా కొలిచే ఆ సదా శివుడ్నే సంతానం ప్రసాదించమని అర్ధించేవారు.ఒక సంవత్సరం వారిద్దరూ అరుణాచలం వెళ్లి
Mar 1 5 tweets 1 min read
గర్భగుడిలోకి వెళ్లేముందు గడపకెందుకు నమస్కరిస్తారు............!!🙏

సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు. Image వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే...

రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ,
Mar 1 13 tweets 2 min read
లింగోద్భవం🙏

లింగోద్భవ సమయం 01-03-2022 మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం రాత్రి 12 గంటల 29 నిమిషాల 4 సెకెండ్ల నుండి 12 గంటల 31 నిమిషాల 59 సెకెండ్ల వరకు లింగోద్భవ కాలం.
సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజోలింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్పసందేశాన్ని Image ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది.*

*ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం
Feb 21 4 tweets 2 min read
ఎల్లమ్మనే రేణుక అని కూడ పిలిచేవారని, "బవనీలు అంటే దళిత స్త్రీలు ఎల్లమ్మ కథను జవనిక (యంత్రవాద్యం) వాయిస్తూ వీరావేశంతో చెప్పేవారని క్రీడాభిరామం చెబుతోంది. తండ్రి ఆజ్ఞపై పరశురాముడు తల్లి రేణుక తలను ఖండిస్తే, తల దళిత వాడలో పడింది. అప్పటి నుంటి రేణుక వారు ఆమెను తమ కులదేవతగా కొలుస్తున్నారు. [1]. ఎల్ల అనగా పొలిమేర కనుక కొందరీమెను గ్రామ సరిహద్దు దగ్గర ఉండే దేవత అన్నారు. కాని ఎల్లమ్మ గుడి ఏ గ్రామంలో కూడా పొలిమేరలో లేదు, ఊరిలోనే ఉంది. ఎల్లమ్మ దగ్గర జలకడవ కూడా ఉంటుంది. జలకడవ అంటే నీరు తెచ్చే కుండ.
Feb 19 21 tweets 3 min read
"శ్రీ వేంకటేశ్వరుడి పాద వైభవం "
ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు.
శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా
Feb 18 10 tweets 2 min read
అనారోగ్యపు బాధ ఒకపక్క... అప్పుల ఇబ్బందులు మరోపక్క... అయినా చదవాలన్న ఆమె సంకల్పం ముందు అవన్నీ వెనక్కి తగ్గాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘విమెన్‌ కోడ్‌ టు విన్‌’పోటీలో విజేతగా నిలిచి ఎందరిలోనో స్ఫూర్తి నింపుతోంది గుంటూరుకు చెందిన డనీషా కర్రి. Image అమెజాన్‌, అడోబ్‌ వంటి బహుళజాతి సంస్థల్లో లక్షల వేతనంతో కొలువులు సాధించిన డనీషా గెలుపుకథ ఇది..
మాది రేపల్లె దగ్గర మొల్లగుంట అనే చిన్నపల్లె. నాన్న గతంలో చేపలు అమ్మేవారు. ప్రస్తుతం ఓ మ్యారేజ్‌బ్యూరో నడుపుతున్నారు. అమ్మ బడి పిల్లల మధ్యాహ్న భోజన పథకంలో కార్మికురాలు.
Feb 8 22 tweets 3 min read
🙏🌺ఆయన మరణించి వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉంది🌺🙏
🌺రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. వేంకటేశ్వరుడి పరమభక్తుడు తిరుమల నంబి వారు రామానుజాచార్యులకు మేనమామ. విశిష్టాద్వైతాన్ని, ఆళ్వారుల వైభవాన్ని, భక్తి మార్గాలను మేనల్లుడికి పరిచయం చేసింది ఆయనే.
Feb 7 6 tweets 1 min read
రథసప్తమికి జిల్లేడకుకి సంబంధం ఏమిటి?
రథసప్తమినాడు స్నానసమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది.
దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు. Image ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవవిమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవవిమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు.
అయితే ఆసమయంలో పెద్దగాలిరావడంతో
Feb 4 20 tweets 3 min read
🙏ఓం నమో భగవతే రామానుజాయ 🌺

🔱⚜🔱#StatueofEquality🔱⚜🔱

🕉 సమానత్వం యొక్క విగ్రహం 🕉

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు ముచ్చింతల్‌ ముస్తాబు
45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో దివ్యక్షేత్రం.. ఆరేళ్లలో నిర్మాణం
216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం
బరువు 1800 కిలోలు.. చైనాలో 1600 భాగాలుగా తయారీ
గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’
సమతామూర్తి చుట్టూ 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం
2 నుంచి 14వ తేదీ దాకా 12 రోజుల పాటు ఉత్సవాలు
వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని.. సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణలో కార్యక్రమం
5న మోదీ రాక.. మహావిగ్రహ ఆవిష్కరణ.. జాతికి అంకితం
Feb 3 5 tweets 1 min read
ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు.
ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు (Geographical Patent) లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం.
భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం.
తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది.
Feb 2 6 tweets 1 min read
అహోబిల నరసింహస్వామి పానక నైవేద్యాన్ని
సేవిస్తే
శ్రీమంగళగిరి నృసింహస్వామి దేవునికి, అహోబిల నరసింహ దేవునికి
నైవేద్యంగా పెట్టే పానక తీర్థాన్ని సేవిస్తే... దేహంలో ఉత్సాహం
ఎక్కువవుతుంది. పానకాల స్వామి, పానకాల నరసింహ స్వామిగా పేరొందిన
మంగళగిరి నరసింహుడు, Image అహోబిలులకు పెట్టే పానక నైవేద్యాన్ని
సేవించడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
ఇంకా పానక తీర్థాన్ని సేవిచండం ద్వారా దేహంలో ఉండే ఉష్ణం సమస్థితికి
వస్తుంది. మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. నీరసం దరిచేరదు. ఆకలి
బాగా వేస్తుంది. ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి.
Feb 1 9 tweets 2 min read
కూర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?
ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు.
స్వయంభువుగా యోగ ముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు.
ఆయన ఎవరో కాదు తిరుమలో వెలిసిన శ్రీనివాసుడు.
ఆ భక్తుడు ఎవరు? స్వామి ఎక్కడ వెలిసారు?
ఎల్లప్పుడు నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగ ముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి తదితర వివరాలన్నీ మీకోసం.
కలియుగదైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశ రాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన
Jan 31 11 tweets 2 min read
మనసెరిగిన మాధవుడు.. ...🙏🏻

గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది.
ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ?
నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది.