ఆదివారం సాయంత్రం ఐదుగంటలకు దేశమంతా ముక్తకంఠంతో ఐదు నిముషాలపాటు వైద్యులు, ఇతర వైద్యసిబ్బంది, రక్షణ, మీడియా మరియు ఇతర అత్యవసర సేవా విభాగాల వారికి కృతజ్ఞతలు తెలుపవలసిందిగా కోరారు
ఆ క్షణం నాకు కళ్లు రెండూ సజలాలయ్యాయి.
అత్యవసరమైతేనే హాస్పిటల్‌లో అడుగుపెట్టమంటూ విన్నపం చేశాడు. మాకు తప్పదు. అది నిరంతర యుద్ధం. దాదాపుగా అన్నీ అత్యవసరాలే!
అందుకేనేమో... నేనింతలా కదిలిపోయింది!
దేశమంతా ఎందరో వైద్యులు అహోరాత్రాలు శ్రమిస్తూ సేవలందిస్తూ ప్రజాసంక్షేమంలో పాలుపంచుకుంటున్నారు.
జైహింద్! జై భారత్! జై మోడీ!
......జగదీశ్ కొచ్చెర్లకోట