. Profile picture
May 14, 2023 4 tweets 2 min read
మే 15 , 2023 - పల్నాడు జిల్లా చామర్రు గ్రామ దేవాలయములో #హనుమజ్జయంతి

#chamarrutemples Image Image
May 14, 2023 14 tweets 6 min read
గ్రామదేవతా నామ విశేషాలు

మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది
👉వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా #పోలేరమ్మ అయింది. Image 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే '#ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
👉ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, #పోచమ్మ పోషణ కలిగిస్తుంది.
Apr 30, 2023 21 tweets 3 min read
కాశీ క్షేత్రం లో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు : శ్రీ చక్రం లో ఎలా అయితే 9 ఆవరణలు ఉంటుందో కాశీలో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు 7 ఆవరణలు ఉన్నాయి,వివిధ కోణాలు యంత్రం లో ఉన్నట్టు వివిధ ప్రాంతాల్లో ఒక ఆవరణలో ఒక కోణం ఈ క్రమం ప్రకారం మొత్తం 56 7 ఆవరణలో 56 కేంద్రాలలో కాస్మిక్ ఎనర్జీ అయస్కాంత శక్తి లాగా ఆకర్షిస్తుంది, క్రమంగా ఆ ప్రాంతంలో ఎక్కడ కూర్చుని ధ్యానం, మంత్ర జపం చేస్తే ఊహించని విధంగా మంత్ర ప్రయోజనం తెలుస్తుంది సిక్స్త్ సెన్స్ త్వరగా ప్రచోదనం అవుతుంది.మంత్ర త్వరగా సిద్ధిస్తుంది ఆ స్థలంలో ఉన్న శక్తి అటువంటిది
Apr 30, 2023 11 tweets 1 min read
తథాస్థు దేవతలంటే:

వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు.
Apr 30, 2023 6 tweets 2 min read
ఏప్రిల్ 30, 2023 - పల్నాడు జిల్లా చామర్రు గ్రామ దేవాలయములలో నిత్య పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు #chamarrutemples Image Image
Apr 30, 2023 5 tweets 2 min read
April 30, 2023 - ఆదివారం సందర్భముగా పల్నాడు జిల్లా చామర్రు గ్రామ నవ గ్రహ దేవాలయములో ఆదిత్య పారాయణ , నవగ్రహ పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు
#chamarrutemples Image Image
Apr 30, 2023 4 tweets 2 min read
ఏప్రిల్ 29, 2023 - పల్నాడు జిల్లా చామర్రు గ్రామ దేవాలయములలో నిత్య పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు #chamarrutemples Image Image
Apr 30, 2023 7 tweets 1 min read
పరమాత్మ ప్రసాదం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః స్సఙ్గ వర్జితః
నిర్వైర స్సర్వభూతేషు యస్సమాయేతి పాణ్డవః'' ఎవరు నా కోసం శ్రోత్రాదికర్మల్ని చేస్తూ ఉంటాడో,,ఎవడు అన్ని విధాలా ఉత్సాహంతో నన్నే భజిస్తాడో సంగ దోష రహితుడై ఉంటాడో,ఎవడు సమస్త జీవుల యందు ఆత్మభావం కలిగి ఉంటాడో అట్టి నా భక్తుడు నన్ను పొందుతాడు.అట్టి వానికి ముక్తి లభిస్తుంది” అని గీతాచార్యుడు చెప్పాడు.
Apr 28, 2023 5 tweets 2 min read
ఏప్రిల్ 28, 2023 - పల్నాడు జిల్లా చామర్రు గ్రామ దేవాలయములలో నిత్య పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు #chamarrutemples Image Image
Apr 28, 2023 5 tweets 2 min read
మా చామర్రు రూరల్ సొసైటీ ఊరిలో వున్న దేవాలయముల ను జీర్ణోద్దారణ చేసి నిత్య ధూపదీప నైవేద్యము కల్గించి దేవాలయాల నిర్వహణను చేతిలో తీసుకోవటం కాకుండ వూర్లో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు స్కూల్ తరువాత ట్యూషన్లను ఏర్పాటు చేసాము;



Image
Image
Image
Image
ప్రతి ఏడాది ప్రభుత్వము ఇచ్చే సౌకర్యాలతో పాటు అదనంగా సహాయము చేస్తాము;
దేవాలయాల నిర్వహణ కన్నా ఈ విద్య సంభందిత సహాయము మనస్సుకు తృప్తి కలిగిస్తుంది;
Apr 28, 2023 15 tweets 2 min read
#చతుఃషష్ఠి కళలు ఏవో తెలుసా...

🍁🍁🍁🍁🍁

1. గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),

2. వాద్యము (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు ), Image 3. నృత్యము (భావాభినయము),

4. అలేఖ్యము (చిత్రలేఖనము),

5. విశేషకచ్ఛేధ్యము (తిలక-పత్రభంగాది రచన),

6. తండులకుసుమ బలివికారములు (బియ్యపుపిండితో, పూలతో భూతతృప్తి కొఱకు పెట్టెడి ముగ్గులు),
Apr 28, 2023 10 tweets 2 min read
తమిళనాడు రాజకీయాలు చాలా వేగముగా మారుతున్నాయి. రెండు బలము అయిన ప్రాంతీయ పార్టీలు రెండూ ఒకే సిద్దాంతము అని చెప్పుకునే పార్టీల్లో ఒకటి రెండు తరాలు అయిపోగానే ఆ పార్టీ ల లో ఒకటి అన్నా బలహీనం అయ్యి కనుమరుగు అయ్యే అవకాశమే ఎక్కువ. కరుణానిధి , జయ లలిత ఇద్దరు వెళ్ళిపోయాక స్టాలిన్ కరుణానిధి వారసుడిగా నిలదొక్కుకున్నాడు. కానీ జయలలిత వారసుడు ఎవడో ఇంకా తేలలేదు. తేలదు కూడ. ఆవిడకు సొంత కుటుంబములో వారసత్వం లేకపోవటం ఒక పెద్ద బలహీనత.
Apr 27, 2023 4 tweets 1 min read
ఓం నమో నారాయణాయ!!, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.!!కృష్ణం వందే జగ్గద్గురుమ్.!

!!.శ్రీ కృష్ణాష్టకం.!!
🌷🔥🌷🔥🌷
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుమ్‌ Image అతసీపుష్పసంకాశం హారనూపురశోభితం
రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుమ్‌

కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం
విలసత్కుండలధరం - కృష్ణం వందే జగద్గురుమ్‌

మందారగంధసంయుక్తం - చారుహాసం చతుర్భుజం
బహీర్పింఛావచూడాంగం-కృష్ణం వందే జగద్గురుమ్‌
Apr 27, 2023 5 tweets 2 min read
ఏప్రిల్ 27, 2023 - పల్నాడు జిల్లా చామర్రు గ్రామ దేవాలయములలో నిత్య పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు #chamarrutemples Image Image
Apr 25, 2023 6 tweets 1 min read
వినాయకుడి విశిష్టత

వినాయకుడు '' అనే పదానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏమిటంటే '' నాయకుడు లేనివాడు '' అని అర్థం. అంటే తనకు తనే నాయకుడు అని. Image 🍁 'త్వమేవాహమ్', 'అహంబ్రహ్మోసి' అన్న భావమే అది. అందుకే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతినే పూజ చేస్తారు పూజారులు. ఏ గణానికైనా అతడే 'పతి' జగత్తు. ఎందుకంటే అంతా 'గణ' మయమే కాబట్టి ! వివిధ గణ సమాహారమే ఈ విశ్వమని మనకు ఎన్నో పురాణాలు చెబుతుంటాయి. 'గ' అనే అక్షరం నుంచే జగత్తు జనించింది.
Apr 25, 2023 4 tweets 2 min read
ఏప్రిల్ 25, 2023 న మంగళవారం సందర్భంగా పల్నాడు జిల్లా చామర్తి గ్రామ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మధ్యాహ్నం రాహుకాల సమయం నందు విశేష పూజకార్యక్రమాలు #chamarrutemples Image Image
Apr 24, 2023 6 tweets 1 min read
మానవ శరీరం ఒక్కటే.. కాని ఎంతో వైవిధ్యం కలది. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వం అనేది సృష్టి అంతటా మనకు కనిపిస్తుంది. ఈ సృష్టి మొత్తం.. సూర్యచంద్రులు, నక్షత్రాలు, మేఘాలు, నీరు, భూమి అన్ని ఒకే పదార్థంతో తయారయ్యా యి. ఆ ఒక్కదానికే ‘శివ’ అని పేరు. Image శివుడు విశ్వరూపుడే. అంతే విశ్వం మొత్తం అతని రూపమే. అదే సమయంలో అతను రూపం లేనివాడు, నిరాకారుడు. విశ్వానికి ఆదినాదమైన ఓంకారంలోనికి లోతుగా వెళ్లినప్పుడు అతడిని తెలుసుకోవచ్చు. మరి అతడిని అర్థం చేసుకోవడం ఎలా, అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం.
Apr 24, 2023 5 tweets 2 min read
ఏప్రిల్ 24, 2023 - పల్నాడు జిల్లా చామర్రు గ్రామ దేవాలయములలో నిత్య పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు #chamarrutemples Image Image
Apr 23, 2023 15 tweets 4 min read
ఏప్రిల్ 23,2023 : ఈరోజు అక్షయ తృతీయ సందర్భముగా పల్నాడు జిల్లా చామర్రు గ్రామ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారికి చందనాభిషేకము

#chamarrutemples Image
Apr 5, 2023 23 tweets 3 min read
దశమహావిద్యలు...................

విద్య అంటే సరైన జ్ఞానం మన చుట్టూ ఉన్న మాయను పటాపంచులు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య. జ్ఞాన స్వరూపిని ఆయన శక్తి ధరించిన పదిరూపాలే దశ మహావిద్యలు. తంత్ర శాస్త్రంలో శక్తి ఉపాసనను విద్య అంటారు తొడల తంత్రంలో దశమహావిద్యల సాధన ఉంటుంది.. Image అజ్ఞానం పాపానికి కారణమోతుంది. పాపం దుఃఖానికి కారణం.జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది.పరమానందాన్ని కలిగిస్తుంది.అటువంటి జ్ఞానాన్ని అమ్మవారి పది అవతారాలలో ప్రసాదిస్తుంది.ఆ అవతారాలనే దశ మహా విద్యలన్నారు.జ్ఞానానికి పది అవతారాలు ఎందుకు?మహా విద్య పది రూపాలను ఎందుకు సంతరించుకుంది?
Apr 5, 2023 13 tweets 3 min read
వామనుడు చెప్పిన పవిత్ర విష్ణు స్థానాలు
1. మత్స్య - మానస సరోవరం
2. కూర్మ - కౌశికీ నది
3. హయశీర్ష - కృష్ణాంశం
4. గోవింద - హస్తినాపురం
5. త్రివిక్రమ - యమునా నది
6. భవ - లింగభేదం
7. శౌరి మాధవ‌ - కేదారం
8. హృష్టమూర్ధజ - కుబ్జామ్రం
9. నారాయణ - బదరికాశ్రమం
10. వరాహ - గరుడాసనం. Image 11. జయేశ - భద్రకర్ణం
12. ద్విజప్రియ - విపాశా నది
13. రూపధారి - ఇరావతీ నది
14. కురుధ్వజ - కురుక్షేత్రం
15. నృసింహ - కృతశౌచం
16. విశ్వకర్మ - గోకర్ణం
17. కామపాల - ప్రాచీనం
18. పుండరీక - మహాంభసం
19. అజిత - విశాఖయూపం
20. హంస - హంసపదం.