గ్రీకు గణితవేత్త మరియు ఖగోళ, భౌగోళిక శాస్త్రజ్ఞుడు టాలెమీ క్రీశ 2వ శతాబ్దంలో (దాదాపు1900 సంవత్సరాల క్రితం) ప్రపంచ భౌగోళిక స్వరూపంపై రాసిన పుస్తకంలో ఆనాటి భారతదేశ పట్టణాల పేర్లు, ఇతర భౌగోళిక వివరాలు పొందుపరిచారు. అందులో నేటి కడప పట్టణాన్ని ‘కరిగె’ అని పేర్కొన్నాడు.
అయితే కడప ముందు ఒక చిన్న గ్రామం. చెన్నూరు సీమ / ములికినాటి సీమ /గండికోట సీమలలో ఉన్న గ్రామం క్రమేపీ పట్టణంగా, జిల్లా ప్రధాన కేంద్రంగా ఎదిగింది. వాడుకలో కడప పట్టణాన్ని మొత్తాన్ని కడప అని సంబోధించినా వివిధ కాలాల్లో ఏర్పడిన / వృద్ధి చెందిన వివిధ కడపల సమాహారమే నేటి కడప.
విజయనగర రాజులు, కడప నవాబులు, బ్రిటీషు వారి ఏలుబడిలో ఉండిన కడప; దేవుని కడప, పాలకొండ్రాయుడు స్వామి ఆలయాలు, అమిన్ పీర్ దర్గా(పెద్ద దర్గా), చాంద్ ఫిరా గుంబద్, మరియాపురం, CSI సెంట్రల్ చర్చ్ లతో భిన్న సంస్కృతుల సంగమంగాఉన్నది.
దేవుని కడప / దేవర కడప : తిరుమలకు తొలి గడప కడప. దేవుని కడప తిరుమలకు ఉత్తర ద్వారం. దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని జనమేజయుడు కట్టించాడని కడప కైఫీయత్తు చెబుతుంది (కడప జిల్లాలోని ఆలయాల చరిత్రల్లో జనమేజయుడు లేదా అగస్త్యుడి ప్రస్తావన అధికంగా ఉంటుంది ).
దేవుని కడపలోని వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కృపాచార్యులు ప్రతిష్టించారని , ఆయన పేరు మీద కృప , కురిపె, కరిగె, కడప అయ్యింది అన్నది మరో భావన . ఈ ఆలయం చుట్టుపక్కల ఏర్పడిన గ్రామం (బ్రాహ్మణులు ఉండేవారు) కాబట్టి దేవుని కడప / దేవర కడప గ్రామం అనే పేరు వచ్చింది.
కడప గ్రామం : చెన్నూరు సీమ /ములికినాటి సీమ / గండికోట సీమలో దేవర కడపకు ఉత్తర దిక్కున పెన్నా నదికి అరపరుగు దూరంలో కడప అనే గ్రామం ఉండేది. అయితే ఆ గ్రామం పెన్నా నది వరదల్లో కొట్టుకుపోయింది.
కాపు కడప / పాత కడప : తమ గ్రామం వరదల్లో కొట్టుకుపోవడంతో కడప గ్రామ వాస్తవ్యులు దేవుని కడప
వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఉత్తరాన మరో గ్రామం కట్టుకున్నారు. ఈ గ్రామంలో కాపులు అధికంగా ఉండటం వల్ల ఆ గ్రామానికి కాపు కడప అనే పేరు వచ్చింది (దేవుని కడపలో బ్రాహ్మణులు ఉండేవారు). నవాబుల కాలంలో కొత్తగా మరో కడప అభివృద్ధి చెందడంతో కాపు కడపనే పాత కడప అని కూడా అన్నారు.
నేకనామ్ ఖాన్ పేట / నేకనాంబాద్ / శహర్ కడప : విజయనగర సామ్రాజ్య పతనానంతరం కడప ప్రాంతాన్ని ఏలిన గోల్కొండ కుతుబ్షాల సైనికాధికారి మీర్ సయ్యద్ హుస్సేన్ / నేక్ నామ్ ఖాన్ తనపేరుతో దేవుని కడప వేంకటేశ్వర స్వామి ఆలయానికి దక్షిణంగా, బుగ్గవంక కాలువకు తూర్పున కోదండరామస్వామి ఆలయం చుట్టూ
చెట్లు నరికించి ఒక గ్రామాన్ని కట్టించాడు. అదే నేకనామ్ ఖాన్ పేట / నేకనాంబాద్ గ్రామం. అయితే మాయణా నవాబులు (అబ్దుల్ నబీ ఖాన్) కడపను (నేకనామ్ ఖాన్ పేట / నేకనాంబాద్ ను ) రాజధానిగా ఎంచుకొని, చుట్టూ కోట, బురుజులు కట్టించి, విస్తరించి అక్కడి నుండి తన సుబాను ఏలుతుండగా,
ఆ నేకనామ్ పేటకు కడప దగ్గరగా ఉండటం వల్ల వాడుకలో దానికీ కడప అని పేరు వచ్చింది. అదే తర్వాత తర్వాత పట్టణంగా ఎదిగి శహర్ కడపగా మారింది. శహర్ కడపలో సుబేదారు అబ్దుల్ నబీఖాన్ ఉండేవాడు కాబట్టి ఆ ప్రాంతం కడప సుబా అయినది.
వరదల్లో కొట్టుకుపోయిన కడప కాకుండా మిగతా మూడు కడపలు నేటికీ ఉన్నాయి.
PS1: నేక్నాం ఖాన్ అన్నది పేరు కాదు. అది ఒక బిరుదు. నేక్నామ్ అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు అని అర్థం. కైఫీయత్తుల్లో నేక్ నాం ఖాన్ అసలు పేరు మీర్ సయ్యద్ హుస్సేన్ అని, సయ్యద్ మీరా అని ఉంది. కానీ చారిత్రక రికార్డులలో మాత్రం నేక్ నాం ఖాన్ అసలు పేరు రజా కూలీ బేగ్ అని ఉంది
PS2: ఔరంగజేబు తరపున జుల్ఫీకర్ ఖాన్ గండికోట ఖిల్లేదారుగా ఉన్నప్పుడు ఈ నాకనాంపేట / కడప గ్రామాన్ని గండికోటలో మీర్ జుమ్లా నిర్మించిన జామా మసీదు నిర్వహణకు జాగీరుగా / మన్యంగా ఇచ్చేశాడు.
Source :
Mackenzie Manuscripts Vol2 (TV మహాలింగం)
కైఫీయత్ కథలు - శ్రీ కట్టా నరసింహులు
మెకంజీ కైఫీయత్తులు వైస్సార్ జిల్లా : నాలుగవ భాగం (సీపీ బ్రౌన్ పరిశోధన భాషా పరిశోధనా కేంద్రం, వైవీయూ,కడప
Ancient India as Described by Ptolemy
Proceedings of the Deccan History Conference
1846 - అప్పటికే బ్రిటీషు వారిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతని సైన్యంతో లెఫ్టినెంట్ వాట్సన్ నేతృత్వంలోని కుంఫిణీ సైన్యం గిద్దలూరు వద్ద తలపడింది. రెండు పక్షాల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. రెడ్డి అనుచరులు చాలా మంది చనిపోయారు.
అధిక సంఖ్యలో ఉన్న నరసింహా రెడ్డి సైన్యం ముందు నిలవలేక వాట్సాన్, వెనుకంజ వేసి తన సైన్యాన్ని తీసుకుని శెట్టివీడు (కృష్ణం శెట్టిపల్లె?) చేరుకున్నాడు. నరసింహారెడ్డి తన అనుచరులతో ముండ్లపాడు చేరుకున్నాడు.
మరుసటి రోజు, జులై 24 వ తేదీ వాట్సన్ కు సహాయంగా కర్నూలు నుండి కెప్టెన్ నాట్ కెప్టెన్ రాసెల్ సైన్యం కృష్ణం శెట్టిపల్లె చేరుకుంది. వారందరూ కలిసి ముండ్లపాడులో నరసింహారెడ్డి బలగం ఉందని తెలిసి అక్కడికి చేరుకొని అతడితో పోరాటానికి దిగారు.
కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.
ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
కట్టమంచి రామలింగారెడ్డి గారి ముదబ్బ (ప్రపితామహుడు / Great Grandfather ) కట్టమంచి పెద్ద రామలింగారెడ్డి - భాస్కర శతకము మొదలగు రచనలు చేసినారు. అంతేకాక జ్యోతిష్యము, సంస్కృతము, మంత్రశాస్త్రము మొదలగువాటిలో నేర్పరి.
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు.
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
ఆ పుస్తకం గురించి చెప్పి రచయిత నం / ప్రచురణ కర్త నం ఇస్తారు (కొనడానికి వీలుగా). నీవు రాసేది ఎప్పుడు పుస్తకంలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీషు అర్థం కాదు. చరిత్రపై ఉన్న అవగాహన, పట్టు అసాధారణం. ఎవరైనా వీరి సహాయం కోరితే వారికి తగిన మూల గ్రంథాలు దొరకడంలోనూ,
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).
తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)
తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని