1. భోజనానికి ముందు,తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.
2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.
4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.
5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.
7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.
8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.
10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.
11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు
13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. (ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)
15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు. (వెంట్రుకలు కత్తిరించడం)
16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే మనం తినగా మిగిలినవి పెట్టరాదు. మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.
18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.
20. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం. అందుకే చాల చోట్ల పాటలు పద్యాలూ పాడుకుంటూ భోజన కల సమయే గోవిందా గోవిందా అనుకుంటూ వుంటారు
22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు. పద్యాలూ,
23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు . ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.
25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.
32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు
33. అన్నం, పప్పు, కూర, చారు లాంటివి తాకినప్పుడు చేతిని కడుక్కోనే పెరుగు, మాజ్జిగా, పచ్చడి లాంటివి ముట్టుకోవాలి😊