తిరుమలలో లభ్యమవుతున్న శాసనాలలో సింహభాగం తమిళభాషలో ఉన్నవి. శ్రీకృష్ణదేవరాయల ముందువరకు తిరుమలలో లభ్యమవుతున్న శాసనాలలో కేవలం ఒకటి మాత్రమే తెలుగులో ఉన్న శాసనం. ఆ ఒక్క శాసనం సాళువ మంగిదేవ మహారాయ శాలివాహక శకం 1281లో (క్రీ.శ 1359 ) వేయించిన శాసనం. #తిరుమల#TTD
తిరుమల - తిరుపతి దేవస్థానాలలో లభ్యమవుతున్న శాసనాలలో మొదటి శాసనం పల్లవరాజు దంతి వర్మ కాలంలో వేయించిన శాసనం. (క్రీ.శ 830 /846).శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన సంవత్సరం క్రీ.శ 1509. అనగా దాదాపు 700 సంవత్సరాల తిరుమల శిలాశాసనాలలో కేవలం ఒక్కశాసనం మాత్రమే తెలుగులో
వేయించబడింది.
700 సంవత్సరాలలో తిరుమలలో తొలి తెలుగు శాసనంవేయించిన ఈ సాళువ మంగు బుక్కరాయ సైనికాధికారుల్లో ఒకడు. విజయనగర సామ్రాజ్య దక్షిణ దండయాత్రలలో, విస్తరణలో ప్రధాన భూమిక పోషించాడు. మధురా విజయంలోనూ, శ్రీరంగ ఆలయ పునరుద్ధరణలోనూ సాళువ మంగు ప్రధాన పాత్ర పోషించాడు.
ఈ సాళువ మంగు ప్రపౌత్రుడే (మునిమనుమడే) సంగమవంశాన్నికూలదోసి విజయనగరంలో సాళువ వంశాన్ని స్థాపించిన సాళువ నరసింహ దేవరాయలు.
#Tirumala
Source:
Tirumala, Tirupati Devasthanams Inscriptions - Vol 1
Report on the Inscriptions of the Devasthanam -
By Shri Sadhu Subrhamanya Shastri
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
1846 - అప్పటికే బ్రిటీషు వారిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతని సైన్యంతో లెఫ్టినెంట్ వాట్సన్ నేతృత్వంలోని కుంఫిణీ సైన్యం గిద్దలూరు వద్ద తలపడింది. రెండు పక్షాల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. రెడ్డి అనుచరులు చాలా మంది చనిపోయారు.
అధిక సంఖ్యలో ఉన్న నరసింహా రెడ్డి సైన్యం ముందు నిలవలేక వాట్సాన్, వెనుకంజ వేసి తన సైన్యాన్ని తీసుకుని శెట్టివీడు (కృష్ణం శెట్టిపల్లె?) చేరుకున్నాడు. నరసింహారెడ్డి తన అనుచరులతో ముండ్లపాడు చేరుకున్నాడు.
మరుసటి రోజు, జులై 24 వ తేదీ వాట్సన్ కు సహాయంగా కర్నూలు నుండి కెప్టెన్ నాట్ కెప్టెన్ రాసెల్ సైన్యం కృష్ణం శెట్టిపల్లె చేరుకుంది. వారందరూ కలిసి ముండ్లపాడులో నరసింహారెడ్డి బలగం ఉందని తెలిసి అక్కడికి చేరుకొని అతడితో పోరాటానికి దిగారు.
కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.
ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
కట్టమంచి రామలింగారెడ్డి గారి ముదబ్బ (ప్రపితామహుడు / Great Grandfather ) కట్టమంచి పెద్ద రామలింగారెడ్డి - భాస్కర శతకము మొదలగు రచనలు చేసినారు. అంతేకాక జ్యోతిష్యము, సంస్కృతము, మంత్రశాస్త్రము మొదలగువాటిలో నేర్పరి.
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు.
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
ఆ పుస్తకం గురించి చెప్పి రచయిత నం / ప్రచురణ కర్త నం ఇస్తారు (కొనడానికి వీలుగా). నీవు రాసేది ఎప్పుడు పుస్తకంలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీషు అర్థం కాదు. చరిత్రపై ఉన్న అవగాహన, పట్టు అసాధారణం. ఎవరైనా వీరి సహాయం కోరితే వారికి తగిన మూల గ్రంథాలు దొరకడంలోనూ,
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).
తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)
తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని