కస్టమర్ కేర్, బ్యాంక్ లోన్లు కోసం ఫోన్ చేసే వారితో కేవలం తెలుగు లోనే మాట్లాడండి, తెలుగు తెలియకపోతే తెలుగు తెలిసిన వారితో ఫోన్ చేయించ మని చెప్పండి, అది కూడా తెలుగు లో చెప్పి పెట్టేయండి
ఏటీఎం సేవలు కూడా తెలుగు భాష లో పొండచ్చు, బాగా తెలుగు కి అలవాటు పడ్డాక మొత్తం ఆండ్రాయిడ్ తెలుగు లో వాడచ్చు
మీరు సెలవు లో వెళ్లేప్పుడు ఔట్లుక్ లో పెట్టే ఆటోమాటిక్ రిప్లై తెలుగు లో రాయండి, ఎవ్వరూ ఏమీ అనుకోరు
ఉదాహరణకు, ఇంకా ఉద్యోగం లేని తమ్ముడికి ఉపదేశం:
గడన గల మగని జూచిన
నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో;
గడ నుడుగు మగని జూచిన
నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ
నేను sapiens తెలుగు అనువాదం పుస్తకం కొనడం వల్ల నేను చదవడమే కాకుండా మా నాన్న గారు కూడా చదివారు, నాకన్నా ఎక్కువ సార్లు
మన @nag_vasireddy , @santhoo9 , @krishtangirala వంటి వారు తెలుగు లో పొడ్వస్ట్, వీడియోలు చేస్తున్నారు, చక్కగా మన బాషలో ఎంతో విజ్ఞానం పంచుతున్నారు
@dasubhashitam వంటి వారు ఎన్నో పుస్తకాలు ఆడియో లో అందిస్తున్నారు ఓ ఆదివారం మధ్యాహ్నం ఓ అమరావతి కథ వినండి
మీ పిల్లలకు తెలుగు లో సంతకం ప్పెటమని ప్రోత్సహించండి
పండగ్గో పాబ్బానికి అయినా తెలుగు లో ట్ట్వీట్ మని చెప్పండి, తెలుగు నేర్చుకోమనండి
అప్పటికి తట్టక పోతే ఉన్నారు గా నడిచే తెలుగు విజ్ఞానం @tuxnani ని అదిగేయండి 😁
ఇంతే సంగతులు, ఉంటాను మరీ 😁