వాట్సాప్ లో వచ్చిన కధ. స్ఫూర్తి కోసమే కానీ అందులోని విధంగా ఆచరంచమని కాదు.  

*👌*మన నుదిటిపై బ్రహ్మ రాసిన బ్రహ్మరాతను మార్చగల శక్తి ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే అది ఎలా పనిచేస్తుంది. దాని విధివిధానాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దామా.*👌

రామాపురం అనే ఊరిలో రామశర్మ అనే ఒక మంచి సమర్థుడైన
గురువు గారు తన ఆశ్రమంలో శిష్యులకు శిక్షణనిస్తూ వుండేవారు. ఆయన సకల శాస్త్రాలు, విద్యలు తెలిసినవారు. ఆయన భార్య కూడా పేరుకు తగినట్లు సాక్షాత్తూ అన్నపూర్ణా దేవియే. ఆమె తమ ఆశ్రమంలోని శిష్యులను తన కన్నబిడ్డల్లా ప్రేమగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదు అనకుండా వారి ఆకలిని తీర్చేది.
అలా, ఒక నాడు ఆ గురు దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ బాలుడు వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు.*_
ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోక పోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా శిక్షణ ముగిసిందని అతడిని తిరిగి రామశర్మ దగ్గరకు
పంపించారు. ఇదిలా వుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభ మయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటే
కూర్చుని ఎవరు పుడతారా అని ఆలోచించుకొంటూ ఉండగా, లోపలి నుండి చంటి బిడ్డల ఏడుపులు వినిపించాయి.

గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి
కనిపించాడు. నిజానికి మామూలు మనుషులకు అతను కనిపించి వుండేవాడే కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ '' అని అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట
కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరా అని వినమ్రపూరితంగా అడిగాడు.

బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు
తెలియ జెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకుని ఇలా చెప్పాడు.. నాయనా.. వీరు పూర్వజన్మలో చేసిన పాప కర్మల వల్ల ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవిత కాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో
కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు.

సాక్షాత్తూ దైవసమానులైన తన గురు దంపతులకు
పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువు దగ్గరకు వెళ్ళి గురూజీ బ్రహ్మ దేవుడు రాసిన తలరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యమో కాదో అనేది నాకు తెలియదు వేరే పెద్ద పెద్ద జ్ణానులకు తెలిసుండవచ్చు అని చెప్పాడు.
పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించ సాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య,
అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది.

ఒక రోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది తీర్థయాత్రలు చేసి వస్తానంటూ బయలుదేరి, పెద్ద పెద్ద జ్ణానులను కలవడానికి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు. వారందరిని వసంతుడు ప్రశ్నించాడు.
బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా అని, దానికి వారికి తెలిసినదేదో వసంతుడికి చెప్పారు. చివరికి ఒక గురువు గారి వద్ద కర్మ సిధ్ధాంతాన్ని అభ్యసించి అది మన తలరాతను మార్చ గలదని ప్రయోగ పూర్వకంగా తెలుసుకొన్నాడు. ఇక వెనుదిరిగి వచ్చాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి
వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలని ఆశ్రమానికి వచ్చాడు. అప్పటికే అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి. గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు.
తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. వసంతుడుబాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు,
ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ.. నువ్వు బాధపడకు. ఇప్పటి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా.. ఇక నుండి నువ్వు ఎలా చెపితే అలానే చేస్తాను'' అన్నాడు శంకరుడు.

ముందు ఆ ఆవుని తోలుకుని
పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంతకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఆ ఆవుని అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన
డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలు దేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురంటూ తిని ఆకలి తీర్చుకున్నారు.

తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. _👌
ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా అన్నం వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా.. ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి
ఖర్చయి పోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ.. నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు.

ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది.
శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి బ్రహ్మయే రాత్రికి రాత్రి తనే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు.
తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలు దేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.

వసంతుడు వాళ్ళని, వీళ్ళని
అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా.. నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకు పోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ.. ఊరుకోమ్మా..
ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్నఅవ్వకు చెప్పాడు
వసంతుడు.

ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా.. ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అంతే అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళి పోయారు.
అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తుండగా ఒక మహాపురుషుడు లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తనురాసిన తల రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు.
అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, వారి తలరాతలను మార్చి గురు దంపతుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చి
దిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు భగవంతుడు. అదే విషయాన్ని నిరూపించాడు వసంతుడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చ గలిగేది ఒక్క గురువే. కాబట్టి మిత్రులారా ! మీరు కూడా ఒక సద్గురువును ఆశ్రయించి గురు బోధనల ద్వారా మీ తలరాతను మార్చుకో గలరని ఆశిస్తూ
ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.*_👌

_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘

_*👌*ధర్మో రక్షతి రక్షతః **

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

15 Sep
*మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి*

*౧. అర్ధ దోషం*
*౨. నిమిత్త దోషం*
*౩. స్ధాన దోషం*
*౪. గుణ దోషం*
*౫. సంస్కార దోషం*

ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.

*అర్ధ దోషం*
ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.

భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది.

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి
కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.

తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా
Read 14 tweets
15 Sep
ఒక economics ప్రొఫెసర్ ఒక పార్టీ లో ఇలా చెప్పారు,

నేను పనిచేసే కాలేజీ లో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ ని కూడా ఫెయిల్ అవ్వలేదు,

కానీ ఈ మధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది,
ఎలా అని అడిగారు మిగతా వాళ్లు,

ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు,
క్లాస్ లో టాప్ రాంకేర్,
లీస్ట్ రాంకేర్స్ అని వొద్దు,
అందరూ ఒకటే ర్యాంక్ అన్నారు,
ప్రొఫెసర్ అన్నారు,
ok,
మీ అందరి మర్క్స్ add చేసి ,average తీసి రాంక్స్ ఇస్తా అన్నారు,

మొదటి సెమిస్టర్ లోaverage ర్యాంక్ B వచ్చింది అందరికి

2nd సెమిస్టర్లో అందరికి D ర్యాంక్ వచ్చింది,

3rd సెమిస్టర్ లో అందరికి f వచ్చింది,
ఫైనల్ exams లో అందరూ ఫైల్ అయ్యారు,
స్టూడెంట్స్ అందరూ అవాక్కు అయ్యారు,
బాగా చేదివేవాళ్ళు ఎవరికోసమో మేము చదవటం ఎందుకు అని చదవటం మానేశారు,
పూర్ స్టూడెంట్స్ ఎలాగ తెలివికల వాళ్ళు చదువుతారు కదా ,ఇంకా మేము ఎందుకు చదవటం అని ,చదవటం పూర్తిగా మానేశారు,
Read 6 tweets
14 Sep
కులపిచ్చి🤔

*అసలే ఖాళీ రోడ్డు, పెద్ద ఎండ కూడా లేదు, పైగా చల్లని గాలి, వెనక్కాల గట్టిగా పట్టు క్కూచున్న భార్య, దాంతో తెగ స్పీడుగా డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నాడు హరికృష్ణ
ఆళ్ళ మావగారు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన లేటెస్టు మోడలు కవాసాకీ నింజా బైకు కొత్తల్లుడికి ఉగాది కానుకగా ఇచ్చేరు.
కాకినాడలోని మావగారింట్లో ఉదయాన్నే బండికి పూజ చేయించి, పచ్చడి తిని తల్లిదండ్రులు ఉండే పిఠాపురానికి బయల్దేరాడు.
దేవరపల్లి వీధి దాటి కుంతీ మాధవస్వామి గుడి దగ్గర కొచ్చేసరికి ఎక్కణ్ణుంచొచ్చిందో ఓ సూడిగేదె అడ్డొచ్చేసరికి సడన్ బ్రేకు వేసాడు హరికృష్ణ.
దాంతో నూటిరవై కిలోమీటర్ల స్పీడులో
వస్తున్న బండికాస్తా స్కిడ్డైపోయి భార్యాభర్తలిద్దరూ కిందడిపోయేరు.

ఒళ్ళంతా గీరుకుపోయి ఒకటే రక్తం, చెయ్యిరిగి పోయిందంటూ ఆ హరికృష్ణ భార్య హరిత ఒకటే ఏడుపు.
రోడ్డు పక్కనే ఉన్న పాక ల్లోంచొచ్చిన జనం వీళ్ళిద్దరినీ లేవదీసి బండిని పక్కన నిలబెట్టి, బొట్టు బీదరాజు గాడి ఆటోలో పక్కీధిలోనున్న
Read 26 tweets
9 Sep
[దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు..?

🙏 _ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో.. అతనినే *‘దేవుడు’* అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు ? అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే…
పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు…>_

_మన కాళ్ళు.. ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు._

_మన చేతులు.. కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు._

_మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన
పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనేమనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి
Read 12 tweets
9 Sep
*మా బాపు...*

గ్రీటింగ్‌ కార్డు, వెడ్డింగ్‌ కార్డు, క్యాలెండర్, పుస్తకాలు, కాఫీ కప్పులు... సర్వం బాపు మయం...ఏ స్తోత్రం చదివినా బాపు బొమ్మే... ఏ పుస్తకం తీసినా బాపు కవర్‌పేజీయే...సినిమాలు తీసి, బొమ్మలు వేసిన *బాపు కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారని వారి పిల్లలను అడిగితే...
కుమార్తె భానుమతి, కుమారులు వేణుగోపాల్, వెంకటరమణ తమ అనుభవాలను పంచుకున్నారు.*

నాన్న కోసం తాండ్ర తెస్తే, దాన్ని చాకుతో ముక్కలుగా కట్‌ చేసి అందరికీ పెట్టి, తాను చిన్న ముక్క మాత్రమే తినేవారు. సమోసాను కూడా కట్‌ చేసేవారు. ఏ వస్తువునూ డబ్బాలో దాచే అలవాటు లేదు. నాన్నకి బామ్మ చేసే
స్వజ్జప్పాలంటే చాలా ఇష్టం. అందుకే బామ్మ వేడివేడిగా నాన్నకి, మామకి పెట్టమనేది.

నాన్నగారికి ఫలానా పాట ఇష్టం... అంటూ నిర్దిష్టంగా లేదు. ప్రతి పాటలోను అందంగా ఉన్న అంశం గురించి మాట్లాడేవారు. అయితే అప్పుడప్పుడు ‘బంగారు పిచిక’ చిత్రంలోని ‘పో... పోపో... నిదురపో...’ పాటలోని పదాల
Read 16 tweets
9 Sep
భోజన మహాత్మ్యం

@@@

మీరు మీ తాతయ్య తరంవారిని వారి కాలంలో బంధుత్వాలు, మనుషుల మధ్య అనుబంధాలు ఎలా ఉండేవో ఒకసారి అడిగి చూడండి. మా చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఉండేవారు. వంటలు కూడా రోజూ ఎలా ఉండేవో అలాగే ఉండేవి. ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు.
ఆరుబయట నులక మంచాలు వేసుకుని పడుకోవడం...కబుర్లు చెప్పుకుని పడుకోవడం...మూడు పూటలా అన్నమే తినడం...మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు. ఇల్లంతా వెతికినా కనిపించవు. అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది. అప్పట్లో రోజుకు ఒకటో రెండో
బస్సు సర్వీసులు. కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు. ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షం అయ్యేవి. బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటివాళ్లే చెప్పులను దాచిపెట్టేవారు.

రానురాను మనం ఆధునికత సంతరించుకున్న తరువాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది. ఇక గత రెండు మూడు
Read 10 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!