Varaprasad Daitha Profile picture
Sep 17, 2020 22 tweets 3 min read Read on X
బొడ్డు తాడును పిల్లలకు వెండి మొలతాడులో కట్టి భద్రపరిచే *హిందూ సాంప్రదాయం అనే సైన్సును* క్రమంగా తాయత్తు మహిమగా (తావిజు మహిమ) మార్చి తర్వాత మూఢనమ్మకంగా ప్రచారమై *మన సాంప్రదాయం మనమే వదులుకొనేలా చేసి వేలకోట్లు వ్యాపారం చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.*
తాయత్తు అని మనం చాలా
అవహేళన చేసి వెక్కిరించే ఆ తాయత్తులలోనే గతంలో పుట్టిన ప్రతి బిడ్డ నుంచి వేరు చేసిన బొడ్డుతాడును (Umbilical Cord) పెట్టి మొలతాడుకు కట్టేవారు. దానికే మరొక పేరు *బొడ్డు తాయత్తు.* మందులు లేని వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి..
ఎవరి బొడ్డు వారికే పని
కొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్థోమత ఉన్నవారు, వెండి తాయత్తులు చేయించుకునేవారు.
లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే *తాయత్తు మహిమ*
అనేవారు. *ఈ తాయత్తు మహిమ అనే పదానికి అసలైన అర్థమిదే.* ఈ బొడ్డుతాడును పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చట.
కొన్ని రకాలా క్యాన్సర్లకు మూలకణాల చికిత్స చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువుల మూలకణాలు అవసరమవుతాయి. అన్ని సందర్భాల్లో తోబుట్టువులు
అందుబాటులో ఉంటారని అనుకోలేము. ఎవరి జీవితం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేరు. అందుకే బొడ్డుతాడుని దాస్తే అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరమవుతుంది.
అది కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉంటే ఆపత్సమయంలో వెతికే అవసరముండదు. త్వరగా దొరుకుతుంది. మారిపోయే అవకాశం ఉండదు. అదేకాక వెండిలో చుట్టించి కట్టడం
వెనుక ఆయుర్వేదం కూడా దాగి ఉంది. ఆధునిక సైన్సు కూడా దీనినే నిరూపించి ఈ *Stem Cells* క్యాన్సర్, జుట్టు ఊడిపోవటం, కిడ్నీ, రక్త సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని, ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా ఇది పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచటానికి బ్యాంకులు
తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు.
*ఇవాళ ఒక బొడ్డుని భద్రపరచటానికి ఒక బ్యాంకు లాకర్ అద్దే సుమారు 20,000 రూపాయలుంది.* ఆ అవసరం లేకుండా తాయత్తులో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమై, అవహేళన చేయబడి వెక్కిరించబడేది.*
అవునులే బట్ట కట్టుకోవటమే అనాగరికమన్నప్పుడు మొలతాడు దానికొక
తాయత్తు మరింత అనాగరికమే అవుతుంది. అంత ఉపయోగమున్న బొడ్డుతాడుని ఒకరిదొకరికి మారటానికి ఆస్కారం లేకుండా తాయత్తులో పెట్టి ఖర్చులేకుండా మొలకు కట్టుకోవటం అజ్ఞానం.
ఒకరిది మరొకరికి మారే అవకాశమున్న లాకర్లో వేలు ఖర్చుపెట్టి దాచిపెట్టటం విజ్ఞానం.* గర్భంలో ఉన్న శిశువు బొడ్డుతాడు ద్వారానే
తల్లి నుంచి పోషకాలను తీసుకుంటుంది. *బొడ్డుతాడులో మూలకణాలు*
(Stem Cells) ఉంటాయని దాన్ని భద్రపరచాలని ఇప్పుడు అనేక ప్రకటనలు చేస్తూ *Stem Cells* బ్యాంకుల పేరుతో కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ బొడ్డుతాడును దాచాలన్న ఆలోచన సనాతన హిందూ ధర్మానిది. సనాతనధర్మం ప్రకారం
ప్రతి వ్యక్తికి జీవితంలో 16 సంస్కారాలు నిర్వహించాలి.
ఇవి పుట్టుకముందు నుంచి మరణం తర్వాతి వరకు ఉంటాయి. *వీటిలో ఒకటి జాతకర్మ.* ఇది బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులకు చేసే సంస్కారం. పూర్వం ఈ సమయంలోనే (పుట్టినప్పుడు దాచిన) బొడ్డుతాడును తెచ్చి మంత్రించి రాగి తాయత్తులో చుట్టి
భద్రపరిచేవారు. దానికి ప్రత్యేకమైన పద్ధతి ఉండి ఉండవచ్చు. జీహాదీలు, ఆంగ్లేయుల దండయాత్రల్లో భారతదేశం చాలా విజ్ఞానాన్ని కోల్పోయింది.
1740 లో *డా. థామస్ క్రూసో* అనే ఆంగ్లేయుడు (ఈస్ట్ ఇండియా కంపెనీ సర్జన్) బెంగాలులో పర్యటించాడు. అతని పర్యటనలో ఒక ఆశ్చర్యకమైన విషయం వెలుగు చూసింది.
భారతదేశంలో *అమ్మవారుతో (చికెన్ ఫాక్స్)* చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా దాదాపు లేని విధంగా కనిపించిది. ఈ విషయమై తన పరిశోధన మొదలెట్టాడు.
బెంగాలులో *ఒక సాధారణ మంగలి వైద్యుడు* ఒక చిన్న సీసాలోని ద్రవ పదార్థాన్ని సూది ద్వారా శరీరంలోకి ఎక్కించడం చూశాడు. అతను ఇంటింటికీ తిరిగి ఇలా
చేస్తూ ఉండడం *థామస్ క్రూసోకు* ఆశ్చర్యం కలిగించింది.
అతనిని పిలిచి వివరం అడిగాడు. ఆ వైద్యుడు ఇచ్చిన సమాచారాన్ని హౌస్ ఆఫ్ కామన్సులో ప్రవేశపెట్టాడు. *భారత దేశంలో చికెన్ ఫాక్సు, స్మాల్ ఫాక్సుతో మరణాలు లేవు. భారతీయ వైద్యులు దీనికి విరుగుడు కనుగొన్నారు.* వారు చికెన్ ఫాక్స్ వచ్చినవారి
పుండ్లనుండి రసిని తీసి నిలవచేసేవారు. తరువాత కొద్దిమొత్తంలో ఈ రసిని బాగున్న వారి శరీరాలలోకి ఎక్కిస్తున్నారు. దానితో శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పాడు.
దీని వల్ల మనకు విశదమయ్యే విషయాలు మూడు. *★ రోగనిరోధక శక్తి మనశరీరానికి ఉంది అనేది భారతీయులకు తెలుసు* ★ తగిన
మోతాదులో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు *★ వాక్సినుకు మూలసిద్దాంతం ఇది. వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది.* కానీ రోగనిరోదక శక్తి వాక్సినులు యూరోపియన్లు కనుక్కున్నారు అని మరియు *భారతదేశం పైకి విదేశీయులు దండత్తకపోతే
మనం అభివృద్ధి చెందేవారం కాదు అనటం కన్నా విడ్డూరం ఇంకొకటి ఉందా.*
హౌస్ ఆఫ్ కామన్స్ వివరాలు తిరగవేయండి మనకింకా ఇలాంటి చాలా విషయాలు బోధపడతాయి. *అప్పట్లో మనం బొడ్డుతాడును వెండి మొలతాడులో చుట్టించి మొలకు కట్టడం వెనుక ఉన్న విజ్ఞానాన్ని అనాగరికమని ప్రచారం చేశారు. కానీ అసలు విషయం
పరిశోధిస్తే:*
లోహాలకు శరీరంపై ప్రభావం చూపే శక్తి ఉందని గుర్తించారు మన పురాతన హిందువులు. ఈ సంస్కృతి ప్రతి చిన్న విషయం మీదా చాలా లోతైన పరిశోధన చేసింది. వెండిని శరీరంపై ధరించినప్పుడు అది చలువ (Cooling) చేసే గుణం కలిగి ఉంటుంది. అదే బంగారమైతే ఉష్ణగుణం (Heating) కలిగి ఉంటుంది.
ఎక్కడెక్కడ ఉష్ణగుణం అవసరమో, ఎక్కడ శీతలగుణం అవసరమో మన పూర్వీకులకు బాగా తెలుసు.
విషయంలోకి వస్తే స్త్రీ పురుష శరీర నిర్మాణం చూసినప్పుడు పురుషులకు వృషణాలు శరీరం బయట ఉంటాయి. వాటి ఉష్ణోగ్రత సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే 2° తక్కువగా ఉంటుంది. అవి పురుషుల్లో వీర్యోత్పత్తి చేస్తాయి.
ఈ వృషణాలు ఎప్పుడూ కూడా అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వకూడదు. అలా అయితే వీర్య ఉత్పత్తి మీద వీర్యకణాల మీదా ప్రభావం చూపిస్తుంది. ఇవి అధిక ఉష్ణోగ్రతకు లోనవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మొలకు వెండి మొలతాడు కట్టుకుంటామో అప్పుడు ఆ లోహప్రభావం వలన ఆ శరీర ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత
సాధారణస్థాయికి రావడం కానీ అదుపులో ఉండటం కానీ జరుగుతుంది.
అయితే వెండి మొలతాడు కొనే స్థోమత లేకపోవడం చేతనో లేక అది అనాగరికమని భావించటం చేతనో ఇప్పుడు కేవలం వెండి తాయత్తులో బొడ్డుతాడు ఉంచి మొలతాడుకు కడుతున్నారు. అలా వెండి తాయత్తు కట్టడం వెండిమొలతాడు కట్టడం అనాగరికమేమి కాదు.
బంగారు మొలతాడు కట్టకపోవడానికి కారణం మీకు ఇప్పటికే అర్దమై ఉంటుంది. బొడ్డుతాడులో ఉన్న*మూలకణాలను* అనేక రోగాల నివారణకు, చికిత్సకు వాడతారు. అయితే కేవలం రాగి తాయత్తులో కట్టినంత మాత్రం చేతనే ఆ కణాలను భద్రపరచలేము. నైట్రస్ ఆక్సైడ్ వాంటి వాయువులను ఉపయోగించి అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం
చేత వాటిని పరిరక్షించవచ్చు.
కానీ ఇది ఇప్పుడు పెద్ద వ్యాపారమైంది. రోగం వస్తుందో రాదో తెలియదు కానీ, రోగం వస్తుందని ముందే భయపెట్టి అధికమొత్తంలో సొమ్ము చేసుకోవడం కోసం *Stem Cells Banks* తెరవడం నిజంగా బాధాకరం.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

Jul 12, 2023
రోజుకు 12 గంటలు చదివాక కూడా కొడుకు చరిత్ర పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు.

నా కొడుకు ఎందుకు తప్పాడా అని తండ్రికి అనుమానం వచ్చింది.

స్కూల్ కి వెళ్లి కొడుకు రాసిన ఆన్సర్ షీట్ చెక్ చేసాడు.

ప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది ?
కొడుకు సమాధానం : 2014
ప్రశ్న : పాల విప్లవం ఎప్పుడు మొదలైంది ?
కొడుకు సమాధానం : 2014

ప్రశ్న : హరిత విప్లవం ఎప్పుడు మొదలైంది ?
కొడుకు సమాధానం : 2014

ప్రశ్న : దేశంలో పౌర విమానయాన సేవలు ఎప్పుడు మొదలయ్యాయి ?
కొడుకు సమాధానం : 2014

ప్రశ్న : దేశంలో రైలు సేవలు ఎప్పుడు మొదలయ్యాయి ?
కొడుకు సమాధానం : 2014
ప్రశ్న : దేశంలో ఐఐటీ, ఐఐఎం,ఇస్రో, ఎయిమ్స్ ఎప్పుడు మొదలయ్యాయి ?
కొడుకు సమాధానం : 2014 నుండి

ప్రశ్న : భారత సైనిక విభాగాలు సీఆర్పేఎఫ్, సిఐఎసెఫ్, ఐటిబిటి వంటివి ఎప్పుడు ఏర్పడ్డాయి ?
కొడుకు సమాధానం : 2014

ప్రశ్న : భారత దేశంలో పారిశ్రామిక విప్లవం ఎప్పుడు మొదలైంది ?
Read 6 tweets
Jun 19, 2023
అత్తయ్య గారూ ! ఎలా వున్నారూ"? ఆషాడమాసంలో పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మంజూష అత్తగారికి ఫోన్ చేసి కుశలమడిగింది.

"నేను బావున్నానమ్మా! నువ్వెలా వున్నావు?"

"నేనూ బాగున్నానండీ! అత్తయ్య గారూ! మా అమ్మ నేనూ చీరలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళుతున్నామండీ! ఆషాడమాసం కదా చీరలకి
డిస్కౌంట్ పెట్టారు. మీకు కూడా చీర కొందామను కుంటున్నాను. మీకు ఎలాంటి చీర కొనమంటారు ?"

"అలాగా! మంచిదమ్మా! నాకు షాపింగ్ కు వెళ్లే శ్రమ తగ్గించావు.  నువ్వు అడిగావు కాబట్టి చెపుతున్నాను. చీర మీద నా అభిప్రాయాలు నా ఇష్టాఇష్టాలు చెపుతాను. దాన్ని బట్టి ఒక చీర సెలెక్ట్ చేయమ్మా.
అందరూ ఆ చీర చూసి ఆహా! ఓహో! అనాలి. ఏ షాప్ లో కొన్నారు ? 'ఏ కాలేజీలో చదువు తున్నారు' ? అనే లెవెల్ లో ఉండాలి.

చీర మరీ ఎక్కువ ఖరీదు వుండకూడదు. ఎందుకంటే, అంత ఖరీదైన చీర కట్టుకుని బిగుసుకుపోయి, జీవితంలో మొట్ట మొదటి సారి ఫొటో తీయించుకునే వాళ్ల లాగా, ఎక్కడ కూర్చుంటే ఏమి అంటుకుంటుందో
Read 22 tweets
Jun 19, 2023
*'మానవులు' గా బతకటం కాదు.. # 'మానవత్వం' తో బతకాలి!*

@ _*'ఐకమత్యం' - అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే... తేనెతుట్ట మీద రాయి విసిరితే మనమే పారిపోవాలి !*_

# _*ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !*_
@ _దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె' లోనేవున్నాడు._

@ _సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._

@ _కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు.
ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు.. గుర్తుంచుకో!_

@ _'జ్ఞానం'.. ఆలోచించి మాట్లాడుతుంది. 'అజ్ఞానం'.. మాట జారాక ఆలోచిస్తుంది.
Read 13 tweets
Jun 19, 2023
*మౌనం : Silence*

_వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది._

_అయిదు విధాల ‘శాంతి’ లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు._
_‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత.   *‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’* అన్నారు స్వామి వివేకానంద._

_మౌనం మూడు రకాలు._
1. _*ఒకటవది: వాక్‌మౌనం.* వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు.
ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి._
2. _*రెండోది అక్షమౌనం.* అంటే ఇంద్రియాలను నిగ్రహించడం._

3. _*మూడోది కాష్ఠమౌనం*. దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది.
Read 9 tweets
Jun 11, 2023
*_ఇది సోమరిపోతుల_* *_కర్మాగారం!_*

_______________________

పని చేయని వాడు
సోమరిపోతనేది పాతమాట..
ఇప్పుడు వాడే
సర్కారు ముద్దుబిడ్డ..
వాడికి తెల్ల కార్డిచ్చి
దానికి జతగా
బోలెడు స్కీములిచ్చి
ఆపై పించనిచ్చి
సోమరిపోతును
సొమ్మరిపోతుగా
తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం..
ఓటుమారి స్కీములు
దండగమారి స్కాములు..
వారు వీరు అంతా
స్వాహాస్వాములు..!

నిజానికి మన వ్యవస్థలే
సోమరిపోతుల
కర్మాగారాలు..
ఎవరికి ఎప్పుడు
ఏమిస్తాయో తెలియదు..
కులవృత్తులను
సబ్సిడీలకు
అనుకూలవృత్తులుగా మార్చి
పంచేస్తున్నాయి సొమ్ములు..
పెంచేస్తున్నాయి అప్పులు..
ప్రతి కులానికి
ఓ కార్పొరేషన్..
డబ్బులు పంచడం..
పంచుకోడమే
వాటి మిషన్..
*_ఇదో రకం వైరల్ ట్రాన్స్మిషన్..!_*
అన్నామంటే
అన్నామంటారు గాని
ఎవడికైనా ఏదైనా
ఎందుకివ్వాలి ప్రభుత్వం..
ఎవడిని వాడు
పోషించుకోలేడా ఏమి..
కుదిరితే ఉద్యోగమివ్వు..
శ్రమ పడి పరిశ్రమ పెడతానంటే..
బుర్ర పెట్టి వ్యాపారం
చేస్తానంటే అప్పివ్వు..
Read 6 tweets
Jun 11, 2023
*శంకర నారాయణ డిక్షనరి* కథ

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిద గుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం...
వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ళ అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు.
1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో
Read 15 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(