(".... భావ్యమెరుంగవు ... నిరసింతువా..." అని పాఠాంతరం)
-
భట్టు మూర్తి కవిత్వం గురించి అవహేళన చేస్తూ) #చీపర బాపర తీగల
చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ
కాపు కవిత్వపు కూతలు
బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !!
-
(
అల్లసాని పెద్దన కవిని "అమవస" అనే మాట వాడినందుకు వెటకరిస్తూ) #ఎమి తిని సెపితివి కపితము
బెమ పడి వెరి పుచ్చ కాయ మరి తిని సెపితో
ఉమెతక్కయ తిని సెపితో
అమవస నిసి యన్న మాట నలసని పెదనా !!
-
(రాయల వారిని పెద్దన పొగడిన పద్యం) #శర సంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులన్ గల్గి దు
ర్భర షండత్వ బిల ప్రవేశ కలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నర-సింహ-క్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా
నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణా ! రాజ కంఠీరవా !
-
అర్జునుడు, సింహము, క్షితి - ఈ మూడింటిలోని లోపాలు గణించక పోతేనే వీటిని నీతో పోల్చ వచ్చు అని భావం. ఐతే ఒక పాదం లో సింహం తోపోల్చ రాదంటూనే పద్యం చివర "రాజ సింహమా" అని పిలవడం ఏం సబబు ?అని తప్పు చూపించి
తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం-
=
#కలనన్ తావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మా భర్త మార్తాండ మం
డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్ తార కుం
డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయుణుం గాంచి లో
గలగంబారుతునేగె నీవయనుశంకన్ కృష్ణరాయాధిపా !!
(ఇంకొక పద్యం)
-
#నరసింహ కృష్ణ రాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్ గిరిభిత్
కరి కరిభిత్ గిరి గిరిభిత్
కరిభిత్ గిరిభి త్తురంగ కమనీయంబై !
--
("కుంజర యూధంబు.." అనే సమస్యా పూరణ నిచ్చినందుకు కోపం తో)
- #గంజాయి తాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవి గొన్నావా
లంజల కొడకా ఎక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్ !!
(అదే సమస్యను రాయల వారు అడిగినప్పుడు)
-
#రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా
సంజయ విధి నే మందును
కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్ !!
("గొల్వు పాలై రకటా" అని పాఠాంతరం)
--
(నంది తిమ్మన ను పొగడుతూ) #మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !
(
మూడో పాదంలో "గగన ధునీ" అనే ప్రయోగాన్ని "నాక ధునీ" అని మార్చి "రాజ కవి" (కృష్ణ రాయలు) "కవి రాజు" (రామకృష్ణుడు) ప్రశంసను పొందాడని ప్రతీతి)
-
వాకిటి కాపరి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పధకం వేసి చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి.
-
-రజాకార్లు మెట్టుగూడ !
(Dr. #Shrimati Suri, Surgeon, Secunderabad, గారి
అనుభవం వారి మాటల్లో)
@ 1948 ప్రథమార్థంలో ... ఒక రోజు మధ్యాహ్నం నాన్నకి ఒక ముస్లిం స్నేహితుడు చెప్పాడు: "దీక్షితులు గారు, ఈ రాత్రి రజాకార్లు మెట్టుగూడ ప్రాంతంలో హిందూ కుటుంబాల మీద దాడి చేయాలనుకుంటున్నారు.
మీరు జాగ్రత్తగా ఉండండి ..." నాన్న ఇంటికి వస్తూనే చెప్పారు. "ఈ రాత్రికి మనం మన ఇల్లు వదిలేస్తున్నాం. అంతా సవ్యంగా జరిగితే తిరిగి మన ఇంటికి వస్తాం. లేదంటే లేదు. ...!!" తెలంగాణ అంతా రజాకార్ల దురాగతాలతో అట్టుడికిపోతోంది.
వేలాది హిందువుల కుటుంబాలు బలైపోతున్నాయి. నిద్రలోనే నరికివేయబడిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. . హిందువులు ఎక్కడ ఉన్నా రజాకార్ల దాడి వార్తలతో భయపడి పోతున్నారు. నిజాం ప్రభుత్వమే రజాకార్లను పోషిస్తోందన్న ప్రచారంతో హిందూ కుటుంబాలు వణికిపోతున్నాయి... అప్పుడు మేం మెట్టుగూడలో ఉండేవాళ్ళం.
🚩🚩
ఈ మంత్రాలూ చదువుతూ సూర్య నమస్కారాలు చేసిన తరువాత ఈ క్రింది శ్లోకమును చదువ వలెను.
♥ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వన్తి దినే దినే
జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే..
🚩
క్రింద చెప్పిన మంత్రమును చదువుతూ ముమ్మారు సూర్యునకు అర్ఘ్యము నీయవలెను.
దశావతార స్తుతి:-10.-
(కల్కి అవతారం .)
-
"శిష్టాజనావన దుష్ట హర ఖగతురగోత్తమవాహన తే
కల్కి రూపపరిపాల నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!
-
-
కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము.
కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.
"కలక" లేదా "కళంక" అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన.
కల్కి అనగా "తెల్లని గుర్రము" అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం.
కలియుగాంతంలో సాధువుల ఇంట కూడా దైవచింతన నశిస్తుంది. యజ్ఞయాగాదులు మచ్చునకైనా కానరావు.
🚩🚩🚩♥-సత్యం -శివము - సుందరం -♥🚩🚩🚩
సత్యం:-
➡ మన జన్మ ని మనమే ఎన్నుకుని వచ్చాము. సృష్టి జగదీశ్వర సంకల్పం.
➡ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అందరికీ ఈశ్వరుడే గురువు.
➡ ఒకరు ఇంకొకరిని, ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఉన్నది ఈశ్వరుడు మాత్రమే.
➡ సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. జగజ్జీవేశ్వరులుగా ఉన్నదంతా బ్రహ్మమే.
➡ మనం ఈ లోకంలో కేవలం యాత్రికులం మాత్రమే. మనమంతా లేనివారమే.
జ్ఞానం:-
➡ అందరి దగ్గర నుండి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. జగజ్జనని శివజ్ఞాన ప్రదాయిని.
➡ సమయం క్షణమైనా వృధా ఎప్పుడూ చేయరాదు. కాలమే భగవత్స్వరూపము.
➡ శక్తి అణుమాత్రమైనా వృధా ఎప్పుడు చేయరాదు. అణువునందు మహత్తునందు నిండి ఉన్నది పరమాత్మయే.
➡ ఈ వర్తమాన జన్మనే ఆఖరి జన్మగా చేసుకోవాలి. దక్షిణామ్మూర్తి కృపచే మౌనవ్యాఖ్యను పొందాలి.
అనంతం :
🚩కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ .
రెండు రోజుల క్రితం #ప్రధాని మోడీ మాట్లాడుతూ కేంద్ర ఇచ్చిన వాక్సిన్ ని రాష్ట్రాలు వృధా చేస్తున్నాయని అందులో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు.
దీనిమీద కొంతమంది చదువుకున్న శుంఠ లు పోస్టలు పెడుతూ అలా ఎలా వృధా అవుతాయి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
.
1.కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ ఈ రెండు వాక్సిన్లు వరుసగా 5ml మరియు 10ml వయాల్స్ [Vial అంటే సీసా l లలో వస్తాయి. 2. ఒక్కో వ్యక్తికి వాక్సిన్ ఇవ్వాల్సిన పరిమాణం 0.5 ml ఒక డోసు గా ఇవ్వాల్సిఉంటుంది. కోవాక్సిన్ 5 ml వయల్ లో వస్తుంది
కాబట్టి 10 మందికి 0.5 ml డోసులు ఇస్తే ఒక సీసా అయిపోతుంది అలాగే కొవీషీల్డ్ అయితే 20 మందికి సింగిల్ డోస్ గా ఇవ్వవచ్చు. 3. ఒకసారి వయాల్ ఓపెన్ చేస్తే 4 గంటలలోపే వాడేయాలి ఆ తరువాత ఆ సీసా లో ఉన్న వాక్సిన్ చెడిపోతుంది.