I am retired scientist.నేను రచయతను కాను. నాకు తోచిన , చదివిన విషయాలు మీతో పంచుకుంటాను.... అంతే కానీ అవి నా రచనలు కావు.
Sep 18, 2023 • 12 tweets • 2 min read
-రజాకార్లు మెట్టుగూడ !
(Dr. #Shrimati Suri, Surgeon, Secunderabad, గారి
అనుభవం వారి మాటల్లో)
@ 1948 ప్రథమార్థంలో ... ఒక రోజు మధ్యాహ్నం నాన్నకి ఒక ముస్లిం స్నేహితుడు చెప్పాడు: "దీక్షితులు గారు, ఈ రాత్రి రజాకార్లు మెట్టుగూడ ప్రాంతంలో హిందూ కుటుంబాల మీద దాడి చేయాలనుకుంటున్నారు.
మీరు జాగ్రత్తగా ఉండండి ..." నాన్న ఇంటికి వస్తూనే చెప్పారు. "ఈ రాత్రికి మనం మన ఇల్లు వదిలేస్తున్నాం. అంతా సవ్యంగా జరిగితే తిరిగి మన ఇంటికి వస్తాం. లేదంటే లేదు. ...!!" తెలంగాణ అంతా రజాకార్ల దురాగతాలతో అట్టుడికిపోతోంది.
దశావతార స్తుతి:-10.-
(కల్కి అవతారం .)
-
"శిష్టాజనావన దుష్ట హర ఖగతురగోత్తమవాహన తే
కల్కి రూపపరిపాల నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!
-
-
కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము.
కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.
Mar 27, 2021 • 4 tweets • 2 min read
🚩🚩🚩♥-సత్యం -శివము - సుందరం -♥🚩🚩🚩
సత్యం:-
➡ మన జన్మ ని మనమే ఎన్నుకుని వచ్చాము. సృష్టి జగదీశ్వర సంకల్పం.
➡ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అందరికీ ఈశ్వరుడే గురువు.
➡ ఒకరు ఇంకొకరిని, ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఉన్నది ఈశ్వరుడు మాత్రమే.
➡ సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. జగజ్జీవేశ్వరులుగా ఉన్నదంతా బ్రహ్మమే.
➡ మనం ఈ లోకంలో కేవలం యాత్రికులం మాత్రమే. మనమంతా లేనివారమే.
జ్ఞానం:-
➡ అందరి దగ్గర నుండి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. జగజ్జనని శివజ్ఞాన ప్రదాయిని.
🚩కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ .
రెండు రోజుల క్రితం #ప్రధాని మోడీ మాట్లాడుతూ కేంద్ర ఇచ్చిన వాక్సిన్ ని రాష్ట్రాలు వృధా చేస్తున్నాయని అందులో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు.
దీనిమీద కొంతమంది చదువుకున్న శుంఠ లు పోస్టలు పెడుతూ అలా ఎలా వృధా అవుతాయి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
.
1.కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ ఈ రెండు వాక్సిన్లు వరుసగా 5ml మరియు 10ml వయాల్స్ [Vial అంటే సీసా l లలో వస్తాయి. 2. ఒక్కో వ్యక్తికి వాక్సిన్ ఇవ్వాల్సిన పరిమాణం 0.5 ml ఒక డోసు గా ఇవ్వాల్సిఉంటుంది. కోవాక్సిన్ 5 ml వయల్ లో వస్తుంది
Mar 26, 2021 • 6 tweets • 2 min read
♥-బిజీ ...🤣🤣🤣
ఏవిటి శ్యామల?.. మీ ఆయన్ని పట్టుకుని అలా చితక బాదేస్తున్నావ్?
చూడు శాంతక్కా.. పొద్దున్న ఈయనకి ఫోను చేస్తే,
ఒక అమ్మాయి..,
"మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీ గా ఉన్నారు."
అని చెప్పింది మరి. "
(వ్.వ్.ఆ.)
♥-కట్నం ....🤣🤣🤣🤣
"రోజూ పెద్ద దేవాలయం దగ్గర అడుక్కునే వాడివి కదా..?
ఇవాళ ఇక్కడ చేరావేమిటి?"
"ఆ చోటుని మా అల్లుడికి కట్నం కింద ఇచ్చేశాను.
ఇక ఇవాళ్టి నుంచి ఇక్కడే..
(వింజమూరి .)
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Mar 25, 2021 • 5 tweets • 2 min read
🚩గుమ్మడి అమ్మ గుమ్మడి .🌹🌹
.
👉🏿ఇంత గొప్ప నటునికి పద్మశ్రీ రాలేదు.
.
మొదటి చిత్రంలో నటించే సమయంలో చిత్రం నిర్మణం పూర్తి అయ్యే వరకు నటుడు నాగయ్య కార్యాలయంలోని ఒక రూములో నివసించిన గుమ్మడి వెంకటేశ్వరరావు తరువాత తన మకామును హోటల్ రూముకు మార్చాడు.
ఆసమయంలో ట్.ఎన్.టి ఆఫీసు ఎదురుగా ఉన్న హోటల్ రూములో సంగీత దర్శకుడు టి.వి.రాజుతో కలసి ఉన్న ఎన్.టి. రామారావుతో ఏర్పడిన పరిచయం సన్నిహితంగా మారి అది రామారావు స్వంత చిత్రంలో వేషం ఇచ్చే వరకు వెళ్ళింది. ఎన్.టి. రామారవు ఇచ్చిన అవకాశం గుమ్మడి వెంకటేశ్వరరావును చిత్రసీమలో కొనసాగేలా చేసింది.
Mar 25, 2021 • 7 tweets • 3 min read
శుక్లాం బరధరం వర్సెస్ కాఫీ.♥
☕☕
కాంచి మహా పెరియవర్ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మంచి హాస్య ప్రియులు. ఒకరోజు తన శిష్యుని పిలిచి,
"సంధ్యా వందనం అయిందా? శుక్లాం బరధరం అయిందా? "అనిఅడిగారు.
వెంటనే ఆ శిష్యుడు అయిందని తల ఆడించాడు.
దానికి మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం చెప్పావా అని అడగలేదు. అయిందా అని అడిగాను " అన్నారు.
శిష్యుని కి ఏమీ అర్థం కాలేదు. పెరియవర్ ఏమని అడిగారు? ఈ పదాలకు వున్న భేదాలేవీ బోధపడక పరితపించాడు. అతనికి సందేహంగాను వుంది. .......
Mar 25, 2021 • 4 tweets • 2 min read
♥🙏- మన పెద్దవారు .🙏♥
🚩🚩
మూలన పడేస్తే వృద్ధులు, వ్యర్థులు..
ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే పార్వతీ పరమేశ్వరులు..♥
బతుకు బాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి, కాపాడే సిద్ధులు వృద్ధులు....♥
వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు..
అనుభవాల గనులు ఆపాత బంగారాలు....♥
🔥
వదిలేస్తే వృద్ధులు మంచానికి బద్ధులు....♥
చేయూతనిస్తే ప్రతి వృద్ధులు ఓ బుద్ధులు....♥
నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ల ముసలి..
తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రములు....♥
ఒకనాటి బాలురే ఈనాటి వృద్ధులు....♥
🌹🌹🔥🔥🔥🔥🔥
♥కాకినాడ పెసరట్లు తినాలంటే పెట్టి పుట్టాలి ☝🌹
👌ఆబ్బో ఇంతోటి పెసరట్లకి పెట్టిపుట్టాలా ఏం మేము చేసుకునేవి పెసరట్లు కావా అంటే అవి మీరు చేసుకునేవి ఇవి కాకినాడవి .బోల్డంత తేడా ఉంది.మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేస్తారా వెయ్యరు,
మీరు పెసరట్టు పైన ఎర్రకారం వేసి ఆపైన పచ్చి పెసరపప్పుని కూడ వేస్తారా వెయ్యరు ఇవన్నీ కాదు పెసరట్ మీద బాగా నెయ్యి వెయ్యడానికి ఇష్టపడాతారా అదీ లేదు అలాంటప్పుడు మీ పెసరట్ కి కాకినాడ పెసరట్ కి తేడా ఉంది తినాలంటే పెట్టిపుట్టాలనే మాట ఒప్పుకోవాలి కదా.
Mar 24, 2021 • 7 tweets • 2 min read
వదిన గారి కబుర్లు 🌹
అనగా , అనగా మా ఇంటిలో అందరు ప్లేడర్లె .
తాత కి తాత నుంచి , మా నాన్న వరకు . అందరు అంతస్తుల వ క్కి ల్ లే . నాన్న తప్ప . అందుకే అమ్మ మమ్మల్ని లా చ ద వ నీయ లేదు ,
మమ్మల్ని ఆ చ దువు చదివిన వారికి కట్ట పెట్ట లేదు .
ఇంక చుడండి ఇప్పటి సాఫ్ట్ వేర్ లా , మా అందరము బ్యాంకు లొల్లమె 🙂.
ఒకడు ఆంధ్ర బ్యాంకు , ఒకడు సిండికేట్ బ్యాంకు ,
ఒకరు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా , హైదరాబాద్ .........ఇంకమా మొత్తం పిల్ల గ్యాంగ్ సాఫ్ట్ వేర్ .
Mar 24, 2021 • 4 tweets • 2 min read
🚩🚩🌹శుభోదయం -దశావతార స్తుతి:-7.-🌹🚩🚩
(రామావతారం. )
-💥
"సీతా వల్లభ దాశరథే దశరథనందన లోక గురో
రావణమర్ధన రామనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయ న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!💥
🚩🚩
ధర్మరక్షాస్వరూపమే రామావతారం:
రామః అంటే ఆనందస్వరూపుడు. రామనామస్మరణ చేస్తే ఆనందం లభిస్తుంది. ఆ నామంలో ఉన్న మంత్రశక్తి మనలో దుఃఖాల్ని సమూలంగా నాశనం చేసి ఆనందాన్ని ఇస్తుంది. భవభయజనితమైన అజ్ఞానాన్ని, అవిద్యని పోగొట్టి మోక్షాన్ని ఇవ్వడమే ఆనందం.
Mar 2, 2021 • 10 tweets • 2 min read
🚩🚩కాకినాడ విశిష్టతలు :🚩🚩
. 1) న్యూయార్క్ నగరము మాదిరిగా వీధులు రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత. 2) ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ. 3) ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ మద్రాసుగానూ,
4) చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ ముంబయిగానూ, 5) ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్ గానూ, 6) భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 ఉత్తర రేఖాంశం కాకినాడ మీదుగా పోతుంది.
Mar 2, 2021 • 7 tweets • 2 min read
🙏 భక్తుడు-బిచ్చగాడు 🤲
👉ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు.
చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.
రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.
ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే.
ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......
బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు.
Feb 4, 2021 • 7 tweets • 2 min read
🔴 *సామజవరగమన..అంటే అర్ధం ఎంత మందికి తెలుసు?* #తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా , ఒక పాట హోరెత్తుతోంది . అదే *సామజవరగమన* చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది , అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది ... కానీ చాలా మందికి " సామజవరగమన " అంటే ఏంటో తెలీదు..
*సామజవరగమన ' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది* ... ' సామజ ' అనగా " ఏనుగు " అని ..' వరగమనా ' అనగా " చక్కని నడక " అని అర్థం ... అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం! " సామజవరగమన " అంటే ఏనుగు లా గంభీరంగా , హుందాగా , ఠీవిగా నడిచేవారు అని అర్థం ..
Feb 4, 2021 • 12 tweets • 2 min read
🔻వివేకచూడామణి -(4 వ భాగం ) !
- #శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.
- 4. ఆధారం – వస్తుతత్త్వం :
ఈ మారుతున్న జగత్తు వెనుక, మారని ఆధారం, మారని సత్యం మనం గ్రహించగలిగితే, అప్పుడే మనం నిజాన్ని గ్రహించామని చెప్పవచ్చు.
ఆ సత్యం తెలుసుకోనంతవరకు, మన జ్ఞానం నిజమైనది కాదని, భ్రమకు లోనైనదని చెప్పవచ్చు.
Feb 3, 2021 • 8 tweets • 2 min read
🌹🌺కుమార సంభవము-మహాకవి కాళిదాసు.🌺🌹
💥💥 #కుమారసంభవం కవికుల గురువుగా ప్రసిద్ధి పొందిన మహాకవు కాళిదాసుచే రచింపబడి ప్రసిద్ధి పొందిన కావ్యము.
తారకాసుర సంహారం కొరకు శివ పార్వతుల వివాహము, కుమార స్వామి జననం ముఖ్యమైనవి.
దక్షుడు యజ్ఞము చేయ సంకల్పించి దేవతలు, రాక్షసులతో సహా సమస్త లోకానికిఆహ్వానం పంపి తన అల్లుడైన పరమేశ్వరునిపై గల చులకన భావంతో శివునికి మాత్రమే ఆహ్వానం పంపడు. దీనికి బాధ పడ్డప్పటికీ సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళాలన్న కోరికను భర్త అయిన పరమేశ్వరుని వద్ద ప్రస్తావిస్తుంది.
Feb 2, 2021 • 6 tweets • 2 min read
🔻భాగవతము -- పోతన-ప్రహల్లాదుడు !🔻
-
"#మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే? మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే ? తరంగిణులకు
లలితా రసాల పల్లవ ఖాదియైచోక్కు కోయిల సేరునే? కుటజములకు
బూర్నేందు చంద్రికా స్పురిత చకోరకమ్మరుగునే? సాంద్రనీహారములకు "!
.
"#అంబుజోదర దివ్య పాదారవింద
చింతనా మృత పాన విశేషమత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్తు?
వినుత గుణసీల ! మాటలు వేయునేల ?"
.
ప్రహల్లాదునికి ఈ హరి భక్తీ గువులే నేర్పుచున్నారనే అనుమానం తండ్రికి కలిగింది.
ప్రతీ వ్యక్తికీ సంస్కారాన్ని బట్టి మనసు మార్గం అబ్బుతాయి .
Feb 2, 2021 • 23 tweets • 4 min read
వివేకచూడామణి- (3వ భాగం)!
- #శ్రీఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు.
- 3. మార్పు – ఆధారం :
మార్పును తెలుసుకోవటానికి ఒక మారని వస్తువు ఆధారంగా, ప్రమాణంగా ఉండాలి. నిన్న ఒక చోట చూసిన చెట్టు, నేడు అక్కడ లేకపోతే ఆ మార్పును గ్రహించగలం. ‘నిన్న అక్కడ చెట్టు ఉండేది, ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నిస్తే, ‘ఎక్కడ?’ అనే ప్రశ్న పుడుతుంది.